Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

స్కానింగ్‌లో తప్పుడు రిపోర్టు!

$
0
0

ఆదోని, ఏప్రిల్ 20: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చిన తప్పుడు రిపోర్టు అభం, శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారి శిశువు మృతికి కారణమైంది. శుక్రవారం శిశువు తల్లిదండ్రులు, బంధువులు ఉదయమే ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొన్న టౌన్ సిఐ రమణ, ఎస్సై జీవన్‌లు ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులో తెచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండలంలోని బసాపురం గ్రామానికి చెందిన సిపిఐ మండల నాయకులు రామలింగ తన భార్యకు కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. స్కానింగ్ చేయించగా అందులో తల లేని శిశువు గర్భాశయంలో ఉందని, అది తొలగించకపోతే తల్లి ప్రాణానికి ముప్పు అని వెంటనే తొలగించాలని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నట్లు రామలింగ పేర్కొన్నారు. శిశువును సిజరిన్ ఆపరేషన్ ద్వారా తొలగించాలని, ఇందుకు రూ.30 వేలు దాకా ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారన్నారు. అయితే తాను ఇంత ఖర్చు పెట్టలేనని ప్రభుత్వ స్ర్తిల చిన్నపిల్లల వైద్యులను ఆశ్రయించానని వారు సాధారణ కాన్పు చేశారని రామలింగ వివరించారు. అయితే అన్ని అవయవాలతో ఉన్న మగశిశువు జన్మించిందని, తల, కాళ్లు, చేతులు అన్ని బాగున్నాయని, కానీ శిశువు మాత్రం మృతి చెందిందని కన్నీటితో వాపోయారు. తమకు ప్రైవేట్ వైద్యశాల వైద్యాధికారి తప్పుడుగా స్కానింగ్ చేసి తల లేని శిశువు ఉందని చెప్పిందని, అందువలన తాము భయపడి కాన్పు చేయించుకున్నామని పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం వలన ఇది జరిగిందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ వైద్యశాల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాత చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని టౌన్ సిఐ హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. అయితే ఇప్పటికే లింగ నిర్థారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ సంఘటన చేసుకోవడం గమనార్హం.

ఉప ఎన్నికల అనంతరం
కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 20: రాష్ట్రంలో జరుగు 18 ఉప ఎన్నిక స్థానాల్లో వైఎస్సార్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భూమా నాగిరెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీ అభ్యర్థి గెలిచిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని, కాంగ్రెస్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వైఎస్సార్సీ పార్టీలో వచ్చిన ఆశ్ఛర్యపడే అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చంద్రబాబుకు బలమైన నాయకులు ఎవరు లేరని, టిడిపిలో ఉన్న నాయకులకు బయటకు ఎలా పంపాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. ఈ రోజు వైఎస్సార్సీ పార్టీ నాయకులు జగన్ కొరకు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్నారని, రాష్ట్రంలో సిఎం కుర్చీని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని, కాంగ్రెస్, టిడిపి రెఫరెండంతో ముందుకెళ్లడం లేదని వైఎస్సార్సీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి రెఫరెండంతో ముందుకొస్తే తాము రాజకీయంగా తప్పకుంటామన్నారు. రాబోవు రోజు ల్లో టిడిపిలో ఎవరు ఉండరని, ఉప ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీలోకి రావడానికి కాంగ్రెస్, టిడిపి వారు క్యూ కడతారని, వార్డు మెంబర్లుగా గెలవని వారు రాజకీయం గురించి మాట్లాడడం తగదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరు వైఎస్సార్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని గెలిపించడానికై తాము సైనికుల్లా పనిచేస్తామని, ఈమేరకు ఎమ్మిగనూరు ఉప ఎన్నికల ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి గోనెగండ్ల మండల ఇన్‌చార్జి, ఎమ్మిగనూరు టౌన్ ఇన్‌చార్జిగా గౌరు వెంకటరెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, నందవరం మండల ఇన్‌చార్జిగా కోట్ల చక్రపాణి, ఎమ్మిగనూరు మం డల ఇన్‌చార్జి డాక్టర్ మధుసూదన్‌లను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. సమావేశంలో వైఎస్సా ర్సీ జిల్లా నాయకులు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిలు పాల్గొన్నారు.
పున్నమి గెస్ట్‌హౌస్‌కు నోటీసులు
మంత్రాలయం, ఏప్రిల్ 20: మంత్రాలయంలోని ఆం.ప్ర. టూరిజం పున్నమి గెస్ట్‌హౌస్ 2005నుంచి 2012వరకు ఎటువంటి పన్నును పంచాయతీకి చెల్లించకపోవడంతో రూ.4 లక్షల 5 వేల 408లు బకాయిలు పడడంతో పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నోటీసులను పంపిస్తున్నా స్పందించకపోవడంతో రాష్ట్ర కమిషనర్ కూడా సమాచారం అందించడం జరిగిందని ఎగ్జిక్యూటివ్ అధికారి జనార్థన్ తెలిపారు. శుక్రవారం జిల్లా టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి మంత్రాలయం వచ్చి పున్నమి గెస్ట్‌హౌస్ యొక్క బకాయిలను విచారణ చేశారు. వెంటనే పన్ను బకాయిలను చెల్లించాలని లేకపోతే పై అధికారులకు సమాచారం ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

