Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో అకాల వర్షం

$
0
0

కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 25 : జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల్లో భాగంగా జిల్లా అంతటా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. అనేక చోట్ల ఒక మోస్తారు వర్షాలు కూడా పడ్డాయి. దీని ప్రభావం వల్ల ఒక సారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉక్కపోతతో, కరెంట్ కోతతో తల్లడిల్లిన జనానికి కొంతో ఊరట నిచ్చింది. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రత భారీగా పెరుగుతూ వచ్చింది. గత వారం రోజులుగా 43 డిగ్రీల వేడి పెరిగింది. ఉదయం 10 గంటల నుండే జనం బయటకు రావాలంటే బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. 11 గంటలకే గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ ప్రాంతాల్లో వీధులు నిర్మానుషంగా మారాయి. వృద్ధులు, పిల్లలు విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉష్ణోగ్రత కారణంగా అనేక బావులు, బోర్లలో నీరు ఇంకిపోయి గుక్కెడు నీటికి కూడా కష్టకాలం మొదలైంది. ఈ ప్రభావం వల్ల జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ ప్రాంతాల్లో సైతం దాపురించింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కిలో మీటర్ల కొద్ది ఊరిబయట పొలాల్లో ఉన్న బోర్లు, బావుల ద్వారా నీరు తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ప్రధానంగా రెండేళ్లుగా జిల్లాలో వరుస కరవులు రావడం, వర్షాలు లేకపోవడం వంటి పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు భారీగా ఇంకిపోయాయి. పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మే నాటికి జిల్లాలో తీవ్రమైన దాహార్తి ఏర్పడుతుందని అటు అధికారులు, ఇటు ప్రజలు కలవరపాటులో ఉన్నారు. విద్యుత్ కోత ఒక వైపు, ఉక్కపోత మరో వైపు ఏర్పడడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. కాగా బుధవారం హఠాత్తుగా చోటు చేసుకున్న వాతావరణ మార్పులో భాగంగా తేలికపాటి వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
రేపు చంద్రబాబు రాక
రైల్వేకోడూరు, ఏప్రిల్ 25 : ఉప ఎన్నికల దృష్ట్యా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రైల్వేకోడూరు పట్టణానికి వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు కస్తూరి విశ్వనాథ్‌నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. సాయంత్రం రోడ్ షో ఉంటుందని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మండలంలోని కుక్కల దొడ్డి గ్రామం నుంచి భారీ మోటారు సైకిల్ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అలాగే పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. మరోవైపు రాజంపేట డిఎస్పీ మునిరాయమయ్య ఆధ్వర్యంలో స్థానిక సిఐ రసూల్‌సాబ్, ఎస్సై బాల మద్దిలేటి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సమర్థవంతంగా
ఉప ఎన్నికలు నిర్వహిస్తాం
* ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి : ఎస్పీ
రాయచోటి, ఏప్రిల్ 25: జిల్లాలో జరగనున్న మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా పేర్కొన్నారు. బుధవారం రాయచోటి పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి సారించి, ప్రజలతో మమేకమై పని చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కుడున్నాయో అక్కడ సమస్య సృష్టిస్తున్న వ్యక్తులను బైండోవర్ చేయడం, ఆ కేంద్రాల వద్ద అధిక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల్లో జరిగే సమస్యలు, సమాచారాలను తీసుకుంటూ ఉండాలని సూచించారు. కౌనె్సలింగ్ సెంటర్లు, ర్యాగింగ్ కార్యక్రమాలు చేపడతానన్నారు. ఇప్పటికే గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర వాటిపై తమ సిబ్బంది అలర్ట్‌గా ఉన్నారని, ఇకపై కూడా అదే విధంగా ఉంటామన్నారు. ప్రస్తుతం నక్సల్స్ సమస్య ఎక్కడా లేదని, వారి కదలికలు ఎక్కడా లేవన్నారు. ఈ సమావేశంలో పులివెందుల డిఎస్పీ జయచంద్రుడు పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన్ ప్రకటనతో
నేతల ఎత్తులు!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 25 : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల నగారా మోగించడంతో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రక్రియపై ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఉప ఎన్నికలు జరుగుతాయని ఊహించిన కాంగ్రెస్, టిడిడిలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఎన్నికల గడువు సమీపించడంతో డీలా పడ్డారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం త్వరగా ఎన్నికలు జరిగితే తమకే లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలను వాయిదా వేసినట్లయితే తమకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, సకాలంలో ఎన్నికల కోసం ఆ పార్టీ నేతలు ఉన్నత న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాలని అనుకున్నారు. అయితే ఎన్నికల నగారా మోగడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాజకీయ పార్టీల అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారం నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ ఆలస్యంగా వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ మూడు నియోజకవర్గాల్లో రూ. 400 కోట్ల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. అయితే ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో పాటు ఎన్నికల కోడ్ అడ్డంకితో ప్రజల ముందు తాము ఏమని ఓటు అడగాలో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలైన ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒక పర్యాయం జిల్లా పర్యటన చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మూడు నియోజక వర్గాల్లో అభ్యర్థులు కొదవలేదు. పోటాపోటీగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే అధిష్ఠానం నుండి గ్రీన్‌సిగ్నల్ వచ్చే వరకు అభ్యర్థులు ఎవరనేది తెలియదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది.
