టాబ్లెట్లు,
స్మార్ట్ఫోన్లు,
ల్యాప్‌టాప్‌లు
వాడడం
ముమ్మరమైన
దగ్గర నుంచీ
పోర్టబుల్ స్పీకర్ల
జోరు కూడా
పెరిగింది. వివిధ
కంప్యూటర్
ఆక్సెసరీస్,
మొబైల్ ఫోన్లు
మార్కెట్‌లోకి
తెస్తున్న ఐ బాల్
సంస్థ ఇటీవల ఓ
కొత్త మోడల్
పోర్టబుల్
స్పీకర్లను
తెచ్చింది.
బూమ్‌బాస్టిక్ అనే
పేరిట విడుదల
చేసిన ఈ స్పీకర్లు
పేరుకు తగ్గట్లు
మంచి సౌండ్
క్లారిటీని
అందిస్తాయని
కంపెనీ
వివరిస్తోంది.
నాలుగువాట్ల
ఔట్‌పుట్
అందించే ఈ
స్పీకర్లు
మాగ్జిమమ్
సౌండ్ వద్ద పెద్దగా
ఇబ్బంది
పెట్టకుండా
పనిచేస్తాయట.
మోటోకీ త్రీ
రాను రాను
మొబైళ్ల సంఖ్య
పెరుగుతుండడం
తో, డ్యూయల్
సిమ్‌ల ఫోన్‌లు
కూడా చాలడం
లేదు. దీంతో
ట్రిపుల్ సిమ్
ఫోన్‌లు
మార్కెట్‌లోకి
వస్తున్నాయి.
గతంలో ఇంటెక్స్
ఇలాంటి రెండు
జిఎస్‌ఎమ్, ఒక
సిడిఎంఎ ఫోన్‌ను
మార్కెట్‌లోకి
తెచ్చింది.
తాజాగా
మోటరోలా
ఇలాంటి
ప్రయోగం
చేస్తోంది. అయితే
ప్రస్తుతానికి దీన్ని
బ్రెజిల్
మార్కెట్‌లోకి
విడుదల
చేసింది. త్వరలో
మన
మార్కెట్‌లోకి
కూడా వస్తుంది.
ఈ ఫోన్‌లో
మూడు సిమ్‌లు
అమర్చుకోవచ్చు
. క్వెర్టీ కీబోర్లు, 2
మెగాపిక్సల్
కెమేరా,
ఎక్స్‌పాండబుల్
మెమరీ దీనికి
అదనపు
సౌకర్యాలు.