న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌టేక్ నగరంలో జరుగుతున్న సీనియర్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఎన్ సోనియా చాను మంగళవారం మహిళల 48 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడంతో పతకాల పట్టికలో భారత్ బోణీ కొట్టింది. ఢిల్లీ కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించిన సోనియా ఈ చాంపియన్‌షిప్స్‌లో జరిగిన తొలి పోటీలో 75 కిలోలు ఎత్తడం ద్వారా స్నాచ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. కాగా, క్లీన్ అండ్ జర్క్‌లో వంద కిలోల బరువు ఎత్తడం ద్వారా అయిదో స్థానంలో నిలవగా, మొత్తం 175 కిలోలు ఎత్తడం ద్వారా మొత్తంమీద అయిదో స్థానంలో నిలిచింది. లండన్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ పోటీ అయిన ఈ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్‌కు సంబంధించి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, మొత్తం బరువు-ఇలా ప్రతి విభాగంలోను మూడు పతకాలు ప్రదానం చేస్తారు. కాగా, 48 కిలోల విభాగంలో పోటీలో ఉన్న మరో భారతీయ అథ్లెట్ కె సంజయ్ చాను మొత్తం మీద 162 కిలోల బరవు ఎత్తి 11వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్ తరఫున 15 మంది వెయిట్ లిఫ్టర్లు పాల్గొంటుండగా, వారిలో ఏడుగురు మహిళలున్నారు.
దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌టేక్ నగరంలో జరుగుతున్న సీనియర్ ఆసియా
english title:
sonia gets bronze
Date:
Wednesday, April 25, 2012