హైదరాబాద్, ఏప్రిల్ 24: ఫార్మా ఉత్పత్తుల రంగంలో ప్రముఖ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ 2012 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి 37 శాతం నికర రాబడి పెరిగి రూ.653 కోట్లు ఆర్జించినట్లు ఆ కంపెనీ ఎండి కృష్ణప్రసాద్ తెలిపారు. నికర లాభం రూ.30 కోట్లు, పన్నులు చెల్లించక ముందు (పిబిటి) రూ.43 కోట్లు ఆర్జించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం నాడిక్కడ విలేఖరుల సమావేశంలో కంపెనీ వార్షిక ఆర్ధిక ఫలితాలను వెల్లడించారు. 2011 మార్చితో ముగిసిన ఆర్ధిక సంత్సరంలో ఫినిష్డ్ డోసేజ్ రూ.101 కోట్లు విలువైనవి విక్రయిస్తే 2012 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరం రూ.185 కోట్ల విలువైనవి విక్రయించినట్లు చెప్పారు.
గ్లోబల్ పార్ టనర్‌షిప్‌లో ప్రవేశించిన టెక్ మహీంద్రా, సిఏ టెక్నాలజీస్
హైదరాబాద్, ఏప్రిల్ 24: టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం కంపెనీ గ్లోబల్ ఐటీ మేనేజ్‌మెంట్ అండ్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ సిఏ టెక్నాలజీస్‌తో గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ (జిఎఫ్‌ఏ) చేసుకుంది. ప్రస్తుతం ఉన్న, కొత్తగా వచ్చే వినియోగదారులకు సంయుక్తంగా తమ వ్యాపార సేవలను అందించేందుకు వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. అప్లికేషన్ ఫెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, టెస్ట్ ఆటోమేషన్, సెక్యూరిటీ, ఎంఎస్‌పి వంటి సేవలను అందిస్తున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. టెల్కో, మాన్యుఫాక్చరింగ్, బిఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్ కేర్ వెర్టికల్స్‌లో వినూత్నంగా సేవలందించడం ఒప్పందంలో ఒక భాగమని స్పష్టంచేశాయ.
ఫార్మా ఉత్పత్తుల రంగంలో ప్రముఖ కంపెనీ
english title:
granules india
Date:
Wednesday, April 25, 2012