రమణాచారిని కలిసిన
జిల్లా కళాకారులు
కడప (కల్చరల్), ఏప్రి 25 : రాష్ట్ర సాంస్కృతిక శాఖ గౌరవ సలహాలదారుగా రమణాచారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతి సాంస్కృతిక వ్యవహారాల మండలి కార్యాలయంలో జిల్లా కళాకారులు ఆయన్ను కలసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ గౌరవ సలహాదారుడు కెవి. రమణాచారిని జిల్లా కళాకారులు రాకా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి, గాయకులు జివి. రమణ, కడప ఆకాశవాణి విశ్రాంత సంగీత కళాకారుల బిఎస్.నారాయణ, ధార్మిక వేత్త జి.శేషారెడ్డి, ప్రముఖ నటులు మోతుకూరి మునిస్వామి, రామయ్య తదితరులు కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కళాకారులు వ్యయ ప్రయాసాలతో తనను కలసిన వారందరికీ అభినందనలు తెలియజేయడంతో పాటు జిల్లా కళారంగాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపినట్లు తెలిపారు.
జిల్లా ప్రజల హృదయాల్లో తనకు సుస్థిర స్థానం ఉండడం, తిరుమలేశుని ఆశీస్సులన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కళారంగానికి సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులకు సేవ చేయడం తన సౌభాగ్యం భావిస్తున్నామన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లఘించిన వారిపై
చర్యలు తీసుకోండి
రాయచోటి(టౌన్), ఏప్రిల్ 25: ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంగా పని చేయాలని ఆర్డీఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అన్ని మండలాలకు తహశీల్దార్లు, ఎంపిడిఓలు, డిఎస్పీలకు, సిఐలకు, ఎస్‌ఐలకు ఎన్నికల నిబంధనలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార సంబంధానికి సంబంధించి ప్లెక్సీ బోర్డులను, ఇతరత్రా ప్రచార కా ర్యక్రమాలు చేపట్టినట్లయితే చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎ న్నికల జరిగే ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు గురించి పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని పని చేయాలన్నారు. అదే విధంగా మద్యం ఇతర ప్రాంతా ల నుంచి తరలించే అవకాశాలు ఉ న్నాయని, వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే భారీ మొత్తంలో నగదు పంపిణీకి పాల్పడే అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేరే విధంగా చేసినా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో పోలీసులకు ఆటంకం కలిగిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంగా పని చేసి పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి ఓటర్ల వారిగా ఆయా కేంద్రాలకు గట్టి బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో పులివెందుల డిఎస్పీ జయచంద్రుడు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
28 నుంచి అగస్థేశ్వరస్వామి
బ్రహ్మోత్సవాలు
ప్రొద్దుటూరు అర్బన్, ఏప్రిల్ 25: పట్టణ నడిబొడ్డున వెలసి ఉన్న శ్రీ అగస్థేశ్వరస్వామి దేవాలయంలో ఈనెల 28వతేదీ వైశాఖ శుద్ద సప్తమి శనివారం నుండి మే 7వతేదీ బహుళ పాడ్యమి సోమవారం వరకు అగస్థేశ్వరస్వామిబ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అగస్థేశ్వరస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి , కార్యనిర్వాహణాధికారి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.
