న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: సీనియర్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన రెండో సంవత్సరంలోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరుకున్న హైదరాబాదీ సంచలనం 16 ఏళ్ల సింధు తాను భవిష్యత్తులో మరో సైనా నెహ్వాల్‌ను అవుతానని ధీమాగా చెప్తోంది. ఈ రెండేళ్ల కాలంలో సింధు మాల్దీవులు, ఇండోనేసియా, స్విజర్లాండ్, ముంబయిలో జరిగిన టాటా ఓపెన్.. ఇలా మొత్తం నాలుగు అంతర్జాతీయ చాలెంజ్ పోటీల్లో గెలుపొందడమే కాకుండా డచ్ ఓపెన్ చాంపియన్‌షిప్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. దీంతో గతంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 151వ స్థానంలో ఉండిన సింధు గత నెలలో 27వ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి టాప్ 15లోకి చేరుకోవాలన్నది తన లక్ష్యమని కూడా ఆమె చెప్తోంది. 6మరో సైనా నెహ్వాల్ అవుతావని చాలా మంది నాతో అంటున్నారు. కానీ అది అది అంత సులభం కాదు. అందుకు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో సైనా నెహ్వాల్ స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఆమె ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానంలో ఉంది. ఆ స్థాయికి నేను కూడా చేరుకుంటానని అనుకుంటున్నా’ అని సింధు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నేను దాదాపుగా ప్రతిరోజూ సైనాతో ప్రాక్టీస్ చేస్తున్నాను. అంతేకాదు, మేమిద్దరమూ కలిసి శిక్షణ పొందుతున్నాం. అవసరమైన సలహాలు ఇవ్వడానికి గోపీ సార్ (కోచ్ పుల్లెల గోపీచంద్) ఉండనే ఉన్నారు. అంతేకాదు, నేనెప్పుడయినా టోర్నమెంట్‌నుంచి తిరిగి వచ్చి ఆ విషయం సైనాకు చెప్తే అక్కడ ఏమయిందని వివరాలు అడుగుతుంది కూడా’ అని సింధు చెప్పింది. బుధవారంనుంచి ఇక్కడ ప్రారంభం కాకున్న యోనిక్స్ సన్‌రైజ్ ఇండియా ఓపెన్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం కోసం సింధు ఏసియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌ను సైతం వదులుకుంది. ఈ పోటీలకోసం తాను చాలా కష్టపడి శిక్షణ పొందుతున్నానని, ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని అనుకుంట4న్నానని సింధు చెప్పింది. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు చైనీస్ తైపేకు చెందిన జు యింగ్‌ను ఢీకొంటుంది. గతంలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో యింగ్ చేతిలో ఓడిపోయిన సింధు ఈ సారి మాత్రం ఆమెను ఓడించగలనని ధీమాగా చెప్తోంది.
సైనా ఒక్కరే..
కాగా, సైనా నెహ్వాల్ తప్పిస్తే లండన్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించగల సత్తా ఉన్న భారతీయ ఆటగాళ్లు ఎవరూ కనిపించడం లేదని ఇండోనేసియాకు చెందిన మాజీ ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ తౌఫిక్ హిదాయత్ అభిప్రాయ పడ్డాడు. ‘్భరత్‌లో చాలా మంది బ్యాడ్మింటన్ క్రీడాకారులున్నారు కానీ, వాళ్ల స్థాయి అత్యున్నత స్థాయిలో మాత్రం లేదు. ఒక్క సైనా నెహ్వాల్‌కు మాత్రమే ఒలింపిక్ పతకాన్ని సాధించే సత్తా ఉంది’ అని బుధవారంనుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన హిదాయత్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. మాజీ ప్రపంచ చాంపియన్ అయిన ఈ ఇండోనేసియా క్రీడాకారుడు ఏథెన్స్ ఒలిపింక్స్ స్వర్ణ పతక విజేత కూడా. 31 ఏళ్ల హిదాయత్ తన రిటైర్మెంట్‌పై ఇంకా నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. లండన్ ఒలింపిక్స్ తర్వాత దీనిపై ఆలోచిస్తానని ఆయన చెప్పాడు.
సీనియర్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన రెండో సంవత్సరంలోనే
english title:
sindhu
Date:
Wednesday, April 25, 2012