విజయనగరం, ఏప్రిల్ 23: జిల్లా ఎస్పీ కార్తికేయపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వస్తున్న చంద్రబాబు నాయుడును అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక పోలీస్ బారెక్స్ వద్ద చంద్రబాబు నాయుడును సుమారు గంటసేపు ఓపెన్ టాప్ జీపులోనే నిలిబెట్టడంతో పోలీసులపై ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎస్పీ కార్తికేయను పిలిచి, నువ్వు జిల్లాకు ఎస్పీవా లేక అధికార పార్టీకి తొత్తువా? అంటూ మండిపడ్డారు. మిస్టర్ ఎస్పీ దిసీజ్ డెమక్రసీ.. దిసీజ్ నాట్ డిక్టేటర్.. గివ్ ప్రయార్టీ అండ్ రెస్పెక్ట్ అంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. నీవు ఒక ఉద్యోగి అన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నావు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్నవారిని అడ్డుకునే హక్కు నీకెవరిచ్చారని ప్రశ్నించారు. బారికేడ్లను దాటుకుని లోపలకి వెళ్ళాలంటే మా వాళ్లకు ఒక్క నిమిషం పట్టదు, అలాంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్న మాపై జులుం ప్రదర్శిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. ఇక్కడేం జరిగినా నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తావు? ఎస్పీగా మాత్రమే ప్రవర్తించు. కాంగ్రెస్ తొత్తుగా పనిచేస్తే ఇబ్బందుల్లో పడతావు అంటూ ఎస్పీ కార్తికేయపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎస్పీ కార్తికేయ పరిస్థితి సోమవారం చాలా దారణంగా కనిపించింది. ఓపక్క బొత్స సత్యనారాయణ. ప్రభుత్వాన్ని, అధికార పార్టీనీ శాసించే వ్యక్తి ఆయన. ఆయన ఆగ్రహిస్తే, ఎంతటి అధికారైనా ఏమైపోతారోనన్న భయం. మరోపక్క చంద్రబాబు వీరిద్దరి మధ్య కార్తికేయ నలిగిపోయారు. చంద్రబాబు దూషణలకు ఆయన చిన్నబోయారు.
జిల్లా ఎస్పీ కార్తికేయపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
english title:
n
Date:
Tuesday, April 24, 2012