ఇస్లామాబాద్, జూలై 14: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం సౌదీ అరేబియా వెళ్తున్నారు. సౌదీ అరేబియాలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. అష్రాఫ్ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్లా అజీజ్‌తో సమావేశమవుతారు. ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియాతో అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతోనే కొత్త ప్రధాని సౌదీ పర్యటన ఉద్దేశమని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. పవిత్ర స్థలమైన సౌదీని ముందుగా సందర్శించి రాజుతో సమావేశం కావాలని కొత్త ప్రధాని ఆకాంక్షించినట్టు ‘డాన్’ పత్రిక పేర్కొంది. అధ్యక్షుడు జర్దారీపై అవినీతి కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన గిలానీ గత నెలలో ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ తొలి
english title:
pakistan sends letter
Date:
Sunday, July 15, 2012