భారతదేశం మామిడికి పుట్టిల్లు. ఇక్కడ పుట్టిన మొక్క కాబట్టి మామిడి ప్రాధాన్యత ఋగ్వేద కాలం నుంచి కనిపిస్తుంది. ఇంటికి పచ్చదనాన్ని ఇచ్చేది మామిడి తోరణాలే! ముంగిట తీర్చిదిద్దే రంగవల్లులలో మామిడి ఆకులనే చిత్రిస్తుంటారు మన ఆడపడుచులు. ప్రజాపతి స్వయంగా మామిడి వృక్షంగా అవతరించాడని మన నమ్మకం. ఆమ్రపాలి బుద్ధునికి కానుకగా ఇచ్చినందున బౌద్ధులకూ మామిడి పవిత్ర వృక్షం. ఒకసారి బుద్ధుడు మామిడి పండు తిని, దాని టెంకని పాతి చేతులు కడుక్కొన్నాడట. వెంటనే అక్కడ తెల్లని మామిడి మొక్క పూలూ, కాయలతో మొలకెత్తిందనీ, అప్పటినుంచీ బౌద్ధులు మామిడిని పవిత్ర వృక్షంగా భావిస్తారనీ ఐతిహ్యం. జైన దేవత అంబ మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నట్టు వర్ణన కనిపిస్తుంది. మన్మథుడికీ, మామిడి మొక్కకీ అవినాభావ సంబంధం ఉంది. తెలుగు వారి ఉగాదినాడు మామిడి మొక్కకు ఇచ్చే ప్రాధాన్యత గొప్పది. మావిచిగురు తిని కోయిల కూస్తుందని మన నమ్మకం. మొఘల్ చక్రవర్తులు, సుల్తానులూ మామిడిని ఇష్టపడ్డారు. అయితే, అది రాజవంశీకులకే చెందాలనే నిషేధాలుండేవట. అక్బర్ చక్రవర్తి లక్ష మామిడిమొక్కలు నాటండనే నినాదం ఇచ్చాడట! మామిడి అంటు కట్టడాన్ని రాజోద్యానవనాల్లో మాత్రమే జరపాలనే నియమాన్ని తొలగించి దేశం అంతటా మామిడి పెంచుకొనే అవకాశం కల్పించినవాడు షాజహాన్ చక్రవర్తి.
ఋగ్వేదంలో మామిడి మొక్కని ‘సహ’ అని పిలిచారని చెప్తారు. తరువాతి కాలం నాటి సంస్కృత గ్రంథాలలో చూత, రసాల పేర్లతో పాటు సహకార అనే పర్యాయ పదం కూడా కనిపిస్తుంది. బృహదారణ్యోపనిషత్తులో (కీ.పూ.1000)నూ, శతపథ బ్రాహ్మణంలోనూ ‘ఆమ్ర’ పదం తొలిగా కనిపించిందని పండితులు చెప్తారు. ఆమ్రాతక అనేది అడవి మామిడి (తీజజూ ఘశయ) కి సంబంధించిన మొక్క పేరు కావచ్చని కె.టి.అచ్చయ్య (హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్) గ్రంథంలో రాశారు. భారతీయ మామిడిని మాంగిఫెరా ఇండికా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికే మార్కెట్ ఎక్కువ కూడా! మామిడి పండు రంగుని ఇండియన్ ఎల్లో అంటారు. ఫిలిప్ఫైన్స్, పాకిస్తాన్ దేశాలలో దీని వాడకం ఎక్కువ. బంగ్లాదేశ్ తమ జాతీయ వృక్షంగా మామిడిని గౌరవించింది. రవీంద్రుడు ఆమ్ర మంజరి కావ్యం రాశాడు.
తమిళంలో మాన్-కాయ్, మాంగాయి పేర్లతో పిలుస్తారు. భాషావేత్తలు కేవలం తమిళ భాషా పదాన్ని మాత్రమే పరిశీలించి, ఈ మాన్ అనే పదం ఆమ్ర అనే సంస్కృత పదంలోంచి పుట్టి ఉంటుందని నిర్థారించారు. ఖక, చిజఆక అనే అర్థంలో మానుగ అనే ప్రయోగం కూడా తెలుగులో ఉంది. భాగం, మ్రాన్పడు, మానుపడు, మానయి నిలుచు అంటే- ఆశ్చర్యంతో చెట్టులాగా స్తంభించిపోవటం అని అర్థం. మాని లేక మ్రాని పదాలకు కూరగాయ అనే అర్థం కూడా ఉంది. పెద్ద వృక్షము, ఆహార యోగ్యమైనది అనే అర్థంలో మాను అనే పేరుతో మామిడి మొక్కని వ్యవహరించి ఉంటారని గమనించవచ్చు. ఇది ద్రావిడ పదమే. దాన్ని తమిళ పదంగా భాషావేత్తలు వక్రభాష్యం చెప్పారు. మానుకాయ- మానుగాయ- మాన్గాయ- మాన్గో పదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కదా..!
