Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

$
0
0

అనంతపురం రూరల్, ఏప్రిల్ 28: నగర శివారు కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసాచారి(30) మృతి చెందాడు. పాపంపేట ఐజినగర్‌లో నివసించే శ్రీనివాసాచారి కార్పెంటర్ పని చేసేవాడు. శనివారం రాత్రి నగరంలోని పని ముగించుకుని పల్సర్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా పాపంపేట వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసాచారి తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కల్లు విక్రేతకు ఏడాది జైలుశిక్ష
* రూ. 10 వేల జరిమానా
మడకశిర, ఏప్రిల్ 28: మడకశిర ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సిద్దగిరి గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్న నారాయణప్పకు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి నాగశేషయ్య తీర్పు చెప్పినట్లు ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు. వివరాలు.. మండల పరిధిలోని సిద్దగిరి గ్రామానికి చెందిన నారాయణప్ప కల్లు దుకాణం నిర్వహిస్తుండగా గత ఏడాది మార్చి 18వ తేదీ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ స్వర్ణలత సిబ్బందితో దాడులు నిర్వహించి కల్లు శాంపిల్స్ సేకరించారు. వాటికి పరీక్షలు నిర్వహించగా కల్లులో మత్తు మందు క్లోరోహైడ్రేట్‌ను కలిపి విక్రయిస్తున్నారని వెల్లడి కావడంతో అప్పట్లో ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు శనివారం విచారణకు వచ్చింది. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు సిఐ వివరించారు.
వెంకటశివారెడ్డి మృతి కేసులో
ముగ్గురి అరెస్టు
* మరొకరి కోసం పోలీసుల గాలింపు
పెద్దపప్పూరు, ఏప్రిల్ 28: వెంకటశివారెడ్డి శరీరాన్ని ముక్కలు మక్కలుగా కోసి బోరువావిలో వేసిన కేసులో చిక్కేపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురం మండలం బొజ్జాయిపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, యల్లనూరు మండలం దంతలపల్లికి చెందిన రామిరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పెద్దపప్పూరు ఎస్‌ఐ రాజు పేర్కొన్నారు. నిందితులు నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేశామని మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. చిక్కేపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనుల చోటుచేసుకోకుండా ముందు జా గ్రత్తగా తాడిపత్రి డీఎస్పీ అరవిందబాబు ఆదేశాల మేరకు యల్లనూర, తాడిపత్రి రూరల్ ఎస్‌ఐల నేతృత్వంలో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

నగర శివారు కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో
english title: 
r

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>