జి.మాడుగుల, ఏప్రిల్ 23: మండల కేంద్రంలోని గాంధీనగర్‌లోగల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు కలుషిత నీటి వాడకం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆరవ తరగతి చదువుతున్న సూర్యమణి పరిస్థితి విషమించడంతో పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యసేవలు అందిస్తుండగా విద్యార్థ్ధిని మరణించింది. మరో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై స్ధానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స లు పొందుతున్నారు వీరిలో వంతాల భారతి, 7వ తరగతి విద్యార్దిని పరిస్ధితి విషమంగా ఉండగా, 3వ తరగతి విద్యార్థినులు కె.సంధ్యారాణి, కె.చిన్ని, వి.శాంతికుమారి, 4వ తరగతి విద్యార్థినులు జి.బేబిరాణి, వి.సీమకుమారి, ఎస్.్భవానీ, జి.వరలక్షీ కుమారి, కె.ప్రి యాంక. 5వ తరగతి విద్యార్థినులు వి. బాలకుమారి, ఎల్.ఝాన్సీ, సి.హెచ్ .పద్మావతి, ఎస్.్భగ్యశ్రీ, కె.ముత్యాల మ్మ, ఎ.రూత్, ఆర్.సరస్వతి, 6వ తరగతి విద్యార్థినులు యు.తులసి, ఎం.ఈ శ్వరి, జి.శాంతకుమారి, 7వ తరగతి వి ద్యార్థినులు టి.వినయమ్మ, కె.గంగాభవానీ, వి.్భరతీదేవి ఉన్నారు. పాఠశాల సిబ్బంది వీరిని స్ధానిక ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో అధికంగా వాంతులు, విరోచనాలతోపాటు జ్వరం ఉన్నట్లు తెలిసింది. పాఠశాలలో విద్యార్థినులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడానికి పాఠశాలలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే కారణమని తెలియవస్తోంది. కలుషిత నీటిని సేవించడమే విద్యార్థినులు డయేరియా బారిన పడడానికి కారణమై ఉండవచ్చని వైద్యసిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాల ఎ.ఎన్.ఎం.సైతం సెలవులో ఉండడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థినులను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.
* గిరిజన బాలికల పాఠశాలలో పలువురు విద్యార్థినులకు అస్వస్థత
english title:
atisara
Date:
Tuesday, April 24, 2012