Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దిగుబడి పెరిగేనా?

$
0
0

విజయనగరం, మే 2: జిల్లాలో సాగు విస్తీర్ణం పెంపుతో పాటు అధిక ఉత్పాదకను సాధించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయన్న చర్చ నెలకొంది. జిల్లాలో మొత్తం ఆరు లక్షల హెక్టార భూమి ఉండగా, ప్రస్తుతం 4.4 లక్షల హెక్టార్లు మాత్రమే సాగులో ఉంది. దీనిలో ఒక్క వరి పంట 1.24 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. మిగిలిన ఆహారధాన్యాలు, ఉద్యాన పంటల సాగువిస్తీర్ణం 2.2 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇటీవల జిల్లా స్థాయి సమావేశాల్లో కలెక్టర్ వీరబ్రహ్మయ్య సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు అధికోత్పత్తిని సాధించే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి ఆయన చక్కటి ప్రణాళికను సైతం వివరించారు. కరవుకు మారపేరుగా ఉండే రాయలసీమ జిల్లాల్లో సైతం బోర్ల ద్వారా వ్యవసాయం జోరుగా సాగుతోంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో రెండేసి లక్షల సాగునీటి బోర్లు ఉండగా, విజయనగరం జిల్లాలో మాత్రం కేవలం 14 వేల వ్యవసాయ బోర్లు మాత్రమే ఉన్నాయి. సాగునీటి పథకాలకింద, పూర్తి వర్షాధారంతో రైతాంగం సాగుపై ఆధారపడుతున్నారు. ఈసందర్భంలో జిల్లాలో వ్యవసాయ బోర్లను ప్రోత్సహించడం ద్వారా సాగువిస్తీర్ణం పెంచాలన్నది కలెక్టర్ ఆలోచన. అయితే ఇందుకు రైతులతో పాటు బ్యాంకర్లు, భూగర్భజలవనరుల శాఖ, వ్యవసాయశాఖ సమన్వయంతో పనిచేయాలి. చిన్న సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా వ్యవసాయ బోర్లను వేయించాలి. దీనికి రైతులను, బ్యాంకర్లను ఒప్పించాలి. తద్వారా 20 శాతం సాగువిస్తీర్ణం పెంచడం పెద్ద కష్టమైన పనికాదన్నది ఆలోచన. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సరైన సశ్యరక్షణ, సమగ్రమైన ఎరువుల యాజమాన్యం, సాగు విధానం, అధిక దిగుబడినచ్చే వంగడాల రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. ముఖ్యంగా రైతులు పూర్తి స్థాయిలో, అధికంగా ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గి ఉత్పాదకత పడిపోతోందన్న వాస్తవాన్ని గుర్తించాలని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఖర్చు అధికం కావడం, దిగుబడులు తగ్గి సాగు పూర్తిగా భారం కావడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతోందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు కొండ వాలు ప్రాంతాల్లో నిరర్ధకంగా ఉన్న భూములను సాగుకు అనువుగా చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. దీనికి జిల్లా జలయాజమాన్య సంస్థ సైతం తగిన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకాన్ని నిరర్ధక భూములను సాగు అవసరాలకు వీలుగా మార్చేందుకు వెచ్చిస్తే 20 శాతం వ్యవసాయ భూముల పెరుగుదల పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. వీటిలో బోర్లను వేసి సాగులోకి తేవడం వల్ల విస్తీర్ణం పెరగడంతో పాటు ఉత్పాదకతలో పెరుగుదల చోటుచేసుకుంటుందని పేర్కొంటున్నారు. అధికారుల అంచనాలు ఫలిస్తే 20 శాతం సాగు విస్తీర్ణం, 30 శాతం ఉత్పాదకతను సాధించడం పెద్ద కష్టమైన పనేమీ కాదన్నది అధికారుల అభిప్రాయం.

