హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి పైచేయిగా నిలిచారు. హైదరాబాద్ జిల్లాలో 58.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 65.84 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాలో 82,682మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 36,550మంది బాలికలు కాగా 46,132మంది బాలురు ఉన్నారు. బాలికల్లో 69.55శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 62.90శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. వీరిలో ఏ గ్రేడ్‌లో 34,561మంది, బి గ్రేడ్‌లో 12,956మంది. సి గ్రేడ్‌లో 4,967మంది, డి గ్రేడ్‌లో 1,951మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా పదిమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. 16మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచగా 28,221మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అలాగే హైదరాబాద్ జిల్లాలో సైతం 53,886మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 27,623మంది బాలురు, 26,263మంది బాలికలు ఉన్నారు. 58.68శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 66.08 శాతం బాలికలు, 51.64 శాతంమంది బాలురు ఉన్నారు. ‘ఏ’ గ్రేడ్‌లో 15,781మంది, ‘బి’గ్రేడ్‌లో 9,782మంది, ‘సి’ గ్రేడ్‌లో 4,548, ‘డి’గ్రేడ్‌లో 1,507మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 22,244మంది ఫెయిల్‌కాగా 22మంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థుల ఫలితాలన విత్‌హెల్డ్‌లో పెట్టార
........................
హుస్సేన్‌సాగర్ బురద తొలగింపునకు
నిధుల కొరత!
హైదరాబాద్, ఏప్రిల్ 24: రోజురోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న హుస్సేన్‌సాగర్‌లోని నీటిని శుద్ధి చేయటంతో పాటు చెత్తాచెదారాన్ని ఎప్పటికపుడు తొలగించటం వివిధ ప్రభుత్వ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా నగరవాసులను మినీ బీచ్‌గా ఆకట్టుకుంటున్న హుస్సేన్‌సాగర్ చెరువుప్రక్షాళన, చెత్తాచెదారం తొలగింపునకు సంబంధించి అధికారులు ఎప్పటికపుడు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న వాదనలూ ఉన్నాయి. హుస్సేన్‌సాగర్‌లో చెరువులోని ఆరులక్షల టన్నుల సాధారణ బురద, అలాగే మరో నాలుగు లక్షల టన్నుల మేరకు ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన బురద ఉన్నట్టు గతంలోనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ గుర్తించింది. అయితే ఈ రెండు రకాల బురదను తొలగించే విషయంపై హెచ్‌ఎండిఏ కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదించగా, ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన నాలుగు లక్షల టన్నుల బురదను బయటకు తీసేందుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు మండలి నిరాకరించినట్టు తెల్సింది. తొలుత ఆరు లక్షల టన్నుల మేరకున్న సాధారణ బురదను తీసిన తర్వాత రసాయనాలతో కూడిన బురద తొలగింపుపై దృష్టి సారించాలని సూచించినట్లు తెల్సింది. ప్రమాదకరమైన రసాయనాల బురదను బయటకు తీస్తే, దాన్ని శాస్ర్తియంగా ఎక్కడ ఎలా డిస్పోజ్ చేయాలన్న అంశం అంతుచిక్కకపోవటం వల్లే కాలుష్య నియంత్రణ మండలి క్లియరెన్స్‌కు నిరాకరించినట్లు సమాచారం. అయినా చెరువులో సాధారణ బురదనైనా తొలగిస్తే, చెరువులోని నీటి పరిస్థితి కొంత మెరుగుపడుతుందని భావించిన హెచ్‌ఎండిఏ ఎంతో హడావుడి చేసి రూ. 30కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేసినా, అవి నేటికీ ఫలించలేదు. గత జనవరి మాసంలో ఈ పనుల కోసం టెండర్లను కూడా ఖరారు (మిగతా 5వ పేజీలో)
చేసినా, నేటికీ పనులు ప్రారంభం కాలేదు. రూ. 30 కోట్ల నిధుల కోసం ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెల్సింది. మరోవైపేమో హెచ్‌ఎండిఏ నిధుల కొరతతో అల్లాడిపోతున్నందున, ఈ బురదను బయటకు తీసేందుకు మరింత జాప్యం జరుగుతున్నందున, చెరువులో రసాయనాలతో కూడిన బురద మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. రోజురోజుకి చెరువులో పెరిగిపోతున్న కాలుష్యాన్ని కొంతమేరకైనా తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు మోక్షం కల్గిస్తేగానీ పనులు చేపట్టే పరిస్థితి లేదని హెచ్‌ఎండిఏ భావిస్తున్నట్లు తెల్సింది.