రాష్ట్రంలో పరిశ్రమలకైనా, ఇతర అవసరాలకైనా ప్రభుత్వం భూములను సేకరించేందుకు, పంపిణీ చేసేందుకు శాస్ర్తియ విధానం ఉండాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనమిక్ జోన్స్-సెజ్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో భూములను కేటాయించిన మాట వాస్తవమే. ఈ కేటాయింపుల్లో ఎక్కడైనా ఏవైనా కారణాల మూలంగా పొరపాట్లు జరిగి ఉంటే తప్పు దిద్దుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న భూసేకరణ, పంపిణీ విధానాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నట్టు గుర్తించాం. అందుకే ప్రస్తుతం అమలులో ఉన్న భూపంపిణీ విధానంలో సమూల మార్పులు, చేర్పులు తీసుకువస్తూ, శాస్ర్తియ విధానంలో కొత్త పాలసీని రూపొందించడంలో నిమగ్నమయ్యాం. భూముల సేకరణకు కొత్త విధానాన్ని (ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ-2011) రూపొందించేందుకు ముసాయిదా రూపొందించి, అన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించాం. గతంలో భూపంపిణీలో ఉన్న లోటుపాట్లను పరిశీలించి కొత్త విధానం రూపొందిస్తున్నాం. భూముల కేటాయింపుకోసం ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలతో పాటు ఇతర అభివృద్ధి పనులకు భూముల కేటాయింపు అంశం ఈ కమిటీ పరిశీలిస్తుంది.
ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం మా ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు. 2004లో మేము అధికారంలోకి వచ్చిన సమయంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉండేది. రైతులు అనేక కష్టాల్లో ఉండేవారు. దాంతో మొదట రైతులకు అన్ని విధాలా చేయూత ఇస్తూ, వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టగలిగాం. ఆహార పదార్థాల ఉత్పత్తులను పెంచగలిగాం. ఇదే సమయంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వగలిగాం. పేదలకు మేము దాదాపు ఏడులక్షల ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు సెజ్‌ల కోసం సుమారు 85 వేల ఎకరాలను సేకరించగలిగాం. వీలైనంత వరకు నిరుపయోగమైన భూమినే సెజ్‌లకోసం సేకరించాం. చట్టానికి అనుగుణంగానే భూసేకరణ జరిగింది. రైతులకు అవసరమైన నష్టపరిహారం చెల్లించాకే భూసేకరణ చేశాం. వీటిలో ఎక్కడైనా తప్పు జరిగితే పునఃపరిశీలించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటికే అనేక సెజ్‌ల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అనివార్య పరిస్థితుల్లో సెజ్‌లు పూర్తిగా వినియోగంలోకి రాలేదు. వీటిపై మేము ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా భూములను వినియోగిస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే మా ఉద్దేశం, మా లక్ష్యం. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూడవద్దని నేను కోరుతున్నాను. విమర్శలు చేసేవారు కూడా అన్ని కోణాల్లో పరిశీలించి సద్విమర్శ చేస్తే బాగుంటుంది. కేవలం ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం సముచితం కాదన్నదే నా ఉద్దేశం.
రాష్ట్రంలో పరిశ్రమలకైనా, ఇతర అవసరాలకైనా ప్రభుత్వం భూములను సేకరించేందుకు,
english title:
bhoo
Date:
Thursday, April 26, 2012