Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమస్యలు పరిష్కరిస్తా

$
0
0

తిరుపతి, మే 2: శతాబ్ధాల తరబడి తిరుమల వేంకటేశ్వరుని నమ్ముకుని జీవిస్తున్న స్థానికుల సమస్యలను తాను అధికారంలోనికి రాగానే పరిపూర్ణంగా పరిష్కరిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆయన స్థానికులు నివాసం వుండే బాలాజీనగర్‌ను సందర్శించి, భూమన్ కరుణాకర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. దీంతో స్థానికులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విజిలెన్స్ అధికారులు, పోలీసులు, టిటిడి, రెవిన్యూ సిబ్బంది తమపై పెడుతున్న ఆంక్షలు, ఇబ్బందులను జగన్‌తో ఏకరువు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే మీ సమస్యలను సంపూర్ణంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో జనం హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
వైఎస్ ఆశయాల సాధన జగన్‌కే సాధ్యం
- భూమన్
వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి పునః ప్రారంభం కావాలన్నా, సంపూర్ణంగా అమలు జరగాలన్నా వైఎస్ జగన్ సిఎం కావాల్సిన అవసరం ఎంతైనా వుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తిరుపతి అభ్యర్థి భూమన్ కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో జరిగిన జగన్ రోడ్‌షోలో పాల్గొన్న భూమన్ మాట్లాడుతూ రాజకీయ నేత, ఆంధ్రుల ఆరాధ్యదైవం అయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకోసం ప్రజల ముందుకు వచ్చిన జగన్‌నుఆశీర్వదించి సిఎంను చేయాల్సిన బాధ్యత మనందరిపైనా వుందన్నారు. దుష్టపాలనకు చరమ గీతం పాడాలన్నా, తిరిగి వైఎస్ స్వర్ణయుగం రావాలన్నా జగన్ సిఎం కావాలన్నారు. ఈ రోడ్‌షోలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్‌కె రోజా, అంబటి రాంబాబు, విజయచందర్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, భూమన్ అభినయరెడ్డి, తిరుమల పెంచలయ్య, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రుద్రగోపీ, ఎస్‌కెబాషా, ఇమామ్, పుల్లయ్య, వెంకటేష్, నరసింహాలు, మధుసూదన్, వౌలా తదితరులు పాల్గొన్నారు.

జగన్ తిరుపతి పర్యటనపై నిఘా నేత్రం
తిరుపతి, మే 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తిరుపతి నుండి ప్రారంభించిన ఉప ఎన్నికల ప్రచారంపై ఇటు ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి నేతలు కనే్నశారు. ముఖ్యంగా ఇంటిలిజెన్సీ విభాగం అధికారులు జగన్ పర్యటనపై ఒక ప్రత్యేక నివేదికనే ఫ్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఇందులో జగన్ పర్యటనకు మిశ్రమ స్పందన లభించిందని, అయితే ఎక్కువ సభల్లో జనాదరణ లభించిందని నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌నేతలు మాత్రం జగన్ సభలు పేలవంగా సాగాయని, వచ్చిన జనం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలించిన వారేనన్న సమాచారాన్ని అధిష్ఠానానికి అందజేసినట్లు తెలిసింది. అలాగే టిడిపి నేతలు కూడా జగన్ పర్యటనకు సంబందించి చంద్రబాబు నాయుడికి ఆయన సభల నిర్వహణ పూర్తిగా విఫలమైనట్లు సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనకు మరింత సన్నిహితుల ద్వారా వాస్తవాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాగా తాను రాజీనామా చేసిన తిరుపతి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన జగన్ రోడ్‌షో ఎలా సాగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు చిరంజీవి కూడా ఆసక్తికనపరిచినట్లు తెలిసింది. అందుకు పిఆర్‌పి నుండి కొంత మంది ముఖ్యులతో ఫోన్లలో సంప్రదించినట్లు ఫ్రచారం సాగుతోంది. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే జగన్ పర్యటన తమలో ఎనలేని ఉత్సాహాన్ని నింపిందని పదేపదే చెప్పుకుని సంబరపడుతున్నారు.

