కావలసినవి
కొబ్బరి పొడి - 1 కప్పు
బెల్లం - 1/2 కప్పు
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
నెయ్యి - 2 టీ.స్పూ.
గోధుమ పిండి - 2 కప్పులు
మైదా - 2 కప్పులు
పెరుగు - 1/2 కప్పు
బేకింగ్ పౌడర్ - చిటికెడు
నూనె/నెయ్యి - 1/4 కప్పు
ఉప్పు - తగినంత
ఇలా చేయాలి
గోధుమ పిండి, మైదా, పెరుగు, బేకింగ్‌పౌడర్, ఉప్పు వేసి కలిపి అవసరమైతే నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఒక పాన్‌లో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లుపోసి కరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి పాన్‌లో వేయాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. గంటసేపు నానిన తర్వాత పిండిని తీసి కొద్దిగా నూనె వేసి బాగా మర్దనా చేసి ఉండలు చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని కొద్దిగా వెడల్పు చేసి చెంచాడు కొబ్బరి మిశ్రమం పెట్టి అంచులన్నీ దగ్గర చేసి మూసేయాలి. మళ్లీ పొడి పిండి చల్లుకుంటూ వెడల్పుగా వత్తుకోవాలి. పెనం వేడి చేసి ఈ పరాఠాలను నెయ్యి లేదా నూనెతో రెండు వైపులా కాల్చుకుని జామ్ లేదా తేనెతో సర్వ్‌చేయాలి. అలాగే తిన్నా బావుంటాయి. పిల్లలకు, స్వీట్స్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతాయి ఈ పరాఠాలు.