న్యూఢిల్లీ/లక్నో, జూన్ 11: రాష్టప్రతి అభ్యర్థిగా ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జికి మద్దతు ఇచ్చే విషయంలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వౌ నం వహిస్తున్నారు. యుపిఏకు తన నిర్ణయం తెలియజేయకుండా ఎస్‌పి దోబూచులాడుతోంది. అభ్య ర్థి ఎవరనేది అధికారికంగా వెల్లడించిన తరువాతే తన నిర్ణయం తెలియజేస్తానని సోమవారం ఇక్కడ విలేఖర్లకు చెప్పారు. ‘రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అభ్యర్థిగా ఎవరు నిలబడతారో తేల్చలేదు’ అని ములాయం తెలిపారు. అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించిన తరువాతే మద్దతు విష యం నిర్ణయిస్తామని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థి ఎవరో తెలియకుండా నిర్ణ యం తీసుకోవడం సరైంది కాదని సమాజ్‌వాది పార్టీ అధినేత స్పష్టం చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకూ తమను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. ‘ మా పార్టీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి షెడ్యూలు వచ్చాక పార్టీ పార్లమెంటరీ బోర్డు మరో సారి సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది’అని ఎస్‌పి అధినేత వెల్లడించారు. యుపిఏ బలపరిచిన అభ్యర్థికే మద్దతు ఇస్తారా? అన్న విలేఖర్ల ప్రశ్నకు అలాంటిది ఏమీలేదన్నారు. యుపిఏకు వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న తాము ప్రభుత్వంలో లేమన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారాయన.
=====