అగస్థేశ్వరస్వామి ఆలయ చరిత్ర
పూర్వం అగస్థ్య మహాముని ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందని వయోవృద్దులు తెలుపుతున్నారు. అందుకే ఈ ఆలయంలోని శివలింగం అగస్థేశ్వరస్వామిగా పిలువబడుతూ భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. అగస్థేశ్వర ఆలయాన్ని 8వ శతాబ్దంలో తెలుగు చోళ రాజు నిర్మించడం జరిగిందని చరిత్రలో పేర్కొనడం జరిగింది. 1498లో విజయనగర రాజు ఉమ్మడి నరశింహరాయలు సైన్యాధికారి నరసానాయకుడు అగస్థేశ్వర ఆలయంను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దేవాలయాలు మన సంస్కృతికి , నాగరికతలకు నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి. దైవ స్ఫూర్తికి ఆలయాలు దోహదం చేస్తున్నాయి. మంచి ఆలోచనకు దేవాలయ ప్రాంగణం దోహదకారి ప్రొద్దుటూరు ఆలయాలు సర్వోదేవత సమ భావన తత్వరితతో విరాజిల్లు తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణం నడిబొడ్డున వెలసిన శ్రీ అగస్థేశ్వర ఆలయం అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఎందరెందరో ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించి తరించారు. 14్భషలు నిష్ణాతుడైన శతాధిక గ్రంధకర్త మహాకవి పుట్టపర్తి నారాయణచార్యులకు ఎనలేని కీర్తిప్రతిష్ఠను ఆర్జీంచి పెట్టిన శివతాండవం, కావ్య సృష్టికి స్ఫూర్తి మూలం. ప్రొద్దుటూరు అగస్థేశ్వరుడు ఈ కావ్య కథానాయకుడుగా పేర్కొన్నారు. ఈయనే నారాయణ చార్యుల వారుగా చెబుతున్నారు. మనశ్శాంతి కోసం అగస్థేశ్వర దేవాలయం ప్రాంగణంలో గడ్డి మొక్కల మధ్య రాళ్లపై కూర్చొని స్వామి వారిని అంతర్గతంగా దర్శిస్తూ అమితానందంతో తేలిపోయే వారిగా చెబుతున్నారు. అట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు స్వామి వారికి 101 ప్రదర్శనలు చేస్తూ పుట్టపర్తి నారాయణచార్యులు శివతాండవం కావ్య సృష్టిచేసినట్లు తెలుస్తోంది. అగస్థేశ్వరాలయం ప్రాంగణంలో పుట్టపర్తి నారాయణచార్యుల స్మృతి చిహ్నంగా వేదికను ఏర్పాటు చేయడమైనది. అగస్థేశ్వరాలయంలో రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేకంగా గర్భగుడి, అంతరాలయంలు ఉన్నాయి. ఈరెండు గుళ్లను కలుపుతూ ఒకే ముఖం మండపం నిర్మించడం జరిగిందన్నారు. మొదటి గర్భగుడిలో మూడు అడుగుల ఎత్తుగల అగస్థేశ్వరస్వామి లింగ రూపంలో ప్రతిష్టించారు. రస సిద్ధికి సంబంధించిన గుంటలు కూడా ఈ శివలింగంపై దర్శించవచ్చు. అంతరాలయంలో వీరభధ్రుడు, కార్తీకేయుడు, గణపతి విగ్రహాలు ఉన్నాయి. వీరభధ్రుడు సమభంగ స్థానంలో నిలుచొని 8హస్తములు కలిగి ఉన్నాడు. పాదాల కింద మేక తల, చెక్కబడి ఉంది. కార్తీకేయుడు నెమలిపై కూర్చొని 12హస్తములను, 6తలలను కలిగి ఉన్నాడు. ఎడమ వైపు గర్భగుడిలో రాజరాజేశ్వరి నిలుచున్న భంగిమలో రెండు హస్తములు కుడిహస్తములో కమలం కలదు.
ముఖ మండపం
అగస్థేశ్వర స్వామి ముఖ మండపంలో వరుసగా నాలుగు స్థంబాలుగా రెండు వరుసలలో 8స్థంభాలలో నిర్మించారు. రెండు ముఖములు ఒకే తల కల్గిన సింహాలు, స్నేహాభావంతో కలుస్తున్నాయి. రెండు ఏనుగుల స్థంభాలపై మనోహరంగా తీర్చి దిద్దారు. మండపంపై కప్పులో పుష్పం రెండు పాదముల పైనిలబడ్డ సింహాలు చెక్కించారు. ఆలయంపై గల రెండు విమానాలు ద్రవిడ పద్దతిలో వరుస క్రమంలో కలిగి ఉన్నాయి. ఈ ఆలయం ముందుభాగాన పెద్ద పుష్కరుని ఉండేదని పెద్దలు చెబుతున్నారు. ఈ పుష్కరుణి పూర్తిగా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించడమైనది. పుష్కరుణి కనిపించకపోయిన ఆ ప్రదేశానికి కోనేటి కాలువ వీధి పేరు స్థిరపడింది.
