డుంబ్రిగుడ, జూన్ 19: మండలంలోని సాగర పంచాయతీ సిమిలిగుడ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం నాయకుడు టి.సూర్యనారాయణ కోరారు. సిమిలిగుడ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎం.పి.డి.ఒ.కార్యాలయం వద్ద గ్రామ గిరిజనులతో కలసి సుమారు రెండు గంటలపాటు బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బి.పోతురాజు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య ఉద్ధృతంగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం తమ విధులు నత్తనడకన సాగిస్తూ సమస్యలను జఠిలం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సమస్య ఉత్పన్నమైన వెంటనే స్పందించినచో సమస్య తీవ్రం కాకుండా పరిష్కారానికి ఆవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. సిమిలిగుడ గ్రామ మంచినీటి సమస్య పరిష్కరించే వరకు కార్యాలయం నుండి కదిలేది లేదని భీష్మించుకు కూర్చొన్న ఆందోళనకారులకు కార్యాలయ సూపరింటెండెంట్ అర్జున్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులతోపాటు సుమారు రెండు వందల మంది గిరిజనులు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమించే భవన నిర్మాణాలను కూల్చివేయాలి
* మున్సిపల్ శాఖ ఆర్.జె.డి. ఆశాజ్యోతి
నర్సీపట్నం, జూన్ 19: నిబంధనలను అతిక్రమించి నిర్మించే అపార్టుమెంట్లు, గృహాలను కూల్చి వేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆశాజ్యోతి కమిషనర్‌ను ఆదేశించారు. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆమె మున్సిపల్ కమిషనర్, టౌన్ ఫ్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో అక్రమ నిర్మాణాలపై సమీక్షించారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మించే కట్టడాలను కూల్చివేసే అధికారం మున్సిపల్ కమిషనర్‌కు ఉందని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చోరాదని ఆమె అన్నారు. అటువంటి నిర్మాణాలను కూల్చివేయకపోతే ఒకరిని చూసి మరొకరు నిబంధనలను ఉల్లంఘించే ప్రమాదం ఉందన్నారు. ముందుగా నోటీసులు జారీచేయాలని, అప్పటికీ క్రమబద్దీకరించకపోతే జె.సి.బి.తో కూల్చి వేయాలన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో నిబంధనలు అతిక్రమించి చేస్తున్న నిర్మాణాలు అధికంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2011 ఏప్రిల్‌లో 168 జి. ఓ.ను జారీ చేసిందన్నారు. ఈ జి. ఓ. ప్రకారం అపార్టుమెంట్లు, గృహాలు నిర్మాణం చేసే వారంతా చదరపు అడుగును అనుసచరించి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. నిబంధనలు కాదని నిర్మాణాలు చేసే వారిపై గతంలో పది శాతం పన్ను అదనంగా వేసే వారమని, ప్రస్తుతం ఈ పన్ను 25 శాతానికి పెరిగిందన్నారు. భవనం రెగ్యులర్ అయ్యే వరకు, కూల్చే వరకు నిర్మాణదారుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆశాజ్యోతి అన్నారు.
13 మున్సిపాలిటీలకు రూ. 15.53 కోట్లు
రీజనల్ పరిధిలో 13 మున్సిపాలిటీలను 2012-13 ఆర్ధిక సంవత్సరానికి 15.53 కోట్ల రూపాయలు ఆర్ధిక సంఘం నిధులు విడుదల అయ్యాయని ఆశాజ్యోతి తెలిపారు. ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ నిధులకు సంబంధించి 79 ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ నిధులతో మంచినీరు, డ్రైనేజీలు, ఫైపులైన్లు మార్పు వంటి పనులు ప్రతిపాదించినట్లు వివరించారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నీటి వనరులు లేకపోవడంతో జలాశయం ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆర్.జె.డి. కమిషనర్‌ను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి
* డిప్యూటీ డిఇఒ మధుసూదనరావు
మాడుగుల, జూన్ 19: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాంక్‌లు సాధించే వి ధంగా నాణ్యమైన విద్యను అందించాలని డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఆదేశించారు. మంగళవారం మాడుగుల సెయింట్ ఆన్స్ పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోగల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించి పాఠశాలల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులే కారకుల ని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తే విద్యార్థు లు వేలాది రూపాయలను ఖర్చుచేసి ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు చేరతారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్యున్నత ప్రతిభ సాధించిన విద్యార్థుల వివరాలను ప్రజలకు చేరవేయగలిగితే ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శా తం పెరుగుతుందని ఆయన ఆశాభా వం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించితే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సమాధానం చెప్పవచ్చని ఆయ న తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఉ పాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసి నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించాలని కోరారు. జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 200 పాఠశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు గుర్తించామని, పాఠశాల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 34 పాఠశాలల ను ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేశామని ఆయన చెప్పారు. పాడేరు డివిజన్‌లో అధిక శాతం ఉత్తీర్ణతను సాధించిన ఐదు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యా హక్కు చట్టం సమగ్రంగా అమలు జరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.