మదనపల్లె, ఏప్రిల్ 23: మూతపడిన చిత్తూరు విజయ డెయిరీని తెరిచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా కలికిరి మండలం నగరివారిపల్లిలోని స్వగృహంలో బసచేసిన ముఖ్యమంత్రిని సోమవారం ఉదయం బంగారుపాళ్యంకు చెందిన పాడిరైతుల సంఘం ఉద్యమనేత వెంకటాచలంనాయుడు కలిసి డెయిరీని తెరిపించాలని కోరారు. వందకోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన చిత్తూరు విజయ డెయిరీని తెరిచే ప్రసక్తేలేదు... ఈ విషయం ఐదేళ్ళ మునుపే చెప్పా.. నీవు ఎన్నిమార్లు వచ్చినా నా వద్ద ఈ మాటే ఉంటుంది... అంటూ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4 లక్షల లీటర్ల పాలు బిఎంసిల ద్వారా సేకరిస్తున్నామన్నారు. వీటిని మరింత అభివృద్ధి చేస్తే 6లక్షల లీటర్ల పాలను సేకరించవచ్చన్నారు. ఇలాఉంటే ముఖ్యమంత్రిని కలిసేందుకు పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరిని భద్రతా సిబ్బంది అడ్డుకోబోగా ముఖ్యమంత్రి వారించారు.
సిఎం
english title:
మూతపడిన చిత్తూరు విజయ డెయిరీని తెరిచే ప్రసక్తే లేదని
Date:
Tuesday, April 24, 2012