శ్రీనగర్, జూన్ 11: జమ్మూకాశ్మీర్‌లో సోమవారం ఉదయం ఒక గంట సమయంలోనే భూమి మూడు సార్లు కంపించింది. ఉదయం 10 గంటల 32 నిమిషాలకు వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదవగా, మరో 27 నిమిషాలకు వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదయ్యాయని ప్రకృత్తి విపత్తుల నిర్వహణ అధికారి అమీర్ అలీ తెలిపారు. ఈ భూకంపానికి కేంద్రం అఫ్గానిస్తాన్‌లోని హిందుకుష్ ప్రాంతంలో ఉందని ఆయన చెప్పారు.
అయితే, పది గంటల ఐదు నిమిషాలకు 3.8 తీవ్రతతో తొలి ప్రకంపనలు వచ్చాయని మరో అధికారి తెలిపారు. సిక్కిం- నేపాల్ సరిహద్దు కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు ప్రకంపనల వల్ల ఏవిధమైన నష్టం సంభవించలేదు.
మూడు సార్లు కంపించిన భూమి
english title:
earth quake
Date:
Tuesday, June 12, 2012