ఎవరి ప్రపంచం వారిది కావచ్చు. ఎవరి నమ్మకాలు వారివి కావచ్చు. కానీ సారూప్యాలు అనేకం. మనిషి మనుగడ దగ్గరకు వచ్చేసరికి నమ్మకాలు బోలెడు. పిల్లలు దృష్టి దోషాలు, పిశాచ పీడలు ఇవన్నీ భాషలు, పేర్లు, చికిత్స వేరైనా, వెనకున్న నమ్మకం ఒక్కటే. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు ఉత్తర స్పెయిన్‌లోని బుర్గోస్ సమీప ప్రాంతంలోనివి. పసిపిల్లల్ని, భూత ప్రేతాల నుంచి కాపాడేందుకు శతాబ్దాల కాలంగా తల్లులు తీసుకుంటున్న జాగ్రత్తల వైనం ఇది. ఎరుపు, పసుపు రంగు చిత్రమైన దుస్తులు ధరించిన వ్యక్తి (ఎల్ కొలాచో అని అంటారు) ఇలా పిల్లల మీదుగా దూకి వెళ్తే, వారిని భూత ప్రేతాలు, తమ చిట్టి తల్లుల్ని, తండ్రుల్ని ఏమీ చేయలేవని, అక్కడి బంగారు తల్లుల నమ్మకం. ఏటా ఓ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 10న అక్కడ ఈ ఏడాది కార్యక్రమం జరిగింది.
ఎవరి ప్రపంచం వారిది కావచ్చు. ఎవరి నమ్మకాలు వారివి కావచ్చు.
english title:
yevari
Date:
Sunday, June 24, 2012