Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు

$
0
0

నర్సాపూర్,జూన్ 21: విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటునట్లు రాష్ట్ర స్ర్తిశిశుసంక్షేమశాఖ మంత్రి వి.సునీతారెడ్డి వెల్లడించారు. గురువారం నర్సాపూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కొందరు కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని కావల్సినంత ఉందని అన్నారు. రైతులు ఎరువులకు తొందర పడాల్సిన అవసరం లేదని సూచించారు. మాత శిశుమరణాలను తగ్గించేందుకు గాను సంకల్పు 2ను పకడ్భందిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు 108ను తప్పక వాడుకోవాలని సూచించారు. ఐకెపి, ఐసిడిఎస్ ద్వారా గర్భిణులకు అవగాహన కల్గించేందుకు సంకల్పు 2ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్‌ల వారిగా క్యాంపులు నిర్వహించి వికలాంగులను గుర్తించనున్నట్లు తెలిపారు. వికలాంగుల గ్రూపులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. అంతేగాకుండ ప్రతి మండల కేంద్రంలో స్ర్తిశక్తి భవనాలు, గ్రామాల్లో విఓ భవనాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ అభయహస్తం కింద పెన్షన్లు అందించడం జరుగుతుందని అన్నారు. 12లక్షల మంది విద్యార్థులకు 117 కోట్ల స్కాలర్ షిప్పులు అందించడం జరిగిందని అన్నారు. విద్య పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. స్ర్తినిధి బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు. ఈసమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్,ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్,నాయకులు కృష్ణారావు,అన్నపూర్ణ,మైపాల్‌రెడ్డి,నయిం,శ్రీనివాస్‌గుప్త,క్రిష్ణ పాల్గొన్నారు.