భీమలింగేశ్వర సుందరేశ్వరస్వామి ఆలయాలు
ప్రధాన ఆలయానికి ఎడమవైపు భీమలింగేశ్వరస్వామికి చిన్న గర్భగుడి నిర్మించారు. ఈ గర్భగుడికి అంతరాలంలో ముఖమండపాలు కలవు. ముఖ మండపానికి అధిష్ఠానం అమర్చారు. ఈ ఆలయం ముందుభాగాన సుందరేశ్వరస్వామి ఆలయం కలదు. అదేవిధంగా అగస్థేశ్వరస్వామి ప్రధాన ఆలయానికి ఎడమై వైపున కొదండ రామస్వామి ఆలయం నిర్మించారు. గర్భగుడిలో లక్ష్మణుడు, రాముడు, సీత, వరుసగా ప్రతిష్ఠించారు. లక్ష్మణుడు అంజలి ముద్రలోను, శ్రీ రాముడు అభయ ముద్రలోను సీత కమలం చేతపట్టి ప్రసన్నంగా దర్శనమిస్తారు. కింది భాగాన ఆంజనేయుడు, అంజలి ముద్రలో ఉన్నాడు. ముఖ మండపంలో గరుడ అంజలి ఘటిస్తూ రాముల వారికి అభిముఖంగా నిలుచున్నాడు. బలిపీఠం , ధ్వజ స్తంబం కలవు. అక్కడే తేదీలేని శాసనం ఒకటి కనిపిస్తుంది. 120 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పుతో ఎతె్తైన ప్రకారములుకలిగి నాలుగు దిక్కుల నాలుగు రాజగోపురాలను నిర్మించారు. ఒక్కోక్క రాజగోపురంపై సువర్ణ మిలితమైన ఐదు కలశములను నాలుగు గోపురములపైన ప్రతిష్ఠ చేయడం జరిగినది. 1966 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి చంధ్రశేఖరేంధ్ర సరస్వతి, 1988లో జయేంద్రసరస్వతీ అగస్థేశ్వర స్వామిని సేవించి రాజగోపురం బంగారు కలశాల ప్రతిష్ఠ కుంభాభిషేకం చేయించడమైనది. తూర్పు రాజగోపురంపై పుష్పగిరి పీఠాధిపతి విధ్యా నృశింహ భారతిస్వామి బంగారు కలశములను ప్రదర్శించారు. ఉత్తర దక్షిణ రాజగోపురములపై బంగారు కలశాలను కంచి కామకోటి పీఠాధిపతి ప్రతిష్ఠ కుంభాభిషేకం గావించారు. శ్రీ అగస్థేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అగస్థేశ్వరస్వామి రాజరాజేశ్వరి దేవి భీమ లింగేశ్వర, సుందరేశ్వరస్వామి, కోదండ రామస్వామి ఆలయాలు నిర్మించారు. నవ గ్రహ మండపం తూర్పు దిశగా ఉంది. ఆలయంలో ప్రవేశించగానే అనిర్వచితనీయమైన ఆనందం ప్రశాంతత చేకూరుతుంది. ఈ శివాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సేవించిన ఎడల కోరిన కోర్కెలు, తీర్చగల అమ్మవారని ప్రశస్థం పొందినది.
బ్రహ్మోత్సవ విశేష పూజలు
28వతేదీ శనివారం సుప్రభాతంతో పాటు పలు పూజలు, రాత్రి అంకురార్పణ, 29వతేదీ ఆదివారం శివపార్వతుల కల్యాణం, 30వతేదీ ప్రత్యేక పూజాకార్యక్రమాలు, మే 1వతేదీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం 6.30గంటలకు అవధాన సహస్త్ర బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మచే శివపార్వతుల ఉపన్యాసం, 2వతేదీ ప్రత్యేక పూజాకార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, 3వతేదీ దక్షిణ యజ్ఞంనాటక ప్రదర్శన, 4వతేదీ గరుఢసేవ, 5వతేదీ భక్తి గీతాలాపన, 6వతేదీ ఆది దంపతులు శ్రీ శివపార్వతుల రథోత్సవం, 7వతేదీ వసంతోత్సవం, అన్నదాన కార్యక్రమం , 8వతేదీ శాంత్యుత్సవం జరుపుచున్నట్లు ఆలయ అర్చకులు, కార్యనిర్వహణ అధికారి కమిటీ చైర్మన్ తదితరులు పేర్కొన్నారు.
