యు.పిలో భాభీ డింపుల్‌కి ప్రతిగా- కనోజ్‌లో ఎవర్నీ పోటీకి నిలబెట్టలేదు. యు.పి.ఏకీ, ‘యాదవుల’కీ ఏమిటో రుూ దోస్తీ? ‘‘ఆ మాటకొస్తే పోయినసారి కూడా ములాయం మీద మేము ఎవర్నీ ఎదురొడ్డలేదు’’ అన్నాడు కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్. మొన్న సోనియా గాంధీగారు యు.పి.ఏ భాగస్వాములకి ఒక డిన్నర్ యిస్తే- యు.పి.ఏలో గౌరవ సభ్యత్వం కూడా లేని ములాయమ్‌జీ సెంటర్ స్టేజీమీద ప్రత్యక్షమయినాడు. ఈయన్ని చూడంగానే- సాదరంగా ‘గొంపోయి’- సోనియాజీ ప్రక్కన కూర్చోబెట్టారు.
నేను ‘గో.పి.’ని అన్నట్లుగా సీనియర్ యాదవ్ మాట్లాడుతున్నా- రేపు రాష్టప్రతి ఎన్నికలో ‘ముగ్గురాండ్రు’వారు జయా- మాయా- మమతాలు- ఎటు గాండ్రుమంటారో వూహించుకుని- కాంగ్రెస్ వారు డింపుల్‌కి కనోజ్‌లో ఎదురులేని గెలుపు యిప్పించాలనుకున్నారు. దీనే్న ‘‘ఇస్తినమ్మ వాయనం- అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం’ అంటారు. రాజకీయాల్లో ఏం ‘బాదరాయణం’ జరిగినా చకితులం కానక్కరలేదు.
కడివెడు దాహం-గుక్కెడు నీళ్లు
‘డయల్ - ఏ -టాంకర్’కి ‘రింగ్’ యిస్తే టాంకులనిండా నీళ్లు వస్తాయన్న ఆశలు కూడా అడుగంటిపోయాయి. బావులు, బోరులు, చెరువులు, తటాకములు, రిజర్వాయర్లు లాంటి పాతాళ గంగలు అన్నీ యింకిపోయి సిటీలో గుక్కెడు నీళ్లు కావాలంటే- పైసలు పెట్టినా దొరకని స్థితి- ‘మూలిగే నక్కమీద తాటిపండు’ చందాన- ‘పవర్‌కట్’లు పడ్డాయి. టాంకర్లలోకి- ఏదో ఒక పాతాళగంగనో- నిల్వ నీటినో లాగుదామన్నా- ఏదీ? కరెంటేదీ? పైసలకి- వాటర్ టాంకర్లను పంపే కంపెనీల దగ్గర వెయిటింగ్ లిస్టులు- వందల సంఖ్యలో పేరుకుపోతున్నాయి.
టాంకర్‌లు ఖాళీగా పడున్నాయి. ‘‘2005 నాటి స్థితికన్నా 2012 నాటి స్థితి మరీ దారుణంగా వుంది’’ అంటూ అందరూ ఆకాశం వేపు ఆశగా చూస్తున్నారు. అక్కడ నీళ్లున్నాయని కాదు- దేవుడు కనికరించి వానలు కురిపిస్తాడేమోనని. ‘‘రుతుపవనాలూ! రండు!’’
veeraji@sify.com
యు.పిలో భాభీ డింపుల్‌కి ప్రతిగా- కనోజ్‌లో ఎవర్నీ పోటీకి నిలబెట్టలేదు
english title:
dimple
Date:
Tuesday, June 12, 2012