పుట్టపర్తి, ఏప్రిల్ 28: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుటుంబ సమేతంగా సత్యసాయి మహాసమాధిని శనివారం దుర్శించుకున్నారు. ముంబాయినుండి ప్రత్యేక విమానంలో ఉదయం 8.45 గంటలకే పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో డిఎస్పీ వెంకటయ్య, సిఐ మధుభూషన్, ఎస్‌ఐ రామయ్య తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా ప్రశాంతి నిలయంలో అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ట్రస్టు వర్గాలు స్వాగతం పలికాయి. తేనేటి విందు అనంతరం ఆయన కుటుంబసమేతంగా సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని అక్కడ ప్రనమిల్లారు. సత్యసాయి మహాసమాధిపై పుష్పగుచ్చం వుంచి తమ భక్త్భివాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయనతో ట్రస్టు సభ్యులు రత్నాకర్, ఎస్వీగిరి మర్యాద పూర్వకంగా సంభాషించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పుట్టపర్తి నుండి ముంబాయికి బయలుదేరి వెళ్లారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
* ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి
కణేకల్లు, ఏప్రిల్ 28: కేంద్ర, రాష్ట్రా ల్లో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా ప్రజల దరిచేర్చింది కాంగ్రె స్ పార్టీ అని, ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివా రం ఆయన పట్టణంలో కొందరు ప్ర ముఖుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపి అనంత, కాంగ్రెస్ అభ్యర్ధి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాలకు ఊపిరి ఇచ్చిన పార్టీ అన్నారు. అభివృద్ధి పథంలో నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపి నేతలు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి ఊపందుకుందన్నారు. స్థానికంగా ఉన్న పాటిల్‌ను గెలిపించడం వల్ల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి మోహన్‌రెడ్డి, రామ్మోహన్, మాబుపీరా, మాజీ సర్పంచ్ చిక్కణ్ణ, షర్మాస్, నబీసాబ్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుటుంబ సమేతంగా సత్యసాయి మహాసమాధిని శనివారం
english title:
s
Date:
Sunday, April 29, 2012