ఒంగోలు, జూన్ 22: రాష్ట్రంలోని అన్ని బిసి వెల్ఫేర్ హాస్టళ్ళను అన్‌లైన్ చేయనున్నట్లు బిసి వెల్ఫేర్ హాస్టళ్ళ జాయింట్ డైరెక్టర్ మాధవీలత తెలిపారు. శుక్రవారం ఒంగోలుకు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో మాధవీలత మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని బిసి వెల్ఫేర్ హాస్టళ్ళను ఆన్‌లైన్ చేసి కంప్యూటరీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి విద్యార్థుల మెస్‌ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు అన్‌లైన్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రతి విద్యార్థి వివరాలు కంప్యూటరీకరణ చేయాలని, హాస్టళ్ళ విద్యార్థులతోపాటు సిబ్బంది వివరాలను కూడా కంప్యూటరీకరించాలని ఆమె తెలిపారు. ఈ కంప్యూటరీ కరణ ఆధునీకరణ విధానంతో అవినీతి అక్రమాలను నివారించే అవకాశం ఉంటుందని, సమర్థ వంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్‌ఫేర్ ఇన్‌చార్జి ఎన్ చంద్రవౌళీశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఇడి ఉమాదేవి, ఎబిడబ్ల్యు ఐడిసి మధన్, బిసి కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
20 మద్యం షాపులకు 29 దరఖాస్తులు
ఒంగోలు,జూన్ 22: జిల్లాలోని 20మద్యంషాపులకు ఇప్పటివరకు 29 దరఖాస్తులు దాఖలయ్యాయి. లైసెన్స్‌ఫీజు ఏడులక్షల 25వేలరూపాయలు వచ్చినట్లు ఒంగోలు డివిజన్ ఎక్సైజ్ ఇఎస్ ఎన్ ఆనందరాజు శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 321మద్యంషాపులు ఉండగా కేవలం 20షాపులకు మాత్రమే దరఖాస్తుదారులు దరఖాస్తులను దాఖలు చేశారు. ఈనెల 25వతేదీన భారీగా అన్నిషాపులకు దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖాధికారులు తెలిపారు.