అధికారుల తీరుపై గ్రామస్థుల నిరసన
లక్కవరపుకోట, మే 2:ప్రకటనలకే పరిమితం అవుతున్న ప్రజాపథం ఎందుకని కళ్ళేపల్లి గ్రామప్రజలు తమ నిరసనను తెలిపారు. బుధవారం జరిగిన ప్రజాపథంలో భాగంగా గ్రామసభలో ఆ గ్రామప్రజలు ఒకింత నిరసన ప్రదర్శించారు. పావలావడ్డీ రైతుల పంటనష్టం కాగితాల రూపంలో ఇస్తున్నారని వాటిని పట్టుకుని బ్యాంకులకు వెళితే ఇంతవరకు సొమ్ము జమ కాలేదని తెలపడంతో సంబంధిత లబ్దిదారులు ఉసూరుమంటూ వెనుదిరుగున్నారని ప్రజలు మండల సిబ్బందిని ప్రశ్నించారు. ముఖ్యంగా 108 అత్యవసర సేవలు గ్రామాల్లోకి వచ్చిరోగిని పరిమిత పరిధివరకు తీసుకెళ్ళి అక్కడితో వదలివేయడం వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగి పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో ప్రత్యేకాధికారి కల్పించుకుని ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రోగులను జిల్లాకేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రేగ, కళ్ళేపల్లి గ్రామాల్లో అక్రమ కుళాయి కనెక్షన్లు వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేకాధికారి సూచించారు. భారత్ గ్యాస్ సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామాల్లో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని మాజీ మండల పరిషత్ అధ్యక్షులు జక్కాన కన్నబాబు కోరారు. ఈరోజు ప్రజాపథం కళ్ళేపల్లి, రేగ, లచ్చింపేట, నర్సంపేట, పోతంపేట, చందులూరు, లింగంపేట గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జి.వి.రమణమ్మ, తహశీల్దారు వై.పి.సుశీలారాణి, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
విజయనగరం , మే 2: జిల్లాలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు 7,565 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా వీరిలో 7,482 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు కాగా 73 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు కాలేదని ప్రవేశ పరీక్ష కో-ఆర్డినేటర్ టి.ఆర్.ఎస్ లక్ష్మి తెలిపారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయనగరంలో తొమ్మిది, బొబ్బిలిలో తొమ్మిది కేంద్రాలను కేటాయించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్ధులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.

‘ప్రజల చెంతకు పార్టీ విధానాలు’
బొండపల్లి, మే 2: వైఎస్సార్ పార్టీ విధివిధానాలు ప్రజలకు తెలియజేయడమే వైఎస్సార్ పార్టీ కార్యక్రమ లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని గ్రహపతి అగ్రహారంలో బుధవారం జరిగిన గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించారు. పార్టీ ఏలక్ష్యంతో జగన్ స్థాపించారో తెలియజేశారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బొండపల్లి మండల కన్వీనర్ ఈదుబిల్లి కృష్ణ, జిల్లా యువజనసంఘం సభ్యుడు తొత్తడి సత్తిబాబు, ఈదుబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రహపతి అగ్రహారం అధ్యక్షునిగా ఈధుబిల్లి అప్పారావు, జె.గుమడాం అధ్యక్షునిగా మంత్రి చంద్రినాయుడు, కొత్తపాలెం, మరువాడ, బి.రాజేరు గ్రామాల అధ్యక్షులుగా వర్రి సూర్యనారాయణ, వెనె్నల సూరిబాబు, తొత్తడి అప్పలనాయుడును గ్రామకమిటీ అద్యక్షునుగా ఎన్నుకున్నట్లు చెప్పారు.