పరిశ్రమలు
కాలుష్య నియంత్రణ పాటించాలి
పరిశ్రమల యజమానులకు కలెక్టర్ సూచన
సంగారెడ్డి, జూన్ 21: పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి సూచించిన నియమ నిబంధనలను తూచ తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిన్నారం మండలం కాజీపల్లి, మిట్టపల్లి గ్రామాలలో గల పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాజీపల్లి, మిట్టపల్లి గ్రామాలలో ఉన్న రసాయన పరిశ్రమలు వీటి ద్వారా వెలువడే వ్యర్థపదార్థాలతో మంచి నీరు కలుషితం అవడమే కాకుండా ఈ గ్రామంలోని భూములు కలుషితమవుతున్నాయని, ఈ భూములు కలుషితం కాకుండా పరిశ్రమ యాజమానులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు తాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను పరిశ్రమల యజమానులు పెద్ద గోతులను తవ్వి నిల్వ చేసి, ఎప్పటికప్పుడు పటాన్‌చెరు మండలకేంద్రంలో ఉన్న కాలుష్య నియంత్రణ శుద్ధి కర్మాగారంలో వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని పరిశ్రమలు అండర్ గ్రౌండ్ కాలుష్యాన్ని నిల్వ ఉంచడం వల్ల భూగర్బ జలాలు కాలుష్యంతో నిండిపోతున్నాయని, పరిశ్రమ యజమానులు పరిశ్రమల్లో భూగర్బంలో కాలుష్యం జలాలు నిల్వఉంచితే అట్టి పరిశ్రమలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల కాలుష్య నియంత్రన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌లో విత్తనాల కొరత
సంగారెడ్డి,జూన్ 21: ఖరీఫ్ సీజన్‌లో రైతులను విత్తనాల కొరత వెంటాడుతుంది. వర్షాలు ఒకేసారి కురియడంతో రైతాంగం పత్తి, వరి, సోయాబీన్ తదితర విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాలతో పాటు విత్తనాల డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులను నిలదీయడంతో పాటు ఆందోళనకు సైతం దిగుతున్నారు. ప్రధానంగా జిల్లాలో జహీరాబాద్, నారాయణఖేడ్‌లో సోయాబీన్ కోసం అలాగే బీటి పత్తి విత్తనాల కోసం, వరి విత్తనాల కోసం ఆందోళనకు దిగారు. గజ్వేల్, సంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల్లో రైతాంగం గత మూడు రోజుల నుండి వివిధ రకాల విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. గజ్వేల్ తదితర ప్రాంతాల్లో రైతాంగం విత్తనాలను పోలీసు స్టేషన్‌లో నిలిచి ఉండి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎలా నెలకొందో అర్థమవుతుంది ఇప్పటి వరకు వచ్చిన విత్తనాలను సబ్సిడీపై అందచేసిన వ్యవసాయ శాఖ అధికారులు మిగతా విత్తనాలు కావాలంటే సోమవారం వరకు ఆగాల్సిందేనని రైతాంగానికి నచ్చచెబుతున్నారు. ముందుస్తుగా వ్యవసాయశాఖ ప్రణాళికగా వ్యవహరించకపోవడంతో ఒకేసారి సన్నచిన్నకారు రైతులు విత్తనాల కోసం డీలర్లు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
మహికో విత్తనాలకు పెరిగిన డిమాండ్
మహికో కంపెనీకి చెందిన బిటి పత్తి విత్తనాలకు రైతాంగం నుండి విపరీతమైన డిమాండ్ నెలకొంది. జిల్లాలో మొత్తం లక్ష హెక్టార్లలో పత్తి సాగు చేయనున్నారు. దీంతో ఐదు లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లకు డిమాండ్ ఉండగా ప్రస్తుతం రెండు లక్షలకు పైగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కాగా జిల్లాలో బాగా డిమాండ్ ఉన్న మహికో విత్తనాలు మాత్రం 6600 రాగా ఇప్పటికే డీలర్లు అమ్ముకోవడం జరిగింది. తులసి, అంజనా, హనుమాన్, నూజివీడు లాంటి విత్తనాలు మార్కెట్‌లో ఉన్నా రైతాంగం ఆ విత్తనాల జోలికి వెళ్లడం లేదు. కేవలం మహికో విత్తనాలను కోరుతున్నారు. జిల్లాకు మహికో విత్తనాలు 12 వేల ప్యాకెట్ల వరకు వస్తాయని అధికారులు తెలిపినా ఇంకా సరఫరా కాలేదు. దీంతో ఈ విత్తనాలకు కృత్రిమ కొరత ఏర్పడింది. ఇదే ఆసరాగా డీలర్లు రైతాంగం నుండి దండుకుంటున్నారు. జిల్లా అంతటికీ కేవలం గజ్వేల్‌లో మాత్రమే డీలరు ఉండడంతో రైతాంగం గజ్వేల్ ప్రాంతానికి చేరుకుని మరి ఈ బిటి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. కాగా ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో రైతాంగం నిరాశ చెందుతోంది.

తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
* మంత్రి సునీతారెడ్డి
నర్సాపూర్,జూన్ 21: బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సద్విని యోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమశాఖ మంత్రి వి.సునీతారెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లోని భవాణి ఫంక్షన్ హాల్ నిర్వహించిన ఆరు మండలాలకు చెందిన లాభోక్తులకు ప్రభుత్వ పథకాలకు చెందిన కోటి రూపాయల రుణాలను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకుల నుంచి పొందిన రుణాలను సకాలంలో చెల్లించి ఇతరులకు రుణ సదుపాయం కల్గించాలని సూచించారు. తీసుకున్న రుణాలను సైతం సక్రమమైన పద్ధతిలో వాడుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్రరేఖ కంటే దిగువ ఉన్న వారిని ఆర్థికంగా అభివృద్ధి దిశగా నడిపేందుకు అనేక పథకాలను ప్రవేశె పట్టడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సమైఖ్యలకు 1400 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. అభయ హస్తం పథకం కింద సంవత్సరానికి 360 రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం మరో 360 రూపాయలను జమ చేసి ఇస్తుందని అన్నారు. మహిళలు ప్రైవేటు, మధ్య దళారీల వద్ద అప్పులు తీసుకోకుండా ఉండేం దుకు గాను స్ర్తినిధి బ్యాంకు ద్వారా 1500 కోట్ల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గ్రామ సమైఖ్యలకు డెయిరీ ఫాంలు ఇస్తున్నట్లు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. జిల్లా వ్యాప్తంగా దీపం పథకం కింద 12 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వగా, నర్సాపూర్ నియోజకవర్గంలో ఆరు వేల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. 2014 వరకు ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇప్పించమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా రాజీవ్ యువ కిరణాలు, ఆమ్ ఆద్మిబీమా పథకం, పశుక్రాంతి పథకం వంటివి ఉపయోగించు కోవాలని సూచిం చారు. కార్య క్రమంలో నియోజక వర్గ ప్రత్యేకాధికారి బాల్‌రెడ్డి, డిఆర్‌డిఏ పీడి రవీందర్, ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ చంద్రంగౌడ్, నాయకులు శ్రీరాంరెడ్డి, దుర్గారెడ్డి, సత్యంగౌడ్, శ్రీనివాస్‌గుప్త, లలిత, లక్ష్మీకాంతం, హన్మంత్‌రెడ్డి, విఠల్,విశ్వంభరస్వామి,కృష్ణారావు,ఐకెపి ఎరియా కోర్డినేటర్ ప్రకాష్,సిబ్బంది సుభాష్‌గౌడ్, గౌరిశంకర్,వెల్దుర్తి, కొల్చారం, నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

