బూర్జ, ఏప్రిల్ 20 : మండలంలోని పెద్ద లంకాం గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 పూరిళ్ళు భష్మీపటలమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్థినష్టం సంభవించినట్లు బాధితులు లబోదిబో మంటున్నారు. బాధితులు ఉదయానే్న సమీపంలో ఉన్న చెరువులో ఉపాధి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో గుంట సత్యనారాయణ ఇంటి నుండి మంటలు చెలరేగాయి. స్థానికులు 108 సహాయంతో పాలకొండ అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారందరూ కష్టజీవులు, ఉపాధి కూలీలే. పాలకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి లక్ష్మణస్వామి తన సిబ్బందితో వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సంఘటనలో దేశుల్ల పెద్ద అప్పలసూరికి చెందిన రెండెకరాల చెరకు పంటకు సంబంధించిన బెల్లం కాలి బూడిదయ్యింది. అలాగే గురాన నాయుడుకు చెందిన రూ.50వేలు నగదు, ఇంటి నిర్మాణం కోసమని గుంట సత్యనారాయణకు చెందిన రూ. 30 వేలు నగదు దగ్ధమైంది. ఈప్రమాదంలో ఈదుల తవిటయ్యకు చెందిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఎడ్ల రాంబాబు, బోడ పద్మావతిలకు గాయాలయ్యాయి. అలాగే మొయ్యల వెంకట్, కింజరాపు సత్యనారాయణ, దేశుల్ల చిన్నప్పలసూరికి చెందిన బ్యాంకు పాస్‌పుస్తకాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మంటల్లో కలిశాయి. విషయం తెలుసుకున్న వీఆర్‌వో ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనావేశారు. శుక్రవారం సాయంత్రం తహశీల్దార్ బి. రామారావు గ్రామాన్ని చేరుకుని బాధితుల నుండి వివరాలు సేకరించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పాలకొండ అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సంఘటనా స్థలానికి ఆలస్యంగా రావడంతో ఆస్థినష్టం అధికంగా జరిగిందని బాధితులు తివ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి తమ్మినేని పరామర్శ :
లంకాన గ్రామంలో అగ్ని ప్రమాదం బాధితులను మాజీ మంత్రి , సీనియర్ దేశం పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ్మినేని శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్టు తరపున బాధితులకు వంట పాత్రలు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనె్నపు రామకృష్ణ, కత్తెర నర్శింహారావు, టి. వెంకటప్పారావు తదితరులు ఉన్నారు
మండలంలోని పెద్ద లంకాం గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఘోర అగ్ని
english title:
fire accident
Date:
Saturday, April 21, 2012