‘పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి’
జామి, మే 2: ప్రగతి సీతామహిళా సొసైటీ ఆధ్వర్యంలో పిల్లల అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జిల్లా సేవాభారతి కోఆర్డినేటర్ భీష్మ పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. వేసవికాలంలో పిల్లలకు ప్రముఖ నాయకుల చరిత్రలు తెలియజేయడం సమాజంలో సన్మార్గంలో నడుచుకునేలా ప్రవర్తనలు అలవరచడం నైతిక విలువలను పెంపొందించుకునేలా చేయడం, మంచిజీవితానికి బాట ఏర్పాటు చేసుకునేలా చేయడం వంటి పలు అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. సేవాభారతి ప్రగతి సీతామహిళాసొసైటీ ద్వారా సేకరించిన పిల్లలను 4సంవత్సరాలనుండి 6, 7నుండి 9సం, 10నుండి 12 సంవ, 13నుండి 15సంవ, 16నుండి 18సంవత్సరాల వారిని ఐదు గ్రూపులుగా విభజించి గ్రూపుకు ఒక అభ్యాసకుడిని వీరికి ఒక పర్యవేక్షుడిని నియమించి వీరి స్థాయికితగ్గ విద్యాబోధనకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, పెన్సిల్, పెన్ను వంటి వస్తువులను అందజేస్తామన్నారు. ఈ శిక్షణా తరగతులను 10రోజులపాటు నిర్వహించి వీరికి ధ్రువపత్రాలతోపాటు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సీతామహిళాసొసైటీ అధ్యక్షురాలు కె.్భలక్ష్ని, రిసోర్స్‌పర్సన్ ప్రశాంతి పాస్టర్ జాన్‌పీటర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ అభివృద్ధికి కృషి
గుర్ల, మే 2: గుర్లశాఖా గ్రంథాలయాన్ని మోడరన్ గ్రంథాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని జిల్లా సంస్థ చైర్మన్ ఆర్.పోతన్న తెలిపారు. బుధవారం ఆ శాఖా గ్రంథాలయ స్వంత భవనం నిర్మించేందుకు శంఖుస్థాపనలో డిసిఎంఎస్ చైర్మన్ కె.వి.సూర్యనారాయణ చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా పోతన్న మాట్లాడుతూ గుర్ల గ్రామంలో సర్వే నెం-34లో ఐదుసెంట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరుగుతుందని ఇందుకోసం సంస్థ నుంచి 7.50లక్షల నిధులు, మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో నిధులు కొరత లేదన్నారు. గడచిని మూడు సంవత్సరాల నుండి 3కోట్లరూపాయల సెస్సు వసూలు చేయడం జరుగిందన్నారు. గుర్ల గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతు గ్రంథాలయం అభివృద్దికి జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య కృషి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిడిఎ చైర్మన్ బి.బంగారునాయుడు, సర్పంచు బి.సన్యాసినాయుడు, శాఖా గ్రంథాలయ అధికారి జైన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

‘సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన’
విజయనగరం , మే 2: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఎంప్లాయిస్ యూయన్ డిపో కార్యదర్శి టి.ఎస్.ఎన్.రాజు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం మధ్యాహ్న భోజన విరామ సయమంలో ఇక్కడి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. పనిభారాలు పెరిగి కార్మికుల నడ్డి విరుగుతోందన్నారు. పనిభారం పెరిగి కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోచుకుంటుందన్నారు. చట్టప్రకారం 8గంటలు దాటి రోజుకు పనిచేయించరాదని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది జూలై, ఆగస్టునెలలకు సంబంధించిన డి.ఎ.ను ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. జనవరి 2012 సంవత్సరానికి రావాల్సిన 5.6శాతం డి.ఎ.ను కూడా చెల్లించేందుకు యాజమాన్యం ఆసక్తి చూపడంలేదన్నారు. గత మూడేళ్ళుగా ఎన్‌క్యాష్‌మెంట్ కూడా చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
యూనియన్ నాయకుడు కె.సత్తిబాబు మాట్లాడుతూ కారుణ్య నియమకాలు చేపట్టాలని, చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ డబల్ డ్యూటీకి చట్టప్రకారం డబల్‌వేతనం చెల్లించాలన్నారు. రెండవిడతలుగా మంజూరైన డి.ఎ.ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్‌నాయకులు పరమహంస, కె.వి.రమణ, జె.ఎస్.టి.ఎస్.రావుతదితరులు పాల్గొన్నారు.

