నూతన తారలతో అమ్మా నాన్నా ఫిలింస్ పతాకంపై ‘గమనం’ అనే చిత్రం ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోలో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
తొలి షాట్‌పై శాసనసభ్యుడు రాజేందర్ క్లాప్ ఇవ్వగా దర్శకుడు చంద్రమహేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అంజి శీను మొదటి సన్నివేశానికి దర్శకత్వం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వెంకట్ ద్రోణాదుల మాట్లాడుతూ- విద్యార్థులు ఉద్యోగం కోసం పడుతున్న తపన, దానితదనంతర పరిస్థితులలో వారి కెరీర్ ఎలా ఉంటుందనే అంశంపై ఈ చిత్ర కథ ఉంటుందని, రాజశేఖర్ మేనల్లుడు మదన్, మరో హీరో అమర్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారని తెలిపారు.
దర్శకుడు ఎం.మణింద్ర మాట్లాడుతూ- మరో హీరో, ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాల్సి ఉందని, అన్ని పాత్రలు రియలిస్టిక్‌గా చిత్రంలో ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మదన్, అమర్, చిర్రావూరి విజయకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:కిషన్ కవాడియా, పాటలు:విజయకుమార్, కెమెరా:పి.ఎస్.వంశీకృష్ణ, మాటలు:వీరబాబు బాసిన, ఆర్ట్:వెంకటేశ్వర్లు, నిర్మాత:వెంకట్ ద్రోణాదుల, కధ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎం.మణీంద్ర.
నూతన తారలతో అమ్మా నాన్నా ఫిలింస్ పతాకంపై ‘గమనం’ అనే చిత్రం ప్రారంభమైంది.
english title:
gamanam
Date:
Thursday, April 26, 2012