ఉప ఎన్నికల లెక్కలకు రెక్కలు
* తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌లో రూ. 72.65 లక్షలు పట్టివేత
* రెండు రోజుల్లో రూ. కోటి పట్టివేత
తిరుపతి, మే 2: ఉప ఎన్నికల లెక్కలకు రెక్కలు వస్తున్నాయ్.. గత రెండురోజుల్లోనే తిరుపతి పోలీసులు సుమారు కోటి రూపాయలు పట్టుకున్నారు. బుధవారం తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తుల నుండి 72.65లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వివరాలిలా వున్నాయి. ఉప ఎన్నికల నేపధ్యంలో తిరుపతి అర్బన్ ఎస్‌పి జె ప్రభాకర్‌రావు నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఇద్దర్ని అదుపులోనికి తీసుకుని విచారించగా వీరి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వున్నట్లు గుర్తించారు. ఈస్టు ఇన్‌చార్జి డిఎస్‌పిగా పనిచేస్తున్న శ్రీకాళహస్తి డిఎస్‌పి అభిషేకం, సిసిఎస్ ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళై తమసిబ్బందితో తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌లో వడమాలపేట మండలం కదిరి మంగళంకు చెందిన సుబ్రమణ్యం వద్ద వున్న బ్యాగును తనిఖీ చేసి చూడగా 28.50 లక్షల రూపాయల నగదు, అదే మండలం పత్తిపుత్తూరుకు చెందిన వెంకటాద్రి నుండి 44.15లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్‌పి అభిషేకం మాట్లాడుతూ తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగుళూరులో ఉన్న తన వ్యాపార భాగస్వామికి డబ్బులను తమ ద్వారా పంపిస్తున్నట్లు పట్టుపడిన నిందితులు సుబ్రహ్మణ్యం, వెంకటాద్రి చెప్పారన్నారు. అయితే ఆ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చారు, ఎందుకు తెమ్మన్నారు అన్న విషయంపై పట్టుపడిన నిందితులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని డిఎస్‌పి తెలిపారు. అనుమానం వున్న నేపధ్యంలో అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌ఐ సుధీర్‌ల సమక్షంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబందించి ఏవైనా కచ్చితమైన బిల్లులు సమర్పిస్తే ఆ డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా వుండగా ఉప ఎన్నికల్లో ఎంత డబ్బులైనా ఖర్చు చేసేందుకు ఆయా పార్టీలు సిద్ధపడుతున్న నేపధ్యంలో పోలీసులు ముందు నుండి ఎంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందుకు నిదర్శనం రెండురోజుల్లో సుమారు కోటి రూపాయలకు పైగా నగదు పట్టుపడటమే. చంద్రగిరిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుబడుతున్న వ్యక్తి బంగారు నగలు విక్రయించి 24లక్షల రూపాయలు తీసుకువస్తుండగా తన డబ్బులు పోలీసులు పట్టుకున్నట్లు చెపుతున్న విషయం విదితమే. అయితే పోలీసులు మాత్రం పట్టుపడిన డబ్బులకు సంబందించి ఎటువంటి ఆధారాలైన కచ్చితంగా వుండేటట్లు తమకు చూపిస్తే స్వాధీనం చేసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారరు. ఒక్కో అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో 30 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఉప ఎన్నికల లెక్కలకు రెక్కలు వస్తున్నాయి. ఏది ఏమైనా రెండురోజుల్లోనే కోటి రూపాయలకుపైగా డబ్బులు పోలీసులకు పట్టుపడటాన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో డబ్బులు సరఫరా అవుతున్నాయో అర్థమవుతోంది. అయితే కొంత మంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం తమకు అత్యవసరాలమీద డబ్బులు పంపిస్తూ వుంటామని, బిల్లులు వెంటనే అడిగితే వుండవని, అయితే పోలీసులు ఎన్నికల డబ్బు కాదని తెలిసినా ప్రచారం కోసం ఇలా పట్టుపడినట్లు చూపుతుంటారని విమర్శిస్తున్నారు. పోలీసులు కూడా చిక్కిందే తడవుగా పట్టుపడిన డబ్బును ఉప ఎన్నికల ఖాతాలో వేయకుండా ఆయా పరిస్థితులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని పలువురు బాధితులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ల పట్టివేతకు ప్రత్యేక బృందాలు
