కణేకల్లు, ఏప్రిల్ 28: ఉప ఎన్నికల్లో రాయదుర్గం కొండపై టిడిపి జెండా ఎగురవేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలోని నీలకంఠశ్వర రైస్ మిల్లు ప్రాంతంలో శనివారం టిడిపి నేతలు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఉమమహేశ్వర్‌రావు, దీపక్‌రెడ్డి, శ్రీ్ధర్ చౌదరి పాల్గొని ప్రసంగించారు. రాయదుర్గం నియోజ వర్గం టిడిపికి కంచుకోట అని, ఉప ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మేలు చేస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. వైఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కుమారుడు జగన్‌కు అప్పగించారని ఆరోపించారు. దేశంలోని రాజకీయ నాయకుల్లో కోట్ల ఆస్థులు సంపాదించిన వారిలో జగన్ ముందున్నారన్నారు. అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి అవినీతి రహిత పరిపాలన అందిస్తామని అనడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని తెగనమ్మి ప్రజలను అధోగతి పాలు చేస్తారన్నారు. వైకాపా తరుపున పోటీ చేస్తున్న కాపు రామచంద్రారెడ్డి బళ్లారిలో వ్యాపారాలు నడుపుతూ ఇక్కడి ప్రజలను ఎలా ఆదుకుంటారని ఎద్దేవా చేశారు. ఇక మాటల మారాఠిగా పేరు పొందిన రఘువీరారెడ్డి రైతులను మేఘ మధనంతో వంచించి సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. వచ్చే నెల 1,2 తేదీలలో చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో పర్యటిస్తారని, పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా కదలిరావాలని దీపక్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్, వేలూరి మరియప్ప, రాఘవేంద్రగుప్తా, ఫకృద్దీన్ సాహెబ్, రామలింగారెడ్డి, గోవిందప్ప, బాబు, చిక్కణ్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి - ఎమ్మెల్యే పల్లె
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 28:మండలంలో రెండు రోజుల నుండి కురుస్తు న్న గాలి వానకు వందలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన బొప్పాయి, అర టి, మామిడి పంటలు నేలకొరిగాయి. పండ్లతోటల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని వారికి నష్టపరిహా రం చెల్లించాలని కరవు రైతులకు ఊర ట కల్గించాలని ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన రైతు వెంకటరాముడు బొ ప్పాయి తోటను అధికారులతో పాటు ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులుచేసి రైతులు పండ్లతోటలను సాగుచేశారని, ప్రస్తు తం పంట కోత దశలోవున్న సమయంలో గాలివానలకు నేలకూలడంతో రైతులు కుదేలయ్యాయన్నారు. ఇలాం టి పరిస్థితులు రైతులను ఆత్మహత్యలకు ప్రేరుపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అకాల వర్షాలతో 5 వేల ఎకరాల్లో పం డ్లతోటలు దెబ్బతిన్నాయన్నారు. రైతు లు ఎకరాకు రూ. 50 వేలు పెట్టుబడి పెట్టారన్నారు. మండలంలోని వీరాంజనేయపల్లి, జగరాజుపల్లి, కమ్మవారిపల్లి, వెంకటగారిపల్లి, పెడపల్లి తదితర గ్రామాల్లో మామిడి, బొప్పాయి, అరటి తోటలు నేలకూలాయి. నియోజకవర్గ వ్యాప్తం గా రూ. 30 నుండి రూ. 40 కోట్లు పంట నష్టం జరిగిందన్నారు. జిల్లాలో పండ్లతోటలకు పంటల బీమా అమలులో లేదని, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో అమలు జరుగుతోందన్నారు. జిల్లాలో కూడా పండ్ల తోటల బీమా అమలుకు కృషిచేస్తానన్నారు. వచ్చే యేడాదినుండి ఈ బీమాను అమలుచేయాలని ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ కోదండరామిరెడ్డి, హార్టికల్చర్ అధికారులు రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
* జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ధీమా
english title:
u
Date:
Sunday, April 29, 2012