విశాఖపట్నం, జూన్ 19: స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదం వలన ప్లాంట్ రెండో దశ విస్తరణకు ఎటువంటి ఇబ్బంది లేదని స్టీల్‌ప్లాంట్ సిఎండి ఎపి చౌదరి తెలియజేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం జరగడానికిగల కారణాలపై విచారణ జరిపేందుకు అత్యున్నతస్థాయి కమిటీ బుధవారం వస్తోందన్నారు. ఆక్సిజన్ హౌస్ నోమెన్ జోన్ అని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగే సమయంలో 19 మంది ఎందుకు ఉన్నారన్నది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ నుంచి 38 కిలోల ఆక్సిజన్ విడుదల అవుతుందని, దాన్ని ఆక్సిజన్ హౌస్‌లో 18 కిలోలకు తగ్గిస్తారని చెప్పారు. బఫర్ బేసిన్ తరువాత ఉన్న పైప్‌లైన్ వద్ద ప్రమమాదం జరిగినట్టు తెలుస్తోందని చౌదరి తెలియజేశారు. ఏదేమైనా అత్యున్నతస్థాయి కమిటీ ప్రమాదాన్ని విశే్లషించాల్సి ఉందని అన్నారు.
ఈ ఆక్సిజన్ ప్లాంట్ సక్రమంగా పనిచేసి ఉంటే, ఎస్‌ఎంఎస్ విభాగం నేడుపూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేదని, దీంతో రెండో దశ విస్తరణ విజయవంతమయ్యేదని సిఎండి చౌదరి చెప్పారు. ఈ ప్రమాదం వలన కాస్తంత నష్టం వాటిల్లినా, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. బుధవారం విచారణ బృందం వచ్చి వెళ్లిన వెంటనే తిరిగి విస్తరణ పనులు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. విస్తరణలో నాణ్యత లోపభూయిష్టంగా ఉందన్న వాదనలో నిజం లేదని ఆయన చెప్పారు.
* స్టీల్ ప్లాంట్ సిఎండి చౌదరి వెల్లడి
english title:
no issue
Date:
Wednesday, June 20, 2012