మరుగున పడుతున్న మైలవరం అందాలు
జమ్మలమడుగు, ఏప్రిల్ 25 : జిల్లాలోనే ప్రత్యేక ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా గుర్తింపు వున్న మైలవరం పర్యాటక కేంద్రం నేడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పర్యాటక శాఖ తీరుతో ఎనిమిదేళ్లుగా పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. అరచేతిలో వైకుంఠం చూపి మైలవరంలో అడుగుపెట్టిన పర్యాటక శాఖ దోచుకోవడమే లక్ష్యంగా తయారైంది. ఫలితంగా మైలవరం పర్యాటక కేంద్రానికి కోట్ల రూపాయల నిదులు విడుదలయినా ఎనిమిదేళ్లుగా కనీస అభివృద్ది పనులకు కూడా నోచుకోకుండా కునారిల్లిపోతోంది. పాలకులు నిధులు మంజూరు చేయించడంలో చూపిన వాటిని అభివృద్ది చేయించడంలో మాత్రం కనిపించడం లేదు. దీంతో నాడు ఎంతో పేరున్న మైలవరం పర్యాటకం నేడు వెలవెలబోతోంది.
జిల్లాలోనే ప్రత్యేక ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా పేరుపొందిన మైలవరం అందాలు మరుగున పడిపోయాయి. సహజ సిద్దంగా ఏర్పడిన కొండ కోనలతో, ప్రకృతి అందాలు, కొండలను మధ్యలో చీలుస్తూ ప్రవహించే పెన్నమ్మ సోయగాలు, పెన్నానది వెంబడి ప్రకృతి పరంగా ఏర్పడిన వింతలు విశేషాలు మైలవరం పర్యాటకం సొంతం. మూడు దశాబ్దాల కిందట మైలవరం జలాశయం నిర్మాణంతో పాటు పర్యాటక కేంద్రంగా రూపొంది పర్యాటకుల మనసును దోచేసింది. మైలవరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామంటూ పర్యాటక శాఖ 28జనవరి 2004లో అడుగు పెట్టింది. మైలవరం అభివృద్దిని దశల వారీగా చేపడతామని అప్పట్లో పర్యాటక శాఖామాత్యులు ప్రకటించారు. ఈ క్రమంలో కొద్ది కాలంలోనే దాదాపు రూ.1.98 కోట్లు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే విడుదల చేయించారు. మైలవరంలో 2005లో పర్యటించిన పర్యాటక శాఖ ఎండి రేమండ్ పీటర్ మనసును దోచేశాయి మైలవరం అందాలు. వెంటనే పర్యాటక కేంద్రంగా చేపట్టడానికి అనువైన సర్వేలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే టూరిజం జిఎం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2005 అక్టోబర్‌లో మూడు రోజుల పాటు సర్వేలు నిర్వహించారు. చేపట్టాల్సిన పనులపై పలు నివేదికలను రూపొందించి నివేదించారు. తరువాత అధికారులెవ్వరూ ఇటువైపు కనె్నత్తి చూడలేదు. 2007లో ఏప్రిల్‌లో పర్యాటక శాఖ ఇడి, ఒఎస్డీ, ఎస్‌ఇ అధికారుల బృందం మైలవరంలో పర్యటించి 1.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. 2009 నవంబర్‌లో పర్యాటక శాఖ జిఎం నాగేశ్వరరావు దాదాపు రూ.60 లక్షలతో చేపట్టిన టూరిజం రెస్టారెంట్ భూమి పూజకు వచ్చారు. టూరిజం రెస్టారెంట్ పూర్తయి ఏడాది అవుతున్నా ఇంతవరకూ ప్రారంభానికి నోచుకోలేదు. రెస్టారెంట్ తప్ప ఇతర ఎటువంటి అభివృద్ది పనులు చేపట్టలేదు. కానీ దాదాపు రూ.80లక్షలతో ప్రత్యేక పండుగ రోజు తప్ప వెళ్లని ప్రాంతమైన శ్రీఅగస్తేశ్వర కోన వద్ద కొండలో టిక్‌టాక్ బిల్డింగ్ నిర్మాణంను చేపట్టారు. ఎనిమిదేళ్లుగా పర్యాటకులకు కనీస నీటి సౌకర్యం కూడా లేని దుస్థిలో వున్న మైలవరంలో అభివృద్ది పనులు చేయకుండా జనసంచారం లేని కొండ ప్రాంతంలో కోట్లు కుమ్మరించడంపై టూరిజం శాఖ తీరుపై పర్యాటకులు మండి పడుతున్నారు. నిధులు మంజూరు చేయించడంలో చూపించిన శ్రద్ద పాలకులు అభివృద్ది పనుల విషయంలో ఉదాశీనతతో వున్నారన్న విమర్శలు లేకపోలేదు. పర్యాటక శాఖ అధికారుల తీరుతో ఎంతో పేరున్న మైలవరం పర్యాటక కేంద్రం అభివృద్దికి నోచుకోక దీన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంపై కనీసం జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు చేపట్టి గత ప్రాభవం పొందేలా అభివృద్ది చేయాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.
