బ్రహ్మంగారిమఠం, మే 26: వైఎస్‌ఆర్ జిల్లాలో 44 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపులేదని వాటిపై చర్యలుతీసుకోనున్నట్లు డిఇఓ అంజయ్య తెలిపారు. శనివారం బ్రహ్మంగారిమఠం వచ్చిన ఆయన వీరబ్రహేంద్రస్వామి, మాతా గోవిందమాంబలను దర్శించుకున్నారు. ఈసందర్భంగా మఠం మేనేజర్ ఈశ్వరాచార్య ఆధ్వర్యంలో ఆయనను దుశ్శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత ఈశ్వరీదేవిగుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ 44 పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్‌లు, యాజమాన్యాలు అనుమతి కోసం ఫీజులు కట్టుకుంటామని ముందుకువస్తే ఉన్నతాధికారులకు తెలియజేసి అనుమతి ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. దీనిపై రెండు మూడు రోజులల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తన వద్దకు రావాలన్నారు. అలా అనుమతికి దరఖాస్తు చేసుకోని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు గుర్తింపులేని పాఠశాలలను మూసివేస్తామన్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లోని వసతులపై ప్రత్యేక సిబ్బందితో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. జిల్లాలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయని వాటికి సంబంధించి ఉదయం 51 సెంటర్‌లల్లో, సాయంత్రం 9 సెంటర్‌ల్లో టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఖాజీపేట, రాయచోటి, శెనగలూరు, కాశినాయన, తంబేపల్లె, పెండ్లిమర్రి తదితర మండలాల్లో పది మోడల్ స్కూళ్లు మంజూరయ్యాయని ఈ పాఠశాలల్లో ఈ ఏడాది పూర్తి స్థాయిలోఅడ్మిషన్‌లను చేసుకుంటామన్నారు. దరఖాస్తులు కావాలనేకునే వారు 10వ తేదీ వరకు దరఖాస్తుచేసుకోవచ్చన్నారు. ఈ అప్లికేషన్‌లతో విద్యార్థిని, విద్యార్థులను ఎంపిక చేస్తామని డి ఇ ఓ తెలిపారు. ఈ పాఠశాలల్లో 6,7,8,9,10వ తరగతి వరకు చదివేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. జూలైలో డిఎస్పీ పరీక్షలు జరగనున్నాయని వీరిని డిఎస్పీ ద్వారావస్తే ఉపాధ్యాయులు జిల్లాలోని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఇంగ్లీష్‌పై పట్టుసాధించేందు కోసం శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామని ఇప్పటికే రాజంపేట, రాయచోటి, కడపలలో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించే శిక్షణతో ముగుస్తుందన్నారు. ఇంగ్లీష్ పాఠ్యాంశాలపై శిక్షణ ఇచ్చేందు కోసం నల్గొండ నుంచి వెంకటరెడ్డి అనే రీసోర్స్ పర్సన్ నుంచి శిక్షణ ఇస్తున్నట్లు డిఇఓ తెలిపారు. డిఇఓ వెంట రీసోర్స్ పర్సన్ వెంకటరెడ్డి, బిమఠం ఎమ్మార్సిలు పెంచలయ, చంద్రహాస్‌రెడ్డి, ఐఇడి పర్సన్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
అన్ని స్థానాల్లో గెలుస్తాం
* వైకాపా అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి
చిన్నమండెం, మే 26: ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానాన్ని తమ పార్టీ గెలుచుకుంటుందని రాయచోటి వైకా పా అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అ న్నారు. శనివారం మండలంలోని వం డాడి గ్రామంలో ఆయన ఎన్నికల ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రె స్, టిడిపి రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక సిబిఐ రూపంలో కుట్ర పన్ని వేధిస్తున్నారన్నారు. ప్రజల అండదండలు తమ పార్టీకి ఉన్నాయని, ఎలాంటి కుతంత్రాలు తమను ఏమీ చేయలేవని, అన్ని స్థానాల్లో గెలుపొందుతామని తెలిపారు. ప్రస్తుతం కాం గ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్న వారు రా జీనామా చేసి సోనియా బొమ్మతో ప్ర చారం చేసి గెలిచి నిరూపించాలన్నా రు. ఈ ఎన్నికలు ఢిల్లీకి, తెలుగోడి ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కదిరివాండ్లపల్లె, ఎర్రగట్టువాండ్లపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, గ్రామ వైఎస్‌ఆర్ సిపి నాయకులు ముసలిరెడ్డి, వెంకటరమణారెడ్డి, జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.
శాంతి భద్రతల కోసమే కవాతు
దువ్వూరు, మే 26: శాంతి భధ్రతల్లో భాగంగానే జాతీయ రహదారి పొడవునా దువ్వూరు గ్రామంలో కవాతు నిర్వహించామని సిఐ ఆరోహణరావు పేర్కొన్నారు. ఎంపి జగన్‌మోహన్‌రెడ్డిపై వస్తున్న అభియోగాలు సిబి ఐకోర్టులో విచారణ జరుగుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా కవాతు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌ఫిఎఫ్ దళం, దువ్వూరు ఎస్‌ఐ యుగంధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.