వాషింగ్టన్, ఏప్రిల్ 26: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి దౌత్యవీసా జారీచేయకూడదనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. మోడీకి వీసా జారీ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పూలేదని యుఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్ తెలిపారు. నరేంద్ర మోడీ దౌత్య వీసా విషయంలో పునరాలోచన చేయాలని మితవాద కన్సర్వేటివ్ రిపబ్లికన్ సభ్యుడు జో వాల్ష్ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు లేఖ రాశారు. జో లేఖపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. గుజరాత్ సిఎం మోడీకి దౌత్యవీసా ఇవ్వకూడదని 2005లోనే నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే అదే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార ప్రతినిధి చెప్పారు. కాగా దేశంలోని అమెరికన్ ముస్లిం మైనారిటీ సమాజం మోడీకి దౌత్వవీసా ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్న విషయాన్నీ విక్టోరియా తన ప్రకటనలో పేర్కొన్నారు.
* అమెరికా స్పష్టీకరణ
english title:
maata raledu
Date:
Friday, April 27, 2012