Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నామినేషన్ల పరిశీలన పూర్తి

$
0
0

అనంతపురం, మే 26: జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం అర్బన్, రాయదుర్గం నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు తిరస్కరించారు. 13 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్దారించారు. అందులో రషీద్ అహ్మద్ (కాంగ్రెస్), ఎం.ప్రభావతి (టిడిపి), ఎం.ఇంతియాజ్ (సిపిఎం) నామినేషన్లను తిరస్కరించారు. రాయదుర్గం నియోజకవర్గంలో నాలుగు నామినేషన్లు తిరస్కరించగా, 12 సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు. వాటిలో జి.అర్మితారెడ్డి (టిడిపి) రెండు నామినేషన్లు, యానాది పద్మావతి (స్వతంత్ర), లోక్‌సత్తా అభ్యర్థి వెంకటరమణకు చెందిన ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 28 వరకు గడువు ఉంది. అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.
ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ ప్రక్రియ
వేగవంతం చేయండి
* కలెక్టర్ వి.దుర్గాదాస్
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మే 26 : ఇన్‌పుట్ సబ్సిడీని బ్యాంకులకు పంపించడంతోనే తమ పని పూర్తయిందని అనుకోకుండా బ్యాంకుల నుంచి అసలైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందినపుడే ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం పూర్తయినట్లని కలెక్టర్ వి.దుర్గాదాస్ పేర్కొన్నా రు. అందులో భాగంగానే వ్యవసాయ అధికారులు, బ్యాంకు మేనేజర్లు సమన్వయం చేసుకుని సోమవారం లేదా మంగళవారం నాటికి 3,22,897 మంది బ్యాంకు ఖాతాలున్న రైతులకు చెంది న రూ. 216.50 కోట్లు ఆయా బ్యాంకు బ్రాంచిలకు పంపిం చి, వెంటనే రైతుల ఖాతాల్లోకి జమచేయాలని, అలాగే ఆయా గ్రామాల రైతులకు దండోరా ద్వారా తెలియజేయాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ సొమ్మును రైతులకు త్వరగా అందించి రాష్ట్రంలో జిల్లానే ఆదర్శంగా నిలపాలని బ్యాంకర్లను, జెడిఎను, రెవెన్యూ అధికారులను కోరారు. ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీపై శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెసి అనిత, డిఆర్‌ఓ సుదర్శనరెడ్డి, జెడిఎ సాంబశివరావు, అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా మన జిల్లాలోనే ఆన్‌లైన్ ద్వారా జల్‌తుఫాను ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. అయితే మార్పుకు ఆద్యులమైన మన జిల్లాలోనే 2011 ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీ ఆన్‌లైన్ పంపిణీని అనుకున్నంత వేగవంతంగా చేయలేకపోతున్నామన్నారు. కావున వ్యవసాయ, రెవన్యూ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో వేగవంతం చేసి రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 398 కోట్ల పెట్టుబడి రాయితీని అందించాలన్నారు. అలాగే జెడిఎ, కార్యాలయ సిబ్బంది కూడా గ్రామాల వారీగా పంట రుణాలు, పెట్టుబడి రాయితీ ఒకే రోజు రైతులకు అందించేలా ప్రణాళిక రూపొందించుకుని పనిచేయించాలని సూచించారు. జూన్ మొదటి వారంలో 90 శాతం ఇన్‌పుట్ సబ్సిడీని బ్యాంకులకు తద్వారా రైతులకు చేరే విధంగా జెడిఎ, బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జల్‌తుఫాను ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే రుణ అర్హత కార్డు కల్గిన 1,279 మందికి రుణాలు మంజూరు చేయాలని, చేనేత కార్మికులు 10,236 మందికి వీవర్స్ క్రెడిట్ కార్డులు మంజూరు చేసి జులై నెలాఖరుకు 40 శాతం మందికైనా రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. జెసి మాట్లాడుతూ పంట రుణాలు చెల్లించడానికి, విత్తన వేరుశెనగ కొనుగోలు కోసం రైతులు అధిక వడ్డీకి డబ్బులు అప్పు తీసుకుంటున్నారని, కావున బ్యాంకర్లు వేగవంతంగా ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని కోరారు. జెడిఎ మాట్లాడుతూ ప్రభుత్వం రూ. 398 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జిల్లాకు మంజూరుచేయగా ఇప్పటిరవకూ ఖాతాలు ఉన్న 3,22,897 మంది రైతులకు రూ. 216 కోట్ల బిల్లులు సిద్ధం చేసి రూ. 