న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోఖికి ముడుపులు ముట్టినట్లు స్వీడన్ అధికారుల విచారణలో వెల్లడైనందున ఆయనను భారత్‌కు రప్పించి కేసుపై పునర్విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. దీనికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి రవి శంకర్‌ప్రసాద్ సూచించారు. బోఫోర్స్ కుంభకోణంపై స్వీడన్ పోలీసు ఉన్నతాధికారి స్టెన్ లిండ్‌స్ట్రాన్ ఇటీవల వెల్లడించిన విషయాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బోఫోర్స్ ముడుపుల వ్యవహారం వల్ల దేశ ప్రతిష్టే కాంగ్రెస్, తన వ్యక్తిగత ప్రతిష్ట మంటకలిసిపోతున్నాయనన్న నిజాన్ని సోనియా గ్రహించాలని ఆయన సలహా ఇచ్చారు. ఖత్రోఖికి ముడుపులు ముట్టినట్లు రుజువు చేసే సాక్ష్యాలులేవంటూ దర్యాప్తును మూసివేయటంలో కీలకపాత్ర వహించిన సిబిఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలన్నారు. రాజీవ్ హయాంలో బయటపడిన ఈ అవినీతి వ్యవహారంపై దర్యాప్తును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకూ అన్ని ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. బోఫోర్స్ ముడుపులు లోటస్ అన్న పేరుమీద ఉన్న అకౌంట్‌లోకి బదిలీఅయ్యాయని అది సోనియాగాంధీకి చెందిన ఖాతా అని అప్పట్లోనే అరుణ్ శౌరి రాసిన వార్తపై మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఖత్రోఖి దేశం నుంచి పారిపోవటానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని ప్రసాద్ ధ్వజమెత్తారు.
బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోఖికి ముడుపులు ముట్టినట్లు స్వీడన్ అధికారుల
english title:
bofors enquiry
Date:
Friday, April 27, 2012