భీమారాయుని కొట్టాలకు తాగునీటి కష్టాలు
జమ్మలమడుగు, ఏప్రిల్ 25: మండలంలోని భీమారాయుని కొట్టాల గ్రామంలో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు పుష్కలంగా వున్నాయని జిల్లా అధికారులు అంటున్నా క్షేత్ర స్థాయిలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి గూడెం చెరువు ప్రాంతం నుండి పైప్‌లైన్ ద్వారా నీరు సరఫరా అయ్యేదని, మార్గమద్యంలో పైప్‌లైన్ దెబ్బతినడం వల్ల ట్యాంకు నీరు ఎక్కక సమస్య తలెత్తిందని ప్రజలు అంటున్నారు. గ్రామంలో మూడు చేతి పంపులు వున్నా వాటిలో రెండు బోర్లు పనిచేయక, మిగతా ఒక బోరులో నీరు సరిగా రావడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు అంటున్నా గ్రామానికి ఒక నీటి ట్యాంకరు కూడా రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో వున్న సమస్యలను గుర్తించి కనీసం జిల్లా ఉన్నతాధికారులైనా తగిన చర్యలు తీసుకొని త్రాగు నీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
వీరు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కారా?
బద్వేల్, ఏప్రిల్ 25: పూరి గుడిసెలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఇందిరమ్మ కళ నిజం చేసి పేదవారిని అన్ని విధాలా ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టు కాళ్ళు అరిగేలా తిరిగినా మంజూరుకావడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తాం, చేస్తాం, అని చెబుతున్నారే కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని చింతపుటాయపల్లె దళితవాడ, వల్లెలవారిపల్లె ఎస్టీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కాక పూరిగుడిసెలు, బొద కొట్టాల్లో ఉంటున్నారు. చింతపుటాయపల్లె దళితవాడలో గంజికుంట చంద్రమ్మ ఇందిరమ్మ ఇంటి దరఖాస్తు చేసి సుమారు 6నెలలపైన అవుతుంది. కానీ ఇంత వరకు ఇళ్ళు మంజూరు కాలేదు. వీరే కాక సుమారు 20మందికి పైగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు, నాయకులు చూస్తాం, చేస్తాం అని చెబుతున్నారుకానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మడకలవారిపల్లె ఎస్సీ కాలనీలో 25కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, లైట్లు, తాగునీటి వసతి లేదు. సుమారు 15మందికి పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు దరఖాస్తు చేసుకొని ఏడాదికి పైగా కావస్తోంది. అయినప్పటికి ఇల్లు మంజూరు కాలేదని ఎస్టీ కాలనీకి చెందిన నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసి ఎస్టీ కాలనీలో వౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో పిఆర్‌జిఎఫ్ జవాన్ మృతి
పోరుమామిళ్ళ, ఏప్రిల్ 25: పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలో మార్కాపురం చెరువు మలుపువద్ద బుధవారం 12.30గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిఆర్‌జిఎఫ్ జవాన్ మోహన్‌రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మోహన్‌రెడ్డి 40రోజుల క్రితమే వివాహం చేసుకుని డ్యూటికి వెళ్ళి భార్య పదవ తరగతి పరీక్షలు పూర్తి అయిన సందర్భంగా ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చాడు. ఉదయం పోరుమామిళ్ళ స్టేట్‌బ్యాంకులో ఎటియంలో డబ్బు డ్రా చేసుకుని సొంత గ్రామమైన ఎగువ తంబళ్ళపల్లెకు వెళుతుండగా అటుగా వస్తున్న మినీలారీ చివరి భాగం ఢీకొని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు, సంఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. న్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రైల్వేకోడూరు, ఏఫ్రిల్ 25: మండలంలోని వేర్వేరు గ్రామాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని గాలివీడుకు చెందిన ఒక పెయింటర్ మృతి చెందాడు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ఉప్పరపల్లె