Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆందోళన వద్దు

$
0
0

అనంతపురం రూరల్, మే 26 : వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను సిబిఐ అధికారులు విచారణ అనంతరం అరెస్టు చేస్తారని టిడిపి, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనలు చెందవదని పైలా నరసింహయ్య తెలిపారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో టిడిపి, అధికార పార్టీ కుమ్మకై వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షునిపై అక్రమ కేసులు పెట్టించాలి చుస్తుందన్నారు. సిబిఐ వారు సదరనంగా జగన్ విచారిస్తుంటే టిడిపి, అధికార పార్టీ నాయకులు జగన్ సిబిఐ అధికారులు అరెస్టు చేసి జైల్‌కు పంపుతారన్ని ప్రచారం చేస్తున్నారని వారి మాటలను నమ్మి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఎలాంటి ఆత్మహత్యలకు, అవాంఛనీయ సంఘటనలకు, ఆందోళలనకు చెందవద్దని పార్టీ శ్రేణులకు తెలిపారు. ప్రజా కోర్టులో తప్పక న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెస్ కుమ్మకై జగన్‌ను సిబిఐ వారితో వేధిస్తుందన్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నాయన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే గాంధీమార్గంలో శాంతియుతంగా ధర్నాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్న జగన్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారన్న ఇలాంటి వదంతులు ప్రజలకు తెలిపితే జగన్‌ను ప్రజలు వ్యతిరేకిస్తారని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఇలా వ్యవహరిస్తుందన్నారు. రెండోవ రోజు సిబఐ విచారణను ముగించుకుని జగన్ వచ్చాడని దీన్ని బట్టిచూస్తే జగన్ అరెస్టు చేయరని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, నరసింహులు, నారాయణరెడ్డి, చంద్రప్ప, మిద్ద్భోస్కర్‌రెడ్డి, పోచ్చం మనోహర్‌రెడ్డి, మారేష్, జెఎం. బాషా, సాకే ఆది తదితరులు పాల్గొన్నారు.
తూమకుంట చెక్‌పోస్టు వద్ద
రూ. 4.27 లక్షలు పట్టివేత
హిందూపురం రూరల్, మే 26: హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూమకుంట చెక్‌పోస్టులో శనివారం సాయంత్రం రూ. 4.27 లక్షల నగదును పట్టుకున్నట్లు రూరల్ సిఐ వేణుగోపాల్ తెలిపారు. స్థానిక రూర ల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగం గా తూమకుంట చెక్‌పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తుండగా తూమకుంటకు చెందిన కాంట్రాక్టర్ కెఎన్ నరసింహమూర్తి ఫియట్ పింటో కారులో రూ. 4.27 లక్షల నగదు తరలిస్తుండగా స్వా ధీనం చేసుకున్నామన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేశామని, ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా ఇప్పటి వరకూ వాహనాల తనిఖీల్లో హిందూపురం రూరల్ పరిధిలో రూ. 24.05 లక్షల నగదును సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. సమావేశంలో వన్ టౌన్, టూ టౌన్ సిఐలు బి.శ్రీనివాసులు, ఇదుర్‌బాషా, రూరల్ ఎస్సై చాంద్‌బాషా పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో
మంత్రుల అధికార దుర్వినియోగం!
* బిజెపి జిల్లా అధ్యక్షుడు విష్ణు
కదిరి, మే 26: జిల్లాలో జరుగుతున్న రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బిజెపి నాయకులు విమర్శించారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని, పోలీసులు ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. శనివారం సాయం త్రం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, దళిత మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలుపుల గంగాధర్, పట్టణాధ్యక్షులు రాజశేఖర్‌బాబు, నాయకులు లక్ష్మినారాయణ, ఆంజనేయులు, పీట్ల రమణమ్మ మాట్లాడారు. జిల్లాలోని అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సాధారణ అంగన్‌వాడీ కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు పార్టీ కార్యకర్తగా వాడుకుంటూ ప్రచారం చేస్తు న్నారన్నారు. మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉప ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే విధంగా కృషి చేయాలన్నారు. దీనికి తోడు పోలీసులు జిల్లాలో లక్షలాది రూపాయలు పట్టుకున్నారని, మద్యాన్ని స్వా ధీనం చేసుకున్నామని పత్రికలకు ఫోజులివ్వడమేకాని వాస్తవంగా వారు చేసింది ఏమి లేదన్నారు. ఇప్పటి వర కు ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పా టు చేసి సామాన్య, వ్యాపారులు, ఉద్యోగులకు సంబంధించిన డబ్బును మాత్రమే పట్టుకోవడం జరిగింది తప్ప రాజకీయ పార్టీలకు చెందిన నేతల డబ్బులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రె స్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు విచ్చల విడిగా డబ్బులు వ్యయం చేస్తూ జన సమీకరణ చేయ డం, వందలాది వాహనాలను తరలించడం, బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతున్నప్పటికి నిబంధనను అనుసరించి వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. పోలీసుల చర్యల వలన ప్రస్తుతం చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు నగదును తీసుకుకెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం ఎటిఎంలో తీసుకునే రూ. 10 వేలకు కూడా నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంతో వ్యాపారులు మరింత భయానికి గురవుతున్నారన్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్‌లో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలోకాని, నష్టపరిహారం పంపిణీ చేయడంలోకాని తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారన్నారు. దీంతో ఖరీఫ్‌లో వేరుశెనగ సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీనికి తోడు నాసిరకం విత్తన కాయలు పంపిణీ చేయడం, కుటుంబానికి ఒక్క పాసుపుస్తకానికే విత్తన కాయలు ఇస్తామని అధికారులు చెప్ప డం వంటి కారణాలతో వేరుశెనగ విత్త న కాయల పంపిణీకి రైతుల నుంచి తగిన స్పందన లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా రైతులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మంత్రులు, అధికారులు ఆర్భాటంగా చెప్పడమేకాని ఇప్పటి వరకు గడ్డి కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదన్నారు. సమావేశంలో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

* వైకాపా శ్రేణులకు పైలా సూచన
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>