న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కెజి బేసిన్‌లో సహజవాయువు, చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసి కెజి బేసిన్‌ను అభివృద్ధి చేస్తున్న రిలయన్స్‌కు రోజురోజుకు తగ్గిపోతున్న ఉత్పత్తి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి డి9 క్షేత్రాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కెజిలో మైనారిటి షేర్ హోల్డర్‌గా కొనసాగుతున్న హార్డి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ తెలిపింది. సహజవాయువు నిల్వలు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. కనీసం గ్యాస్ వెలికితీతకయ్యే ఖర్చు సైతం గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ తవ్వకాలు జరిపేందుకున్న లైసెన్సును వెనక్కించేందుకు రిల్ నిర్ణయించుకున్నట్లు సంస్థ పేర్కొంది. 2003లో ఈ క్షేత్రాన్ని రిలయన్స్ గెలుచుకోగా, డి9 విడిచిపెట్టాలనుకుంటున్నట్లు రిలయన్స్ నుంచి ఈ నెల 23న ఓ ప్రతిపాదన తమకు అందిందని హార్డి ఆ యిల్, గ్యాస్ కంపెనీ తెలియజేసింది.
కెజి బేసిన్‌లో సహజవాయువు, చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
english title:
d9
Date:
Wednesday, April 25, 2012