న్యూఢిల్లీ, ఏప్రిల్ 24:ప్రైవేట్ రంగంలోని విమానయాన సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలు రూ.14,573 కోట్లకు పెరిగి పోయాయి. ఇందులో 2011-12 సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ రుణ బకాయిలే దాదాపు 80% మేరకు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ పిఎస్‌యు బ్యాంకులకు రూ.5899 కోట్లు బాకీపడగా, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ బకాయిలు రూ.5748 కోట్లదాకా ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి నమోనారాయణ్ మీనా మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థలకు పిఎస్‌యు బ్యాంకులు ఇచ్చిన రుణ వివరాలను ఆయన సభకు తెలియజేశారు. కాగా, కింగ్‌ఫిషర్ రూ.7057.08 కోట్ల మేరకు అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
యూబిఐ, సిబిల రుణాల రేట్లు తగ్గుదల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబిఐ), కార్పోరేషన్ బ్యాంక్(సిబి)లు తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. 0.15 శాతం మేర తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ఇరు బ్యాంకులు 10.65 నుంచి 10.50 శాతానికి కనీస రుణ రేటును దిగజార్చాయి. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. తగ్గిన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని రెండింటికి చెందిన బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి.
:ప్రైవేట్ రంగంలోని విమానయాన సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలు
english title:
private airlines dues
Date:
Wednesday, April 25, 2012