* జిల్లాలో నిఘా పెంపు
* జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా వెల్లడి
చిత్తూరు, మే 2: ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు జిల్లాలో నిఘా పెంచామని, అయితే పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి స్మగ్లర్లు డబ్బులు పంపి ఇక్కడి నుండి ఎర్రచందనం తీసుకెళ్తున్నట్లు జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా అన్నారు. బుధవారం ఎస్పీ బంగ్లాలో విలేఖర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్టవేసేందుకు జిల్లాలోని డిఎస్పీలు, సిఐలతో మంగళవారం సాయంత్రం సమావేశమైనట్లు చెప్పారు. 10 సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువైందన్నారు. గత సంవత్సర కాలంలో జిల్లాలో మొత్తం 100కేసులు నమోదుచేసి 400మందిని అరెస్టుచేశామన్నారు. వీరి వద్దనుండి 100టన్నుల ఎర్రచందనం, పలు వాహనాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ చెప్పారు. అయితే దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగడంలేదని, స్మగ్లింగ్‌చేసే బడాబాబులు పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి ఆపరేట్ చేస్తున్నారన్నారు. ఇక్కడ వాహనాలు సీజ్‌చేస్తే వాటిని వదిలిపెట్టి కేసుల్లో ఉన్న వ్యక్తులను విడిపించుకొనేందుకు వారు డబ్బులు అక్కడి నుండే పంపుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. తాము సేకరించిన నివేదికల ప్రకారం తమిళనాడులో బడా స్మగ్లర్లు 10మంది, కర్ణాటకరాష్ట్రంలో ఐదుగురు వెరసి 15మంది కలసి చిత్తూరు జిల్లా నుండి ఎర్రచందనాన్ని తరలించుకొని వెళ్తున్నారన్నారు. ఇలా జిల్లా సరిహద్దులు దాటించిన ఎర్రచందనాన్ని చెన్నైకు చేరవేసి ఓడల ద్వారా చైనాకు పంపుతున్నట్లు సమాచారమని, అలాగే రోడ్డు మార్గం గుండా కూడా చైనాకు వెళ్తున్నట్లు కొంత సమచారం ఉందన్నారు. ఇక్కడ ఎర్రచందనం టన్నుకు రూ.2లక్షల వరకు ఇచ్చి కొనుగోలు చేసి వారు టన్ను 20లక్షల వరకు విక్రయిస్తున్నారని, ఇంత పెద్ద మొత్తంలో లాభాలు వస్తుండడంతోనే తమిళనాడు, కర్ణాటక వాసులు నిరాటంకంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎస్పీ కాంతిరాణాటాటా చెప్పారు. వీరిని గుర్తించి చెన్నై, బెంగుళూరుల్లో ఎక్కడెక్కడ గోడౌన్లు ఉన్నాయో వాటిని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విషమై మంగళవారం సాయంత్రం ప్రత్యేక క్రైమ్‌మీటింగ్ నిర్వహించామని, ఎర్రచందన స్మగ్లింగ్ పూర్తిగా ఆపాలంటే చెన్నై, బెంగుళూరుల నుండి ఆపరేట్ చేస్తున్నవారిని మొదటగా పట్టుకోవాలని, అలాగే చెన్నైకే వెళ్తున్నదా, అది ఓడలద్వారా ఎలా వెళ్తున్నదన్న విషయాన్ని కూడా ఆరా తీయన్నునట్లు ఎస్పీ అన్నారు. మదనపల్లెలో ఈ మధ్య దొరికిన దొంగనోట్ల గురించి ప్రశ్నించగా అవి బయట నుండి వచ్చినవి కాదని, అక్కడే తయారుచేశారని, మిషనరి అంతా సీజ్‌చేసామని, దీనిపై కూడా నిఘా ఉంచినట్లు ఎస్పీ కాంతిరాణాటాటా విలేఖర్లకు వివరించారు.

శ్రీవారి సేవలో డిజిపి
తిరుపతి, మే 2: రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి మంగళవారం నాడు సాయంత్రం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి అధికారులు స్వాగతం పలికి వసతి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకమండపంలో డిజిపికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన ఆలయంలోని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అసంతృప్తులపై అభ్యర్థుల కన్ను
తిరుపతి, మే 2: ఉప ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లను దక్కించుకునేందుకు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికే నానా తంటాలు పడ్డ అభ్యర్థులు టికెట్ లభించిన తరువాత పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. దీంతో టికెట్ దక్కిందనే సంతోషం గాలిబుడగల్లా మిగులుతుంది. కారణం ఏమిటంటే తిరుపతి నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి టిడిపి, కాంగ్రెస్ పార్టీల్లో ఆసక్తి కనపరిచిన అభ్యర్థుల సంఖ్య చాంతాడంత వున్న విషయం పాఠకులకు విదితమే. టికెట్ దక్కించుకోవడానికే అభ్యర్థులు రాత్రింబవళ్లు నిద్రాహారాలుమాని ఆరోగ్యాన్ని సైతం గాలికి వదిలి అధిష్ఠానం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అతికష్టంపైన తమ పార్టీలో పోటీపడుతున్న ఆశావాహులను అధిగమించి టికెట్ దక్కించుకున్నవారు సర్వసాధారణంగా ఎనలేని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బుకావాలి. అయితే తిరుపతి నగరంలో టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి అలా కనిపించడం లేదు. కారణం ఏమిటంటే టికెట్‌ను ఆశించిన వారంతా అసంతృప్తికి లోనై ఎక్కడ తమ కొంప ముంచుతారోనన్న ఆందోళనతో తిరిగి కంటిమీద కునుకు లేకుండా యోచించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలవాలి అంటే కోట్లు ఖర్చు పెట్టుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి తప్పదు. ఓ వైపు ఉదయం వార్డుల్లోకి వెళ్లి ప్రజలను ఓట్లు వేయ్యాలని అభ్యర్థించడం, రాత్రి వేళల్లో అసంతృప్తి వాదులను బుజ్జగించేందుకు వారి ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మమేకం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో బరిలోకి దిగిన అభ్యర్థులకు ఓ వైపు జేబుకు చిల్లు మరో వైపుకంటికి నిద్ర కూడా కరవు అవుతోంది. ఇదిలా వుండగా తన ప్రత్యర్థి పార్టీలో వున్న అభ్యర్థిపై అసంతృప్తితో వున్న నేతలను ప్రసన్నం చేసుకోవడానికి మరో పార్టీ నేతలు గాలం వేసే పనిలో పడుతున్నారు. అధికార పార్టీలో అయితే నామినేటెడ్ పదవులు ఆశ చూపుతున్నారు. ప్రతిపక్ష నేతలు అయితే భవిష్యత్తు టిడిపిదేనని వారికి గాలం వేస్తున్నారు. అంతేకాకుండా కార్పోరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్, కార్పొరేటర్ టికెట్ ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. అయితే వీటిపై ఆశపడుతున్న అసంతృప్తి వాదులు ఎన్నికలు ముగిసిన తరువాత ఎక్కడ తమకు హ్యాండ్ ఇస్తారోనన్న అనుమానంతో తమ జేబులను తెరిచి చూపుతున్నారు. ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తే అటు వైపు అడుగేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధిష్ఠానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. మరికొంత మంది చోటా మోటా నాయకులు అయితే అటు... ఇటూ తిరుగుతూ ఇక్కడి సమాచారం అక్కడ.. అక్కడి సమాచారం ఇక్కడకు చేరవేస్తూ నాలుగురాళ్లు వెనకేసుకునే పనిలో పడుతున్నారు. అయితే ఈ చాప కింద వ్యవహారం ఏదో ఒక రోజు బయటపడుతుందన్న ఆందోళన వారిలో కూడా లేకపోలేదు. ఏది ఎమైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్న ఆనందం కన్నా అసంతృప్తి వాదులు పక్కకు తొంగి చూడకుండా అభ్యర్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితిని పరిశీలిస్తే టికెట్ కోసం పోటీపడిన అసంతృప్తి వాదులు లేకపోయినా కొంత మంది పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో వున్నట్లు సమాచారం. వీరు చాపకింద నీరులా ప్రత్యర్థులకు చేయూతనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏ బెడదా, మానసిక వత్తిడి లేని అభ్యర్థులు ఎవ్వరైనా వున్నారంటే సిపిఎం అభ్యర్థి అనే చెప్పాలి. అయితే వారికి ఎదురవుతున్న చిరు కొరత ఏమిటంటే తమ సోదర పార్టీ అయిన సిపిఐ మద్దతు ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్ష టిడిపికి మద్దతు ఇవ్వడానికి మంతనాలు చేస్తుండటమే మనస్థాపానికి గురి చేస్తున్న అంశమని చెప్పాలి. ఇక బిజెపి, లోక్‌సత్తా అభ్యర్థులకు ఓటమి, గెలుపులతో సంబంధం లేకుండా ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళుతున్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ఈతి బాధలు అన్ని నియోజకవర్గాల్లో ఉంటాయని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే అంటున్నారు.

దర్శనానికి వస్తే అవమానిస్తారా?
* అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల కుట్ర
* నిప్పులు చెరిగిన భూమన్
తిరుపతి, ఏప్రిల్ 2: కలియుగ ప్రత్యక్షదైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌ను టిటిడి అధికారులు అవమానపరచడం హిందూ సాంప్రదాయానికి విరుద్దమని ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, తిరుపతి అభ్యర్థి భూమన్ కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన తిరుమలలో విలేఖర్లతో మాట్లాడుతూ స్వామివారిపై అత్యంత విశ్వాసంతో దర్శనానికి వచ్చిన జగన్‌ను అడ్డుకోవడం వెనుక అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి కుట్ర వుందని ఆరోపించారు. జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల్లోస్వామివారికి వస్త్రాలను సమర్పించిన విషయాన్ని టిటిడి అధికారులు మరిచినా ప్రజలు మరిచిపోరన్నారు. అంతేకాకుండా 2009లో జగన్ శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు ఒకసారి డిక్లరేషన్ ఇచ్చారన్నారు. వచ్చిన ప్రతిసారి ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న కనీస పరిజ్ఞానం అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. ఇక క్రైస్తవమతానికి చెందిన సోనియగాంధీ తిరుమలకు వచ్చినప్పుడు ఎన్ని పర్యాయాలు సంతకాలు తీసుకున్నారో అధికారులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. భగవంతుని సన్నిధిలో అందరికి సమాన న్యాయం వుండాలే తప్ప ఒక్కొక్కరికి ఒక్కో న్యాయాన్ని టిటిడి లాంటి ధార్మిక సంస్థలో పనిచేసే అధికారులు అన్వయింపజేయడం మంచిదికాదని హితవుపలికారు.

* తిరుమల బాలాజీనగర్ వాసులకు జగన్ హామీ
english title: 
jagan haamee

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>