‘ఓర్వలేకే జగన్‌పై ఆరోపణలు’
గజపతినగరం, మే 2: మండలంలోని ముచ్చర్ల గ్రామంలో వైఎస్సార్ పార్టీ మంగళవారం సాయంత్రం చేపట్టిన గడప గడపకు సీపీ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామానికి వెళ్ళిన ఆ పార్టీనాయకులు కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.పెద్దినాయుడులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్చందంగా పార్టీలో చేరేందుకు ముందుకువచ్చారు. వారికి పార్టీనాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమన్నారు. జగన్‌కు ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీనేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వీటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నికల్లో వారే తగినవిధంగా బుద్దిచెబుతారని హెచ్చరించారు. ఎస్సీ సెల్ విధాగం జిల్లా కన్వీనర్ ఆదాడ మోహనరావు, గజపతినగరం, బొండపల్లి మండల కన్వీనర్లు మీసాల అప్పలనాయుడు, ఈదుబిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాలి
గజపతినగరం, మే 2: ఎంతోకష్టపడి ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును ఎవరో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎటిఎంల ద్వారా దోచుకుంటున్నట్లు వినియోగదారుల క్లబ్ అధ్యక్షుడు కె.వి.శంకరరావు చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తమ సొమ్ముకు బ్యాంకుల్లో రక్షణ ఉంటుందన్న నమ్మకంతో చాలామంది ఖాతాదారులు బ్యాంకుల్లో దాచుకుంటున్నట్లు తెలిపారు. దాచుకున్న సొమ్మును తెలివిగా దోచుకునేవారు ఎక్కువయ్యారన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పారు. జిల్లాలో విజయనగరం, గజపతినగరం, పార్వతీపురం ప్రాంతాల్లో సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బ్యాంకులపై గల నమ్మకంతో సొమ్ము దాచుకున్నా రక్షణ లేదని, పూర్వంలా భూమిలో దాచుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బ్యాంకింగ్ వర్గాలు కూడా పెద్దగా స్పందించడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తమ అవసరాల నిమిత్తం సొమ్మును బ్యాంకుల్లో దాచుకోవడానికి చాలామంది భయపడుతున్నారన్నారు. బ్యాంకింగ్ వర్గాలు, పోలీసులు చొరవ తీసుకుని ఈ సైబర్ నేరాలు అదుపుచేసి ఖాతాదారుల సొమ్ముకు రక్షణ కల్పించాలని కోరారు. ఎటిఎంల్లో సెక్యూరిటీ గార్డులను నియమించాలని ఖాతాదారులకు సూచనలు, సలహాలతో కూడిన కరపత్రాలతో అవగాహన కల్పించాలన్నారు.

పండగకు వచ్చి.. అనంతలోకాలకు..
బొండపల్లి, మే 2: పండుగకని వచ్చి బావిలో స్నానం చేసేందుకు దూకడంతో రాయితగిలి మృతిచెందిన సంఘటన బుధవారం మండలంలోని ఎం.కొత్తవలస గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన కరిమజ్జి రామకృష్ణ(35) తన భార్యాపిల్లలతో ఎం.కొత్తవలస గ్రామంలో జరుగుతున్న పైడితల్లమ్మ పండగకు వచ్చాడు. బుధవారం ఉదయం 9గంటలప్రాంతంలో తన తోడల్లుడు మజ్జి అప్పలనాయుడుకు చెందిన బావిలో స్నానం చేయడానికి చిన్నాన్న కుమారుడు కరుమజ్జి లక్ష్మణ(గుర్ల), పాలవలసకు చెందిన తాడి అప్పలరావుతోకలిసి వెళ్ళాడు. అయితే బావిలో దాపరాయి తలకు తగిలి మునిగిపోతుండగా మిగిలినవారు రామకృష్ణను బయటికి తీసి వైద్యచికిత్సకోసం గజపతినగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ మృతిచెందాడు. రామకృష్ణ విశాఖపట్నంలో తాపీపని చేస్తూ జీవిస్తున్నాడు. అయితే భార్య లక్ష్మి కుమారులు ఆదినారాయణ, కూర్మారావు కలిసి పండగ నిమిత్తం ఎం.కొత్తవలసకు చేరుకున్నారు. కుటుంబ యజమాని మృతిచెందడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో చూపరుల హృదయాలు కలచివేసింది. ఫిర్యాదుమేరకు బొండపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమర్థవంతంగా పనిచేయండి: ఆర్టీసీ ఆర్.ఎం
విజయనగరం , మే 2: ప్రయాణికులతో సత్సంబంధాలను పెంపొందించుకుని సమర్థవంతంగా పనిచేయాలని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ గిడుగు వెంకటేశ్వరరావుఅన్నారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్‌లో అసిస్టెంట్‌మేనేజర్లు, ప్రయాణికుల సత్సంబంధాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల ఆదరణపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందన్నారు. అందువల్ల ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బస్‌స్టేషన్‌లకు చేరుకున్న ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలన్నారు. ప్రయాణికులను సమీకరించడంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలా లేదా అనే స్వేచ్ఛ ప్రయాణికులకు నూరుశాతం ఉంటుందని, అందువల్ల సరైన రీతిలో స్పందించి వారి అవసరాలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్‌ట్రాఫిక్‌మేనేజర్ కొటాన శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్లు ఎన్.వి.ఎస్.వేణుగోపాల్, మిత్తిరెడ్డి సన్యాసిరావు, వివిధ డిపోలకు చెందిన ప్రయాణికుల సత్సంబంధాల అధికారులు పి.జి.రాఫీల్, కె.ఎస్.పి.రావు, జె.ఎల్.రావు, కె.ఎస్.నాయుడు, పి.ఎస్.రావుతదితరులు పాల్గొన్నారు.

