పాడేరు, జూన్ 19: రాష్ట్ర ఎస్.సి., ఎస్.టి. కేబినెట్ సబ్‌కమిటీ విశాఖ మన్య ప్రాంత పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు అధికారులను ఆదేశించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేది శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ పాడేరులో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఏడుగురు మంత్రుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఎస్.సి., ఎస్.టి.ల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు, నిధుల వ్యయం అంశాలను చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఏజెన్సీలోని వివిధ ప్రభుత్వ శాఖలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులు కరపత్రాలను తయారు చేయాలని ఆయన సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ పాడేరులో నిర్వహించే వర్క్‌షాపునకు మాజీ శాసనసభ్యులు, జెడ్పీటీసీలు, ఎం.పి.పి.లు, సర్పంచ్‌లు, ఎం.పి.టి.సి.లను ఆహ్వానించాలని ఆయన ఆదేశించారు. వర్క్‌షాపు నిర్వహించే ప్రాంగణంలో ఇందిరాక్రాంతి పథం, ఉద్యానవనాలు, కాఫీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వైద్య ఆరోగ్యం, విద్యా, మాతా శిశు సంక్షేమం, ప్రచార విభాగం, ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో ఆయా శాఖలు కార్యక్రమాలపై ప్రదర్శన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పాడేరు మండలంలోని ఒక గ్రామాన్ని కమిటీ సభ్యులు సందర్శించి గిరిజనులు పండిస్తున్న కాఫీ తోటలను పరిశీలించనున్నట్టు నాయుడు తెలిపారు. అంతకుముందు సబ్ కమిటీ నిర్వహించే వర్క్‌షాపును స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించి కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో ఇందిరాక్రాంతి పథం అదనపు సంచాలకుడు జె.వెంకటరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరెడ్డి, పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, కాఫీ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రామ్మోహనరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్.సి., ఎస్.టి. కేబినెట్ సబ్‌కమిటీ విశాఖ మన్య ప్రాంత పర్యటనకు అవసరమైన
english title:
arrangements
Date:
Wednesday, June 20, 2012