మడకశిర, మే 26: జిల్లాలోని మడకశిర, పెనుకొండ, పెన్నహోబిలంలలో ఏర్పాటు చేసిన ఉచిత పశుగ్రాస కేంద్రాల్లో ప్రతిరోజూ 18 వేల పశువులకు గ్రాసం పంపిణీ చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ముకుందప్ప తెలిపారు. మడకశిరలోని గడ్డి కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం జెడి విలేఖరులతో మాట్లాడుతూ పాడి పశువులు కలిగిన దూర ప్రాంత రైతుల వినతి మేరకు 75 శాతం సబ్సిడీతో టన్ను గడ్డి రూ. 1900లు చెల్లించి పొందేవిధంగా గ్రామాలకు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు పంపామని మరో రెండు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. రెండు పశువులు కలిగిన ప్రతి రైతుకు 10 కిలోల ప్రకారం 15 రోజులకు సరిపడా గడ్డి అందిస్తామన్నారు. 3 గడ్డి కేంద్రాల్లో 1,557 మెట్రిక్ టన్నుల గడ్డిని నిల్వ చేయగా ఇప్పటి వరకూ 1,064 మెట్రిక్ టన్నుల గడ్డిని రైతులకు అందజేశామన్నారు. కరవు పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో 16 చోట్ల గడ్డి కేంద్రా లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా కేవలం మూడింటికి మాత్రమే అనుమతి వచ్చిందన్నారు. జిల్లాలో 15.42 లక్షల పాడిపశువులు ఉన్నాయని, అం దులో 1.2 లక్షల పశువులకు గడ్డి కొర త ఉందని, వాటికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గడ్డి విత్తనాలు సరఫరా చేసి పశుగ్రాసం అందించినట్లు తెలిపారు. గడ్డి కేంద్రాలకు ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆ నిధులు ఖర్చు అయ్యే వరకూ కేంద్రాలను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 1.85 లక్షల బోర్లు ఉండగా కేవలం 85 వేల బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, దీంతో చాలామంది రైతులు గడ్డిని పెంచడం లేదన్నారు. రైతులకు గడ్డి విత్తనాలను సబ్సిడీతో అందిస్తామని, కనీసం అప్పటి వరకైనా పశుగ్రాసం పెంచుకోవాలన్నారు. అనంతరం గడ్డి పంపిణీ కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సమావేశంలో క్యాంపు నిర్వహణ అధికారి సుబ్రమణ్యం, ఎడి శ్రీనివాసులు, డాక్టర్ హరినాథరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
పన్ను బకాయిలు వసూలు చేయండి
అనంతపురం టౌన్, మే 26: కార్పొరేషన్‌లో ఆస్తి, నీటి పన్ను బకాయిలపై దృష్టి సారించి వాటి వసూళ్ళకై చర్యలు చేపట్టాలని కమిషనర్ నీలకంఠారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓలు, ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు పాల్గొన్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ పన్ను బకాయిదారుల జాబితా ప్రకారం ఇంటింటికి వెళ్లి బకాయిలు కట్టించాలని అన్నారు. పెండింగ్ బకాయిలు ఉంటే వారి ఇండ్లకు వెళ్లి పన్ను వసూలు చేయాలన్నారు. పన్ను బకాయిలు చెల్లించకుంటే కొళాయి కనెక్షన్ తొలగించటం జరుగుతుందని హెచ్చరించాలన్నారు. ఖాళీ స్థలాల జాబితాను తయారు చేసి స్థలయజమానులకు వేకెంట్ టాక్స్ నోటీసులు జారీ చేయాలన్నారు. పన్ను వసూళ్లలో బిల్‌కలెక్టర్స్‌దే కీలక బాధ్యతయన్నారు. ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్లు వారికి కేటాయించిన పనులు సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిది రెవెన్యూ ఆఫీసర్లు రోజూ తనిఖీ చేయాలన్నారు. కంప్యూటర్‌లో టాక్స్ మాడిఫికేషన్స్ ఇష్టానుసారంగా చేపట్టకుండా చూడాలన్నారు. దీనివలన లేనిపోని సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. మాడిఫికేషన్స్ తప్పనిసరిగా కమిషనర్ అనుమతితోనే చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ పన్ను బకాయిలున్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై దృష్టి నిలపాలని అన్నారు. మార్కెట్ యార్డు, ఆర్‌టిసి, పోలీస్ కాంప్లెక్స్, బిఎస్‌ఎన్‌ఎల్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో పన్ను బకాయిల వసూలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలోని మడకశిర, పెనుకొండ, పెన్నహోబిలంలలో ఏర్పాటు చేసిన ఉచిత పశుగ్రాస కేంద్రాల్లో ప్రతిరోజూ 18 వేల
english title:
r
Date:
Sunday, May 27, 2012