సబ్బవరం, ఏప్రిల్ 23: జిల్లాకలెక్టర్‌తో చర్చించి ఆరిపాక పంచాయతీ పరిధిలోని రైతులు,డ్వాక్రా మహిళలకు ఇబ్బందికరంగా మారిన ప్రస్తుత బ్యాం కు సేవల నుంచి తప్పించి కొత్త బ్యాం కును ఏర్పాటు చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు హామీ ఇచ్చారు. మండలంలో సోమవారం ప్రజాపథం ఆరిపాక సభలో ప్రజలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గతంలో ఇక్కడ వైశ్యాబ్యాంకు అధికారులు తర్వాత ఈ బ్రాంచిని అనకాపల్లికి తరలించినందున తమ పంచాయతీ పరిధిలోని రైతులు, స్వయం సహాయక సంఘాలకు ఇబ్బందులు ప్రా రంభమయ్యాయని గ్రామ ప్రజాప్రతినిధులు మళ్లకోటేశ్వరరావు, వి.రమేష్, కోటేశ్వరరావు,ఎ.బంగారయ్య,విఎస్‌ఎన్.రాజు ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే బ్యాంకును ఇక్కడ తెరిపించాలా? అని ప్రశ్నించిన ఎమ్మెల్యేతో వారంతా వద్దని వేరే కొత్త బ్యాంకు బ్రాంచీని ఏర్పాటు చేసి సహాయపడాలని అర్థించారు. దీం తో తాను జిల్లాకలెక్టర్ దృష్టికి తెచ్చి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తానని పంచకర్ల హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పంచాయతీకి 10 లక్షలతో రక్షిత నీటి పథకం, 18లక్షలతో ప్రపంచ బ్యాంకు పథకం, చినయాతపాలెంలో 50వేలతోమినీ పధకాలు మంజూరు చేశానన్నారు. ఇక్కడి మంచినీటి ఇబ్బందులపై 3 రోజుల్లో పరిస్థితులు చక్కదిద్దాలని ఆర్‌డబ్ల్యూఎస్ జె.ఇ.సావిత్రిని ఆదేశించా రు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులపై ఆర్‌ఇసి.ఎస్.ఎ.పి.ఇపై ఎమ్మెల్యే ఆగ్రహ ం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో పనిచేయకపోతే వాటికి అర్ధం పరమార్ధమేముంటుందని మందలించారు.ఇక్కడి శ్రీనగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో రక్షిత పథకం నిర్మిస్తేరెండు ప్రాంతాలకు తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది గ్రామస్థులు చేసిన విజ్ఞప్తిపై పరిశీలిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం రైతులకు,డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న పావలావడ్డీరుణాలను ఇకపై ఎలాంటి వడ్డీలేకుండా పొందవచ్చునన్నారు.
అంతకుముందు గొటివాడలో జరిగిన గ్రామసభలో ఉపాధిహామీ పథకంలో పనిచేసే కూలీలకు 2-3 నెలలకొకసారి పేమెంట్లు చేయటం పట్ల ఎమ్మెల్యే మండిపడ్డారు. డుమా అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో పే మెంట్లు జరిగేలా చూస్తామన్నారు. ఇక్క డ ఐదుగురు మహిళలకు బాలికాసంరక్షణ పథకంలో ఇద్దరేసి ఆడపిల్లలకు 30వేల రూపాయల చొప్పున సహాయం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గవరశ్రీనివాసరావు, పిబివిఎస్‌ఎన్ రా జు(బుచ్చిరాజు),సాలాపు వెంకటేశ్వరరావు,ఆర్‌ఇసిఎస్ డైరెక్టర్ నారాయణమూర్తి,కరణం రామనాయుడు, బలిరెడ్డిఅప్పారావు,బోకం మురళి, స్పెషలాఫీలరు ఎం.వెంకటేశ్వరరావు,అధికారులు అనిత,వెంకటలక్ష్మి,శిరీషారాణి, ఎ. విజయ,ఇందిర,సావిత్రి,ఎం.శ్రీనివాస్, బి.గోవింద్ పాల్గొన్నారు.
జిల్లాకలెక్టర్‌తో చర్చించి ఆరిపాక పంచాయతీ పరిధిలోని
english title:
bank shifting
Date:
Tuesday, April 24, 2012