210 బస్తాల కాంప్లెక్స్ ఎరువుల పట్టివేత
* షట్టర్‌ను సీజ్ చేసిన అధికారులు
గజ్వేల్, జూన్ 21: గజ్వేల్‌లో ఓ ఫర్టిలైజర్ దుకాణ యజమాని కాంప్లెక్స్ ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే యత్నాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వమ్ముచేశారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సరస్వతి ట్రేడర్స్ నిర్వాహకులు గుమ్మటం సమీపంలోని ఓ షట్టర్‌లో ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన 90బస్తాలు, కోరామండల్ కంపెనీకి చెందిన 120 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు నిలువ చేసి చాటుమాటున అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ సమాచారాన్ని రైతులు గజ్వేల్ ఎడిఎ శ్రావణ్‌కుమార్‌కు సమాచారం అందించారు. దీంతో ఎడిఎ శ్రావణ్‌కుమార్‌తోపాటు గజ్వేల్, వర్గల్ వ్యవసాయాధికారులు ప్రవీణ్‌కుమార్, తులసీరాం సంఘటనాస్థలానికి చేరుకొని దుకాణాన్ని తెరిపించారు. ఈక్రమంలో వారు నిలువ చేసిన 210 బస్తాల కాంప్లెక్స్ ఎరువులు స్వాధీనం చేసుకోవడంతోపాటు షట్టర్‌ను సీజ్ చేశారు. కాగా రైతుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, దీనిని ఎంత మాత్రం సహించేది లేదని ఎడిఎ శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు ఎరువులు, విత్తనాలు అక్రమ నిలువలు చేస్తే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