రాయలసీమ అభివృద్ధికి
లక్ష కోట్లు కేటాయించాలి
*బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు శాంతారెడ్డి
ఆళ్ళగడ్డ, ఏప్రిల్ 20: రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రూ. లక్ష కోట్ల ప్యాకేజిని ప్రకటాంచాలని బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు శాంతారెడ్డి అన్నారు. ఆళ్ళగడ్డ పట్టణంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరెడ్డిలక్ష్మిరెడ్డితో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాయలసీమ ప్రజల జీవనాధారమైన వ్యవసాయం అభివృద్ధి చెందడంలో భాగంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆమె అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే స్రీభాగ్ ఒడంబడికను అమలు చేయాలని కోరారు. బిజెపి తరపున పోతిరెడ్డిపాడును వెడల్పు చేసుందుకు పాదయాత్రలు చేపట్టామని దాని ఫలింతంగానే పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం జరిగిందన్నారు. తాము రాయలసీమను అభివృద్ధి చేసేందకు కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచుతున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సీటీ ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాయిని పెంచడం, గోదావరి జలాలను రాయలసీమకు రెండు టి ఎంసీలను ఉపయోగించుకొనేలా చేయడం తదితర డిమాండ్లను ఉంచుతున్నామన్నారు. 2014 కల్లా ప్రాజెక్ట్‌ల పూర్తి చేసి సాగునీరు అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

వ్యవసాయ కళాశాల అభివృద్ధికి
2 కోట్లతో ప్రతిపాదనలు
మహానంది, ఏప్రిల్ 20: మహానంది వ్యవసాయ కళాశాల అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రవీంద్రనాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మట్లాడుతూ నూతనంగా వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ కోర్సు ప్రవేశపెట్టామని, ఈ ఏడాది నుంచి ఆ కోర్సులో అదనంగా ఎక్స్‌టెన్సన్ ఎకనామిక్స్, ఎంటమాలజి డిపార్టుమెంట్లను ప్రవేశపెట్టేందుకు నివేదికలు పంపామన్నారు. ఇందులో ఫీల్డ్ వర్క్, బాల బాలికల అదనపు హాస్టల్ భవనాలు, సెమినార్ బిల్డింగ్ హాల్, జిమ్, డైనింగ్ హాలు, ఫామ్ ల్యాబొరేటరీకి అదనపు గదుల కొరకై ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. 2011-12 సంవత్సరంలో కళాశాలకు మిగులు నిధులను లైబ్రరీకి రూ.2 లక్షలు, కళాశాలకు రూ.లక్ష మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులను వౌలిక వసతులకు, పుస్తకాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించాలనే ఈ నివేదికలు తయారుచేసినట్లు ఆయన తెలిపారు.

పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చిన తప్పుడు రిపోర్టు అభం, శుభం తెలియని
english title: 
wrong scanning report

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>