‘కూలి గిట్టుబాటు అయ్యేలా చూడండి’
బొండపల్లి, మే 2: ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి లభించే విధంగా పనులు చేయించండి లేదా తప్పుకోవాలని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మండల ప్రత్యేకాధికారి రెడ్డి శ్రీరాములునాయుడు మేట్లుకు సూచించారు. మండలంలోని ఒంపల్లిగ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజాపథం సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి శ్రీరాములునాయుడు కూలీలకు కూలి ఎంత గిట్టుబాటు అవుతుందని మేట్లను ప్రశ్నించగా 60నుంచి 70రూపాయలు లభిస్తున్నట్లు చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన 137రూపాయలు గిట్టుబాటు కూలి కల్పించలేకపోతే తప్పుకోవాలన్నారు. జిల్లాలో దొంగ మస్తర్లు వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉపాధిలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గ్రామంలో 43 గ్రూపులు పనులు చేస్తున్నట్లు ఎపిఒ రామారావు చెప్పారు. తమ గ్రామానికి లోవోల్టేజీ సమస్య పట్టిపీడిస్తున్నట్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ మాజీసర్పంచ్ భోగాపురపు కన్నంనాయుడు ఫిర్యాదుచేశాడు. ఈమేరకు విద్యుత్‌శాఖ ఎఇ నివారణం చర్యలు చేపడతమన్నారు. కొంతమంది అనర్హులు ఆమ్‌ఆద్మీ ఇన్స్యూరెన్స్ పథకంలోచేరారని వారి పేర్లను తొలగించాలని డిమాండ్‌చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాలు, స్వయంసంఘాలకు పావలావడ్డీ పత్రాలు ప్రత్యేకాధికారి పంపిణీ చేశారు. తహశీల్దారు ఎ.రఘురామయ్య, ఎంపిడిఓ జి.ఎస్.నిర్మలాదేవి, మండల వ్యవసాయాధికారి మోపాడ ఉమామహేశ్వరనాయుడు, పాల్గొన్నారు.

‘ఆదాయ మార్గాలపై అనే్వషణ’
విజయనగరం , మే 2: పెరుగుతున్న నిర్వహణాఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆదాయ మార్గాలపై అనే్వషణ సాగిస్తున్నట్లు డిపోమేనేజర్ పి.బి.ఎం.కె.రాజు అన్నారు. బుధవారం ఇక్కడ డిపోలో తక్కువ ఆదాయం తెచ్చిన కండక్టర్ల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పెరుగుతున్న నిర్వహణాఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో 287మంది కండక్టర్లు ఉన్నారని, వీరిలో 33మంది 80శాతం కంటే తక్కువ ఆదాయాన్ని తెచ్చారని, వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కండక్టర్ ఆక్యుపెన్సీరేషియో పెంచేందుకు కృషి చేయాలన్నారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ మిత్తిరెడ్డి సన్యాసిరావుమాట్లాడుతూ వికలాంగులకు ప్రతి ఆదివారం బస్‌పాసులను జారీ చేస్తున్నామన్నారు. డిపో పరిధిలోని వివధ మండలాలకు చెందిన వికలాంగులకు విజయనగరం బస్‌స్టేషన్‌లో ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకుబస్‌పాసులను ఇస్తున్నామన్నారు.

