తిరుపతి, ఏప్రిల్ 28: పేద, బడుగు, బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తూ ప్రాణ‘దాన’ నిలయంగా స్విమ్స్ పనిచేస్తుందని టిటిడి తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు అన్నారు. మూత్ర పిండ వ్యాధులతో బాధపడుతూ వున్నవారికి 6.50లక్షల రూపాయలు విలువ చేసే డయాలసిస్ యంత్రాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ స్విమ్స్ సొసైటీ నిర్వాహకులు శనివారం విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీనివాసరాజు మాట్లాడుతూ స్విమ్స్‌లో వున్న ఆదునిక వైద్య సౌకర్యాలు ఎంతో గొప్పగా వున్నాయన్నారు. అలాగే ఎంతో సేవా భావంతో డాక్టర్లు స్విమ్స్‌కు వస్తున్నారని, అదే రీతిలో తమ సేవలను అందిస్తున్నారని ఆయన కొనియాడారు. డయాలసిస్ చికిత్స కోసం 500 మంది వేచి వున్నారని వీరికి ఆ చికిత్స కావాలంటే 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం వుందని వైద్యులు చెప్పారన్నారు. ఇలాంటి సమయంలో ప్రెండ్స్ అఫ్ స్విమ్స్ సొసైటి ఇలాంటి యంత్రాన్ని విరాళంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. స్విమ్స్‌లో మరిన్ని ఆదునిక వైద్య సౌకర్యాలు పెంచడం కోసం తాను టిటిడి ఇఓతో కూడా చర్చిస్తానని అన్నారు. ఈ సందర్భంగా సభకు అద్యక్షత వహించిన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రెండ్స్ అఫ్ స్విమ్స్ సోసైటి సభ్యులు ఉచిత సేవలు అందించడమే కాకుండా స్విమ్స్ అభివృద్దికి అన్ని విధాలుగా తమ సహాయ సహాకారాలు అందిస్తున్నారని కొనియాడారు. తాజాగా నెప్రాలజీ విభాగంలో చిన్నపిల్లలకు (జువైనల్ పెషెంట్లు) కు డయాలసిస్ చేయడం కోసం ఆర్డ్‌ప్లస్ డయాలసిస్ యంత్రాన్ని అందజేయడం, వారు స్విమ్స్ అభివృద్ధికి అందిస్తున్న సహాకారానికి నిదర్శనంగా పేర్కొనవచ్చునన్నారు. స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ హర్షధ్వానాల మధ్య ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్విమ్స్ సోసైటి ’ సేవలను కొనియాడారు. నెప్రాలజి విభాగాధిపతి డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ మనుషులు, ఆస్తులు శాశ్వతం కావని, ఏమి తమ వెంట రావన్నారు. ప్రస్తుతం కిడ్నివ్యాదులకు నివారణ తప్ప శాశ్వత పరిష్కారం జరగాలి అంటే కిడ్ని మార్పిడి చేయ్యాల్సిన అవసరం వుంటుందన్నారు. డయాలసిస్ పక్రియ కేవలం తాత్కాలిక ఉపశమనమేనన్నారు. మరణానంతరం తన కిడ్నిలను దానం చేస్తానని ఇక్కడకు వచ్చిన ఆహ్వానితులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కిడ్ని వ్యాదులతో బాదపడుతున్న ఎంతో మంది జీవితాలకు పునఃజన్మను అందిస్తాయన్నారు. గౌరవ అతిదిగా విచ్చేసిన ప్రెండ్స్ ఆఫ్ స్విమ్స్ సోసైటి నాయకుడు, రిటైర్డు ఐఎఎస్ అధికారి వై రామిరెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఆఫ్ స్విమ్స్ సోసైటి స్దాపించి గత 15 సంవత్సరాలుగా స్విమ్స్ ద్వారా డాక్టర్లుకు వర్క్‌షాప్స్, సెమినార్లు, నిరంతర వైద్య విద్యాకార్యక్రమాలు నిర్వహించడంలో స్విమ్స్‌కు తమ వంతు సేవలు అందిస్తున్నామన్నారు. సొసైటి కార్యదర్శి సుబ్రమణ్యం మాట్లాడుతూ తమ సొసైటి చేస్తున్న వివిధ కార్యక్రమాలను విపులంగా వివరించారు. స్విమ్స్ ఓపిలో రోగులకు సహాయ పడటం, సలహాలు అందించడం ద్వారా సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 159 ఎపిలెప్సీ క్యాంపులు విజయవంతగా నిర్వహించడమే కాకుండా మొత్తం కోటి రూపాయలకుపైగా ఉచిత మందులను స్విమ్స్, టిటిడి, ఎపిలెప్సీ అసోషియేషన్, ప్రెండ్స్ ఆఫ్ సోసైటిల సంయుక్త సహాకారంతో మూర్చ రోగులకు అందించారన్నారు. ఈ సందర్భంగా సోసైటి సభ్యులను, జేఇఓ శ్రీనివాసరాజుకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోసైటి వైఎస్ ప్రెసిడెంట్ బి వెంకటరామయ్య, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓలు డాక్టర్ గోవిందనారాయణ, డాక్టర్ కోటిరెడ్డి, అసిస్టెండ్ డైరెక్టర్ పిఆర్ డాక్టర్ వెంకట్రామిరెడ్డి, పిఆర్‌ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ సిఎం అయితే
రాష్ట్రంలో మాఫియా పాలన : ముద్దు
పుత్తూరు, ఏప్రిల్ 28: వైస్సార్‌సిపి విజయం సాధించి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుంటే రాష్ట్ర పాలన మాఫియాను మురిపిస్తుందని నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎద్దేవా చేశారు. శనివారం స్థానిక జైన్ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పడు రాష్ట్ర సహజ వనరులు, ఆస్తిని తన కుమారుడుకి ధారదాత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే సింగపూర్‌కు దిగుమతులు, ఎగుమతులు ఎక్కవగా వుంటుందన్నారు. అలాంటి ఓడ రేవు 700 ఎకరాల విస్తర్ణంలో వుందన్నారు. మన దేశంలో ముంబాయి ఓడరేవు 800 ఎకరాలు, చైనె్న ఓడరేవు 900 ఎకరాలల్లో వుంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో 5వేల నుంచి 20వేల ఎకరాల విస్తర్ణం ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేశారని విమర్శించారు. వీటి వల్ల సహజవనరులు ప్రజలకు చెందాల్సి వుంటే నేడు కేవలం ధనవంతులకు అందుబాటులో వుందన్నారు. మచిలీపట్టణం ఓడరేవు ఎలాంటి టెండర్లు లేకుండ రోసయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జగన్ అనుచరులకు ఇచ్చారని తెలిపారు. ఈసమావేశంలో తెలుగుదేశం నాయకులు సిఎస్ బాబు, ఎస్‌ఎన్ మాధవ, ప్రకాష్, శ్రీనివాసులు, పాండుయాదవ్, ఆదిమందడి, రాజశేఖర్‌వర్మ, చిన్న, ఎడి కృష్ణప్ప, రవిశంకర్‌యాదవ్, హరి, షణ్మగరెడ్డి, ధనంజయులనాయుడు, జానావెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.