136 కోట్లను బ్యాంకులకు పంపామన్నారు. మిగిలిన మొత్తాన్ని సోమవారం లేదా మంగళవారం నాటికి పంపిస్తామని కలెక్టర్‌కు వివరించారు. డిఆర్‌ఓ మాట్లాడుతూ జల్‌తుఫానుకు సంబంధించి పెద్ద రైతుల జాబితాలు చిలమత్తూరు, అగళి, పరిగి తదితర ప్రాంతాల్లో పూర్తిగా మిస్ అయ్యాయని వాటిని వెంటనే పంపాలని జెడిఎను కోరారు. ఎపిజిబి ఆర్‌ఎం మహ్మద్ ఖాన్, ఎల్‌డి యం జయశంకర్ తదితర బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఎఓలు, రైతుల జాబితాలను కొంత ఆలస్యంగా బ్యాంకు మేనేజర్లకు అందిస్తున్నారని తెలుపగా వెంటనే చర్యలు తీసుకుని ఇన్‌పుట్ సబ్సిడీ డిడి, బ్యాంకు మేనేజరుకు చేరే సమయంలో రైతుల జాబితాలను ఎఓలు, ఎడిఎల ద్వారా అందించాలని కలెక్టర్ జెడిఎను ఆదేశించారు. సమావేశంలో వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, నాబార్డు ఎజిఎం డాక్టర్ రవీంద్రనాథ్, చేనేత, జౌళి శాఖ ఎడి తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాలపై
ఎసిబి సమగ్ర విచారణ
* లైసెన్స్‌దారులకు మరోమారు నోటీసులు
హిందూపురం, మే 26 : జిల్లాలో తెల్లరంగు రేషన్‌కార్డులతో మద్యం దుకాణాల లైసెన్సు పొందిన వారిపై ఎసిబి మరోసారి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారందరికీ తాజాగా నోటీసులు జారీచేసినట్లు సమాచారం. మద్యం వ్యాపారుల చిరునామా, గుర్తింపు కార్డులు, రేషన్ కార్డుల వివరాలతో పాటు పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మద్యం షాపు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో బిడ్ చెల్లించిన బ్యాంకు వివరాలతో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. అదే విధంగా బ్యాంకు గ్యారెంటీ కోసం పూచీకత్తు ఇచ్చిన వారి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వెంట తీసుకురావాలని సూచించింది. అదేవిధంగా 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి గత నెల 31వ తేదీ వరకూ మద్యం లైసెన్స్‌దారుల బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలు కూడా పొందుపరచాలని ఎసిబి అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి తోడు 2008 నుండి 2012 వరకూ ఆదాయపు పన్ను రిటర్న్స్ వివరాలు తప్పని సరిగా తమకు నివేదించాలని తెలిపారు. ఇదేవిధంగా ఆయా మద్యం షాపులు అకౌంట్లను చూస్తున్న ఆడిటర్ల పూర్తి వివరాలు కూడా తమకు తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మద్యం షాపుల లైసెన్స్‌దారుల తాజా పాస్ ఫొటో, నివాసం ఉంటున్న గృహం ఫొటోను కూడా తమకు అందజేసే నివేదికలో పొందుపరచాలని పేర్కొన్నారు.
గతంలో జిల్లాలో ఎసిబి అధికారులు వివిధ ప్రాంతాల్లో మద్యం షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి తెల్లరంగు రేషన్‌కార్డుల పేర మద్యం దుకాణాల లైసెన్సు పొందిన వారి వివరాలు సేకరించారు. జిల్లాలో మొత్తం 234 మద్యం దుకాణాలు ఉండగా ఇందులో దాదాపు 148 మంది తెల్లకార్డులపై మద్యం దుకాణాల లైసెన్సు పొందినట్లు తేల్చారు. రెవెన్యూ శాఖతో మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ఇంటి వివరాలు, రేషన్‌కార్డు తదితరాలపై విచారణ చేపట్టారు. మద్యం దుకాణాల లైసెన్స్ కలిగి ఉన్న వ్యాపారుల తెల్లరేషన్ కార్డులను ఇప్పటికే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని వివరాలను ఎసిబికి నివేదించారు. దీనికి తోడు అనంతపురంలో ఇటీవలే ఆయా వ్యాపారులను ఎసిబి అధికారులు విచారించారు. తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండి లక్షలాది రూపాయల్లో మద్యం దుకాణాల నిర్వహణకు ఎలా సాధ్యమని వ్యాపారులను అధికారులు విచారించారు. అయితే ఇప్పటి వరకూ కేవలం 30 మంది లోపు తెల్లకార్డు ఉన్న మద్యం లైసెన్స్‌దారులు మాత్రమే ఎసిబి విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. మిగిలిన వంద మంది లైసెన్స్‌దారులు ఎసిబి అధికారుల విచారణకు హాజరు కానప్పటికీ ఆయా షాపులకు ఎక్సైజ్ శాఖ డిపో నుండి స్టాకు పంపిణీ చేస్తుండటం గమనార్హం.
బినామీ మద్యం వ్యవహారాల నిగ్గుతేల్చేందుకు ఎసిబి మళ్లీ రంగంలోకి దిగడంతో మద్యం వ్యాపారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి మద్యం షాపుల లైసెన్స్‌దారులుగా ఉన్న వ్యాపారుల్లో మరింత దడ చోటుచేసుకుంది. ఎసిబి తాజా నోటీసులకు మద్యం వ్యాపారులు ఏ మాత్రం స్పందిస్తారోనన్న చర్చ సాగుతోంది. వచ్చే నెలాఖరుకు మద్యం లైసెన్స్ కాల పరిమితి ముగుస్తుండడం, కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం అమలు పరిచే అవకాశం ఉండటంతో ఎసిబి విచారణ ఏ మాత్రం సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.

* ఏడు నామినేషన్ల తిరస్కృతి * అనంతలో - 3, రాయదుర్గంలో - 4
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>