మహిళా ‘గ్రీవెన్స్’కు స్పందన కరవు
విజయనగరం , మే 2: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నాటి మహిళా గ్రీవెన్స్‌కు స్పందన కరువైంది. మహిళల సమస్యల పరిష్కారం కోసం వినతుల స్వీకరణకు ప్రతినెల మొదటి బుధవారం మహిళా గ్రీవెన్స్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ వారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు కేవలం 4 వినతులు అందాయి. ఎస్సీ కులానికి చెందిన తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సహాయాన్ని అందించాలని విజయనగరానికి చెందిన గండ్రేటి కొండమ్మ కోరింది. జీవనోపాధి నిమిత్తం రుణం మంజూరు చేయాలని ఎస్.కోటకు చెందిన ఆర్.కుమారి కోరింది , గ్రీవెన్స్ సూపరింటిండెంట్ రమణమూర్తి, ఐసిడిఎస్ తదితర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డులపై 35 కిలోల బియ్యం
కురుపాం, మే 2: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు 35కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కురుపాం, బియ్యాలవలస, గుమ్మడిగుడ తదితర గిరిజన ప్రాంతాల్లో బుధవారం జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిలో బియ్యాన్ని రూపాయికే సరఫరా చేస్తున్నామన్నారు. మంచినీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. గ్రామాల్లో ఉపాధిపనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. రోజుకీ ఆరు గంటలు పనిచేస్తున్న తమకు 120 రూపాయల వరకు వేతనం లభిస్తోందని గిరిజనులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి చెందారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని బోరుల మరమ్మతులు కూడా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగిస్తామని బియ్యాలవలస ప్రజాపథంలో కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల బోరు మరమ్మతులకు గురైందని గ్రామస్థులు ఫిర్యాదు చేయగా పైవిధంగా కలెక్టర్ స్పందించారు. బోర్లు మరమ్మతులు చేస్తున్నందుకు మెకానిక్ బి.శ్రీను డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. వేతన బకాయిలు రావాల్సి ఉందని గిరిజనులు తెలపగా వచ్చే మంగళవారం నాటికల్లా వాటిని చెల్లించాలనిఎం.పి.డి.ఒ.ను ఆదేశించారు. కురుపాంలో జరిగిన ప్రజాపథంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధికూలీలకు ప్రతివారం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో మంచినీటి పథకాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలచేత ప్రశంసలు పొందిన మాజీ సర్పంచ్ రామరాజును కలెక్టర్ అభినందించారు. అనంతరం పావలావడ్డీ బకాయిల కింద 96మహిళా సంఘాలకు 5.41 లక్షల రూపాయలు, బియ్యాలవలసలో నాలుగు సంఘాలకు 4,764 రూపాయల పావలావడ్డీ బకాయిల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఒక్కొక్క స్వయం సహాయక సంఘం అయిదు లక్షల రూపాయల వరకు రుణం పొందాలన్నారు. కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ.ప్రాజెక్టు అధికారి సువర్ణ పండాదాస్, ఆర్.డి.ఒ.అంబేద్కర్, ఎం.పి.డి.ఒ.ఉషారాణి, తహశీల్దార్ రాము, హౌసింగ్ ఇ.ఇ.నారాయణరావుతదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
బొబ్బిలి , మే 2: సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రజాపథం కార్యక్రమం ఎందుకంటూ ఎమ్మెల్యే రంగారావును ప్రజలు నిలదీశారు. ప్రజాపథంలో భాగంగా మండలంలోని కింతాడ, పక్కి, కోమటిపల్లి, కలువరాయి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యేకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కింతాడ, కలువరాయి గ్రామాల్లో ప్రజలు ప్రజాపధంలో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు అధికారులను నిలదీశారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మూడు నెల్లుగా రక్షిత మంచినీటి పథకాలు పనిచేయట్లేదని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదంటూ ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు. ఇక గ్రామంలో విద్యుత్ సరఫరా ఘోరంగా ఉందని, కరెంటు ఎప్పుడు ఉంటుందో చెప్పడం కష్టమని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో సైతం తమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడి పనిచేసినా తమకు కనీస కూలీ గిట్టుబాటు కావట్లేదంటూ ధ్వజమెత్తారు. ఉపాధి పనుల కల్పనలో కూడా తమకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు వివరణనిస్తూ దశలవారీగా సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంచినీటి పథకాల మరమ్మతులకు సంబంధించి నిధులు సమృద్ధిగా ఉన్నాయని, తక్షణమే వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్య ఈప్రాంతానికే సంబంధించింది కాదని, రాష్ట్రం మొత్తం కోత అమలవుతున్నాయని స్పష్టం చేశారు. ఈసమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న కూలీలందరికీ పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని అధికారులతో కూడా ఎమ్మెల్యే చర్చించి తక్షణమే కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు.
ప్రజాపథంలో భాగంగా కలువరాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు తమకు హౌసింగ్ బిల్లులు చెల్లించలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అధికారులు ద్వంద్వ నీతిని పాటిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి గోవర్ధన రావు, ఎంపిడిఓ అప్పలనాయుడు, తహశీల్దారు అప్పారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
విజయనగరం , మే 2: మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పావలావడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ కోరారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 27వ వార్డు బొండాడవీధిలో బుధవారం జరిగిన వార్డుసభలో ఆమె మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. దీనిలోభాగంగా పావలావడ్డీ రుణాలను అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణసాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. పావలావడ్డీ రుణాల ప్రక్రియను ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. పట్టణంలో 3,070 గ్రూపులకు 2.14 కోట్ల రూపాయల పావలావడ్డీ రాయితీని అందిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా 26వ వార్డులో మంగళవీధి డి.పి.ఇ.పి.స్కూల్, 27వ వార్డులో బొండాడవీధి, 28వవార్డులో చెవిటి, మూగ స్కూల్, 29వవార్డులో బూర్లిపేట మందిరం వద్ద వార్డుసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహాశీల్దార్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ పి.వెంకటరావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వి.శోభన్‌బాబు, పట్టణ ఇందిర క్రాంతిపథం ప్రాజెక్టు అధికారి ఆర్.పి.సూర్యకళ, మున్సిపల్ స్కూల్స్ సూపర్‌వైజర్ వై.అప్పలనాయుడు, మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అశోక్, జనార్థనరావుతదితరులు పాల్గొన్నారు.