ఎల్లారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
* ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సదాశివపేట, జూన్ 21: అభివృద్ధిలో వెనుకబడిన ఎల్లారం గ్రామంలోని సమస్యలను పరిష్కరింపజేసి ప్రగతి పథంలోకి తీసుకువెళతానని ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి చెందిన 11 లక్షల నిధులతో సామూహికంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టి ఒక్కొక్కరితో మాట్లాడి గ్రామ వౌలిక, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొన్ని కొన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానన్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా మిగిలిపోయిన కిలోమీటర్ బిటి రోడ్డుకు నిధులు సత్వరమే మంజూరు చేయిస్తానన్నారు. కమ్యూనిటిహాల్‌కు ప్రహరీగోడ, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానన్నారు. పాత గ్రామంలో ఉన్న పాట్ల స్థలంలో అన్ని కులాలకు సంబంధించిన శ్మశాన వాటిక ఏర్పాటుకు అనుమతి ఇప్పించి ప్రహరీగోడ నిర్మింపజేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రతి గడపకు మంజీర నీటిని అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నానని, ఇప్పటికే సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్‌తో పాటు సదాశివపేట, కొండాపూర్ మండలాలకు మంజీర జలాలను అందించే పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. కొండాపూర్ మండలానికి ముభారక్‌పూర్ గ్రామ శివారులోని మంజీర బ్యాక్ వాటర్ వద్ద ఇన్‌ట్యాక్ వెల్ నిర్మించి సంప్‌హౌస్‌కు నీటిని తరలించి మండలంలోని అన్ని గ్రామాలకు మంజీర నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఇన్‌ట్యాక్‌వెల్ పనితీరును గురువారం తాను పరిశీలించి పంపింగ్ చేయించానని, అరగంటలో కొండాపూర్ మండలంలోని ఇలియాబాద్ సంప్‌హౌస్‌కు నీరు చేరుకుందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అదే రోజున సదాశివపేట మున్సిపల్‌లో ముఖ్యమంత్రితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 200 ఎకరాల్లో పట్టణానికి చెందిన పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇప్పించే ప్రక్రియను ముఖ్యమంత్రి చేతులమీదుగానే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి కూడా సాగునీరు అందించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తానని అన్నారు. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సిద్దన్న ఎమ్మెల్యేకు శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ విశే్వశ్వర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, తహశీల్దార్ శంకరప్ప, ఎంపిడిఓ గౌతం, ఇన్స్‌పెక్టర్ నల్లమల రవి, ఆర్‌ఐ అనిత, పిఆర్ ఎఇ క్రిష్ట, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్, మార్కెట్ కమిటి డైరెక్టర్ నారాయణ, మాజీ సర్పంచులు సిద్దన్న, గండయ్య స్వామి పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
సంగారెడ్డి రూరల్, జూన్ 21: మధ్యాహ్న భోజన పథకంలో అక్షయపాత్రను రద్దుచేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులతోనే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా జిల్లాలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించారని, ఇతర ఏ జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. గత పది సంవత్సరాలుగా బిల్లులు అందకపోయినా ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కార్మికుల పొట్టగొట్టి సంపన్నులకు ఈ పథకాన్ని అప్పగించడం అన్యాయమన్నారు. వేడి వేడిగా ఆహారాన్ని విద్యార్థులకు అందించే పథకాన్ని కాదని ఏరాత్రో వండిన ఆహారాన్ని అందించే అక్షయ ప్రాతకు అప్పగించి విద్యార్థుల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడి వేడి ఆహారం అందించాలన్న సుప్రీం కోర్టు తీర్పును అధికారులు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఇప్పటికైన వెంటనే అక్షయ పాత్రను రద్దు చేయాలని, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఓ ప్రకాష్‌కుమార్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.మాణిక్యం, నర్సమ్మ, సునీత, సావిత్రి, లక్ష్మి, బాగ్యమ్మ, సత్తమ్మలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

గుర్తింపు పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలి
* జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్
సంగారెడ్డి రూరల్, జూన్ 21: జిల్లాలో 69 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 69 ప్రైవేట్ పాఠశాలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని, ఇప్పటికే వీటికి ఒకటి రెండు సార్లు నోటీసులను జిల్లా విద్యాధికారి కార్యాలయం నుండి జారీ చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించి తమ పిల్లల భవిష్యత్తును పాడు చేయ్యద్దని, ప్రభుత్వ అనుమతులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని సూచించారు.
ఫర్టిలైజర్స్ దుకాణాల తనిఖీ
మునిపల్లి, జూన్ 21: మునిపల్లి మండలంలోని ఫర్టిలైజర్స్ దుకాణాలను గురువారం మండల తహశీల్దార్ సత్యవతి ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారాన్ని బట్టి ఈ తనీఖీలు నిర్వహించడం జరిగిందని తహశీల్దార్ తెలిపారు. అధిక ధరలకు విక్రయించినట్లైతై దుకాణాలను సీజ్ చేస్తామని ఫర్టిలైజర్స్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఓ బాబునాయక్, ఎస్‌ఐ నారాయణ్‌రెడ్డి పాల్గొన్నారు.

* మంత్రి సునీతారెడ్డి
english title: 
minister sunitha reddy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>