బెంగళూరు, జూలై 14: ఉడిపిలో ఒక దంత వైద్యుడు కట్నం కోసం తన భార్యను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆ మహిళ మూత్రాన్ని కూడా తాగాలని బలవంతం చేశాడని కేసు నమోదైంది. వారికి 11 నెలల క్రితం పెళ్లయింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ దంత వైద్యుడిని 12న అరెస్టు చేశారు. కాగా, విశ్వభారతి యూనివర్శిటీకి చెందిన కరాబీ హాస్టల్‌లో ఐదో తరగతి బాలికను మూత్రం తాగించిన ఉదంతంపై దర్యాప్తు జరిపి 10 రోజుల్లో నివేదికను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. ఇదిలా ఉండగా, బెంగాల్‌లో మూత్రం తాగించిన కేసులో బాలిక వివరాలను వివిధ పత్రికలు, చానెళ్లు వెల్లడించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సమాచార శాఖకు బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాల, బాలికల వివరాలను వెల్లడించడం జువనైల్ చట్టాన్ని ఉల్లఘించడమేనని, వారిపై కఠిన చర్యలుంటాయని నోటీసుల్లో కమిషన్ తెలిపింది. అంతేగాకుండా, బాలిక వివరాలను విశ్వభారతి యూనివర్శిటీ పత్రికా ప్రకటనలో వెల్లడించడాన్ని కూడా కమిషన్ ఆక్షేపించింది.
బెంగళూరులో కేసు నమోదు చేసిన ఒక దంతవైద్యుడి భార్య
english title:
case filed
Date:
Sunday, July 15, 2012