సమర్థవంతంగా పనిచేయండి
విజయనగరం , మే 2: ప్రయాణికులతో సత్సంబంధాలను పెంపొందించుకుని సమర్థవంతంగా పనిచేయాలని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ గిడుగు వెంకటేశ్వరరావు ఉద్బోధించారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్‌లో అసిస్టెంట్‌మేనేజర్లు, ప్రయాణికుల సత్సంబంధాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల ఆదరణపైనే ఆర్టీసీ మనుగడ ఆధారపడి ఉందన్నారు. అందువల్ల ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బస్‌స్టేషన్‌లకు చేరుకున్న ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలన్నారు. ముఖ్యంగా ప్రయాణికులను సమీకరించడంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలా లేదా అనే స్వేచ్ఛ ప్రయాణికులకు నూరుశాతం ఉంటుందని, అందువల్ల సరైన రీతిలో స్పందించి వారి అవసరాలకు అనుగుణంగా బస్సులను నడపాలన్నారు. బస్సుల రాకపోకల్లో సమయపాలన పాటించాలన్నారు. ప్రయాణికులను ఆకట్టులేకపోతే దేవుడు లేని గుడిలో పూజలు జరిపినట్లే అవుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సానుకూల దృక్పథంతో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్‌ట్రాఫిక్‌మేనేజర్ కొటాన శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్లు ఎన్.వి.ఎస్.వేణుగోపాల్, మిత్తిరెడ్డి సన్యాసిరావు, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శృంగవరపుకోట డిపోలకు చెందిన ప్రయాణికుల సత్సంబంధాల అధికారులు పి.జి.రాఫీల్, కె.ఎస్.పి.రావు, జె.ఎల్.రావు, కె.ఎస్.నాయుడు, పి.ఎస్.రావుతదితరులు పాల్గొన్నారు.

