Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తిరుపతి సిపిఎం అభ్యర్థిగా కందారపు

$
0
0

తిరుపతి, ఏప్రిల్ 28 : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మిక,కర్షక, ఉద్యోగుల సమస్యలపై సుమారు 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటాన్ని చేసి అనేక విజయాలను అందించి పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందారపు మురళీని తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుపు తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమయ్య శనివారం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. స్థానిక యశోదనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో ఈ మేరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్థి ప్రకటనకే సుమారు 3వేల మంది పార్టీ సానుభూతి పరులు స్వచ్ఛందంగా విచ్చేసి అభ్యర్థిలో ఎనలేని విశ్వాసాన్ని కనపరిచారు. ఈసందర్భంగా జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర నాయకుడు సోమయ్య, జిల్లా కార్యదర్శి కె కుమార్‌రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి రాయపనేని మురళీ, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటరత్నం, ఐద్వా జిల్లా కార్యదర్శి యశోద, తిరుపతి డివిజన్ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి యాదగిరి, నగర కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు నాయకుడు వాడ గంగరాజు, ఐద్వా లక్ష్మి, అంగన్‌వాడి కార్యకర్తల రాష్ట్ర నాయకులు హేమలత, జిల్లా నాయకురాలు వాణిలు మాట్లాడుతూ తొలిసారిగా సిపిఎం తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా కందారపు మురళీని దింపడం హర్షిందగ్గ విషయమన్నారు. కందారపు మురళీ చేసిన ఉద్యమాలు నేడు ఓటు రూపంలో ఆయనకు ఉపయోగపడుతూ పార్టీకి మరింత ప్రతిష్టను పెంచడం ఖాయమన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే స్థానికుడిగా వున్న కందారపు మురళికి విద్యార్థి దశ నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి వరకూ ఆయనకు ఏర్పడిన సంబంధాలే ఆయన్ను గెలిపిస్తాయన్నారు. ఒక సిపిఎం పార్టీనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల్లో, అన్ని కార్మిక సంఘాల్లో, యూనివర్శిటీ ఉద్యోగుల్లో ఆయనకు మంచి పట్టు వుందన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర న్యాయకత్వం తనను ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా వుందని, ప్రజలు తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే ఎలా పనిచెయ్యాలో చేసి చూపిస్తానని కందారపు మురళీ విలేఖరులతో అన్నారు. తిరుపతి సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన అనంతరం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. తన బలం పార్టీ బలమేనన్నారు. నేడు తిరుపతి నగర ప్రజలుకాని, జిల్లా ప్రజల కాని తనను గుర్తిస్తున్నారు అంటే సిపిఎం చేపట్టిన అనేక ఉద్యమాల్లో తాను పాల్గొనే అవకాశం కలుగడమేనన్నారు. ఇక తన వ్యక్తిగత పరిచయాలతో పాటు పార్టీ బలం తోడై తనకు విజయం లభిస్తుందన్న విశ్వాసం తనకు గట్టిగా వుందన్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు అవినీతి, అక్రమాలతో కూరుకుపోయాయని, ఈ ఉప ఎన్నికల్లో కూడా ఇతర పార్టీలు నిలబెడుతున్న అభ్యర్థులకు నీతి, నిజాయితీ పట్ల విశ్వాసం లేదన్నారు. ప్రజా సమస్యలపట్ల చిత్తశుద్ధి అసలు లేదన్నారు. ఇక తాను తొలి నుండి ప్రజా సమస్యల కోసం చేసిన ఉద్యమాలతో తనను ప్రతి సామాన్యుడు సులభంగా గుర్తుపడతారన్నారు. విజయం లభిస్తుందని తనకు పరిపూర్ణంగా విశ్వాసం వుందన్నారు. ఎమ్మెల్యేగా నిలబడి గెలుపుకోసం కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు గెలిచిన తరువాత అంతకు వందరెట్లు ఎలా సంపాదించాలో అలోచిస్తున్నారన్నారు. దీంతో ప్రజా సమస్యలు అటకెక్కుతున్నాయన్నారు. అందుకే తాను ఎమ్మెల్యే అయితే ప్రజా సమస్యలు ఎలా తీర్చవచ్చునో తాను చేసి చూపిస్తానన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మిక,కర్షక, ఉద్యోగుల సమస్యలపై సుమారు 18
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles