కడప(రూరల్)మే,26: జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ అనిల్‌కుమార్ పేర్కోన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలులో భాగంగా శనివారం 2,26,81,311రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఒక కలో, 990 గ్రాముల బంగారంను స్వాదీనం చేసుకున్నామన్నారు. 22 లైసెన్స్ లేని ఆయుధాలను సీజ్ చేయడంతో పాటు 1354 లైసెన్సు ఆయుధాలను డిపాజిట్ చేసినట్ల తెలిపారు. తెలిపారు. ఎక్సైజ్ ద్వారా 3300 లీటర్లు, 1836 లీటర్లు లిక్కర్‌ను పోలీస్ యంత్రాంగం ద్వారా సీజ్ చేసినట్లు తెలిపారు. 5814 గోడల చెరిపివేత, జెండాలను తొలగించినట్లు తెలిపారు. అలాగే 5003 మందిని బైండోవర్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఉత్కంఠ భరితంగా నామినేషన్ల పరిశీలన
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 26 : ఉప ఎన్నికల్లో భాగంగా జిల్లాలో శనివారం జరిగిన నామినేషన్ల స్క్రూట్నీ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. రైల్వేకోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె.శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి కె.ఈశ్వరయ్య, ఎమ్మెల్సీ బి.చెంగల్రాయుడు అధికారులను డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల 1955 యాక్టు 36-ఎ ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పోటీ చేయరాదని అధికారులకు యాక్టు చూపారు. ఆ మేరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరించాలని పట్టుబట్టారు. కొంత సేపు ఆ కార్యక్రమం రసాభాసగా కొనసాగింది. సదరు అధికారులు జిల్లా ఎన్నికల అధికారి వి.అనిల్‌కుమార్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాల్సిన అవసరం లేదని ఆయన నామినేషన్ సరైందేనని ఎన్నికల కమిషన్ నిర్ధారించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన 22 మంది నామినేషన్లలో ఐదుగురి నామినేషన్లు తిర్కసరించారు. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో 17 మంది 24 నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో పరిశీలించి 1 తిరస్కరించారు. మిగిలిన 23 సెట్లు సక్రమమే అని తేల్చారు. తిరస్కరించిన నామినేషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.సుబ్రమణ్యం సోదరుడు ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు)దేనని అధికారులు నిర్ధారించారు. రాజంపేటలో 27 మంది అభ్యర్థులు 42 సెట్లను నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 7 నామినేషన్లు అధికారులు తిర్కసరించారు. 20 మంది బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు నియోజకవర్గాల పార్టీల నేతలు స్క్రూట్నీ కార్యక్రమంపై డేగకన్ను పెట్టి పర్యవేక్షించారు. రాజంపేటలో మాత్రం బిజెపి అభ్యర్థి, నేతలు స్క్రూట్నీ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆతృతగా గమనించారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థులందరివీ సక్రమమేనని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈనెల 28న నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారన్నది వేచిచూడాల్సిందే.