విశాలాక్షినగర్, ఏప్రిల్ 23: యానిమేటర్లను తక్షణమే విఒఏలుగా గుర్తించాలని కోరుతూ ఇందిరాక్రాంతి పథకం(ఐకెపి) యానిమేటర్లు సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసించిన ఆందోళనకారులు కలెక్టరేట్ లోపలకు వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొంది. ఫలితంగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చేతికందిన వారిని అందినట్టుగా అదుపులోకి తీసుకుని వ్యాన్‌ల్లోకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విధంగా దాదాపు 150 మంది అరెస్టు అయ్యారు. దీంతో పరిస్థితి మెరుగుపడింది. కాగా విఒఏలుగా గుర్తించాలని, కనీస వేతనం నెలకు మూడు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామైక్య సంఘాల నిర్వహణతో కీలకపాత్ర నిర్వహిస్తున్న యానిమేటర్లను విఒఏలుగా నియమించి, కనీస వేతనం రూ. 300లు చెల్లిచే విధంగా ఆదేశాలు వెంటనే జారీ చేయాలని ఈనెల 9వతేదీ నుండి రాష్టవ్య్రాప్తంగా చేస్తున్న సమ్మె సోమవారానికి 15 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించకపోవడం విచారకరమన్నారు. ఐకెపితో యానిమేటర్లుగా రాష్టవ్య్రాప్తంగా సుమారు 36 వేల మంది గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నారన్నారు. రికార్డుల నిర్వహణ, పావలావడ్డీ రుణాలు, ఆమ్ ఆర్మీ, అభయ హస్తం వంటి 27 రకాల పనులతోపాటు ప్రభుత్వ పథకాల అమలు ప్రచారానికి కృషి చేస్తున్న ప్రభుత్వం వారీ సమస్యలపట్ల నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమైన చర్యగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఎస్.రమేశ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, కోటీశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
యానిమేటర్లను తక్షణమే విఒఏలుగా గుర్తించాలని కోరుతూ ఇందిరాక్రాంతి పథకం(ఐకెపి)
english title:
animators
Date:
Tuesday, April 24, 2012