సమీపంలో ప్రయాణికులు వెళ్తున్న ఒక వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో గాలివీడు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన పెయింటర్ సి. మనోహర్ (30) అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద సంఘటనలో బొజ్జావారిపల్లె గంగురాజుపాడు బిల్లుపాటిపల్లె గ్రామానికి చెందిన శివశంకర్, జయచంద్ర, వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే అనంతరాజుపేట సమీపంలో కారు, టెంపో ఢీకొన్న సంఘటనలో తూర్పుపల్లె రాఘవరాజుపురం గ్రామాలకు చెందిన జయరామిరెడ్డి, నరసింహులు, హరి, చెంగమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వీరి పరిస్థితి ఆందోళనా కరంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ బాలమద్దిలేటి తెలిపారు. కాగా గాయపడిన వారిని మాజీ ఎంపిపి ఈశ్వరయ్య, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి పరామర్శించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
చింతకొమ్మదినె్న, ఏప్రిల్ 25 : కడప - రాయచోటి ప్రధాన రహదారి ఊటుకూరు రైల్వేగేటు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లపు రామయ్య(38) దుర్మరణం పాలయ్యాడు. చింతకొమ్మదినె్న మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన బెల్దారి రామయ్య పని నిమిత్తం టివిఎస్ వాహనంలో కడపకు వస్తుండగా ఊటుకూరు వద్ద రైల్వేగేటు వేయడంతో కొద్దిసేపు వాహనంలోనే నిలబడి గేటు తీసిన తరువాత ముందుకు పోతుండగా రైల్వే గేటుకు సంబంధించిన ఫోల్‌ను ద్విచక్ర వాహనం ఢీకొని కింద పడ్డాడు. అదే సమయంలో ముందుకు పోతున్న ప్రైవేటు బస్సు టైయర్ల కింద పడడంతో తలకు, శరీరానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ సిఐ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకుని మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఆ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ట్రాఫిక్ సిఐ రమేష్‌కుమార్ పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
వీరబల్లె, ఏప్రిల్ 25: మండలంలోని గురప్పగారిపల్లె గ్రామ పంచాయతీలోని కొత్తవడ్డెపల్లెకు చెందిన రాయచోటి నారాయణ (50) మనస్పర్తలతో మంగళవారం తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నారాయణకు, అతని భార్య యశోధకు గత కొంత కాలంగా మనస్పర్తలున్నట్లు సమాచారం. నారాయణ గతంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం కట్టెల కోసం అడవికి వెళ్లి అక్కడ భార్య యశోధను అంతం చేయాలని యత్నించినట్లు తెలిపారు. అక్కడ భార్యను కొడవలితో నరకగా ఆమె తప్పించుకుని గ్రామంలోకి పరుగెత్తగా తాను ఇంటికి వెళ్లితే ఏం జరుగుతుందోనని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. యశోధను చికిత్స కోసం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మైనుద్దీన్ తెలిపారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
ఆటో పాల ట్యాంకర్ ఢీ
నలుగురికి తీవ్రగాయాలు
పోరుమామిళ్ల, ఏప్రిల్ 25: మండలంలోని కాలువకట్టకు రెండు కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నం ఆటో పాల ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. దొడ్ల పాల డైరీ మినిలారీ పాలట్యాంకర్ కొండూరుకు వెళుతుండగా నాగలకుంట్ల నుండి ప్రయాణీకులను తీసుకు వస్తున్న ఆటోను పాలట్యాంకర్ ఢీకొంది. ఈ సంఘటనలో నాగులకుంటకు చెందిన రాజేష్, విజయ్‌కుమార్, పవన్‌కళ్యాణ్‌రెడ్డి, రంగసముద్రానికి చెందిన కాకర్ల పీరమ్మలకు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలో ఆరవ తరగతి చదువుతున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల్లో భాగంగా జిల్లా అంతటా పలు
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>