ఎఎవై ద్వారా 36, 700 కుటుంబాలకు బియ్యం
పార్వతీపురం, మే 2: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు అంత్యోదయ అన్న యోజన కింద (ఎఎవై ) 36వేల 700 కుటుంబాలకు ఈనెల నుండి 35కిలోల వంతున రేషన్ బియ్యం అందజేస్తామని కలెక్టర్ ఎం వీరబ్రహ్మయ్య తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురం వచ్చిన సందర్భంగా పార్వతీపురంలోని కలెక్టర్ క్యాంపుహౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానంగా సబ్‌ప్లాన్ పరిధిలోని పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, మక్కువ, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల ఎస్‌సి, ఎస్టీలతో పాటు జిల్లాలోని ఎస్టీ కుటుంబాలందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. గతంతో ఉన్నరేషన్ కార్డులను అంత్యోదయ కార్డుల కింద వీరికి మార్పు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్డుల మంజూరులో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలోని 2200 కార్డులు, సాలూరు నియోజకవర్గంలోని 11 వేల కార్డులు, కురుపాం నియోజకవర్గంలోని 16600 కార్డులున్నాయన్నారు. కిలో రూపాయి కింద ఈ బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గతంలో సాధారణ కార్డుల చెందిన కుటుంబాలకు 480 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఇపుడు అదనంగా 780 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 14 వేల మంది కౌలు రైతులను గుర్తించామని వీరికి గుర్తింపుకార్డులందజేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడుతున్న వారికి ఉపకరణాలు కొనుగోలు చేయడానికి ఎడీవోలకు అధికారాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

బ్లడ్ బ్యాంకుకు ఫ్రిజ్‌లు కొనుగోలు చేసుకోవచ్చు
పార్వతీపురంలోని బ్లడ్ బ్యాంకులోని రెండు ఫ్రిజ్‌లు పాడవడం వల్ల రక్తనిల్వలు కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కలెక్టర్ దృష్టికి ఈ విలేఖరి తీసుకువెళ్లగా హాస్పటిల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులు ఆసుపత్రికి ఉన్నాయని ఈ నిధులతో సూపరింటెండెంట్ కమిటీతో సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి జిఎస్ పండాదాస్‌తో పాటు పార్వతీపురం ఆర్డీవో బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల ధర్నా
పార్వతీపురం, మే 2: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పార్వతీపురం డిపో వద్ద ఎంప్లారుూస్ ఆధ్వర్యంలో కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లారుూస్ యూనియన్ డిపో కార్యదర్శి మరిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంటిడబ్ల్యుఎసి ప్రకారం కార్మికుల డ్యూటీలు 8 గంటలకు మించి ఉండరాదన్నారు. 2011 జూలై, ఆగస్టు డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. 2012 జనవరి, ఫిబ్రవరి, మార్చి డిఎ బకాయ చెల్లించాలన్నారు. 2010,2011,2012 ఎన్‌కేష్‌మెంట్ చెల్లించాలన్నారు. చట్టప్రకారం డబుల్ డ్యూటీలకు రెట్టింపువేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ రీజినల్ వైస్ చైర్మన్ శంకరరావు, నాయకులు కృష్ణారావు, ఆచారి, పిపి తల్లి, కెఎస్ నారాయణ, జిఎస్ రావు పాల్గొన్నారు.

ఎస్‌టిఎం లబ్ధిదారులకు న్యాయం చేయాలి

పార్వతీపురం, ఏప్రిల్ 2: ఎస్‌టిఎం లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్వతీపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కురుపాం ప్రాంతంలోని 219 ఎకరాల్లోను, పార్వతీపురం మండలంలోని సంగంవలసలో 214 ఎకరాల్లోను ఎస్‌టిఎం టేకు ప్లాంటేషన్ వేయడానికి సంస్థను 1997-98లో స్థాపించారన్నారు. అయితే అప్పట్లో తమ సంస్థలో షేరు హోల్డర్లుగా చేర్చుకోవడానికి ఒక్కొక్క టేకు చెట్టును రూ.1750కు అమ్మారు. క

జిల్లాలో సాగు విస్తీర్ణం పెంపుతో పాటు అధిక ఉత్పాదకను సాధించేందుకు
english title: 
will the production rise?

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>