పోర్చుగీసులు భారతదేశంలోకి వచ్చాక, క్రీ.శ.1510లో ఈ ‘మాంగో’ పదాన్ని స్వీకరించి, ఇంగ్లీషులో ప్రవేశపెట్టారని చెప్తారు. ‘ఓ’ అనే అక్షరంతో అంతమయ్యే ఇంగ్లీషు పదాలు తక్కువ కాబట్టి ఘౄశయ భారతీయ పదమేనని తేల్చారు. పాశ్చాత్యులు మామిడి రుచిని బాగా ఇష్టపడసాగారు. కానీ, రిఫ్రిజిరేషన్ సౌకర్యాలు తెలియని ఆ రోజుల్లో ఊరగాయ పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి లాంటి ఊరగాయలన్నింటినీ ఇక్కడే తయారుచేయించి ఎగుమతి చేసుకోవటం ప్రారంభించారు. పోర్చుగీసులు ఈ పరిణామాలకు ప్రధాన కారకులు. తెలుగు నేల ఆ విధంగా ఊరగాయల తయారీకి కేంద్ర స్థానం అయ్యింది. ఇది 18వ శతాబ్ది నాటి కథ. శ్రీనాథుడి కాలంలో కనిపించని అనేక రకాల ఊరగాయలు ఆధునిక యుగంలో విస్తృతంగా తయారుకావడానికి, తెలుగు ప్రజలు ఊరగాయల తయారీలో ప్రసిద్ధులు కావటానికి ఈ నేపథ్యం ఉంది. చివరికి మాంగో పదం ఔజషరీళ (ఊరగాయ)కు పర్యాయ పదంగా యూరప్ అంతటా చెలామణి అయ్యింది కూడా! తెలుగులో మాగాయి అనే ఊరగాయ పేరు కూడా ఇలా ఏర్పడిందే!
యౄౄక ఆరీజశఒ రకం మామిడికాయలకు అమెరికాలో గిరాకీ ఎక్కువ. మన బంగినపల్లి మామిడికాయని అక్కడ ఱళశజఒ్ద్ఘ్ఘశ లేదా ఱళశజఒ్ద్ఘ అంటారు. అక్కడి మిరపకాయలు ఇక్కడికి చేరాయి. ఇక్కడి అమృతఫలమైన మామిడి అక్కడకు తరలిపోయింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలలో క్రమేణా వ్యవసాయంపట్ల అశ్రద్ధ పెరుగుతూ రావటంతో మామిడి తోటల విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతూ వస్తోందని గణాంకాలు చెప్తున్నాయి. ఉగాది నాటికే తెలుగు వంటిళ్ళలోకి మామిడికాయలు రంగప్రవేశం చేస్తాయి. పచ్చిమామిడికాయలతో పప్పు, పచ్చడి, చారు, మజ్జిగచారు, పులిహోర, తాండ్ర, లస్సీ .. ఇలా రకరకాల వంటకాలు చేసుకోవటం మనకు అలవాటు. మామిడి మొరబ్బా, ఆమ్‌చూర్ లాంటివి చింతపండుకు బదులుగా వంటకాలలో పనికొస్తాయి. చింతపండునీ, మామిడికాయనీ కలిపి ‘మాంగోరిండ్’ అనే కొత్త పదాన్ని అమెరికన్లు సృష్టించారు. మామిడిపండు జ్యూసులు, ఐస్‌క్రీములు, చాకొలేట్లు, ఫ్రూట్‌బార్లు, సాసులకు విదేశాలలో గిరాకీ ఎక్కువ. మాంసాహారాలలో మామిడిని చేర్చి వండుకోవటం ఫిలిప్ఫైన్స్ లాంటి దేశీయులకు అలవాటు. ఆపిల్‌కాయతో పోల్చినప్పుడు మామిడికాయలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మామిడిపండులో పీచు పదార్థాలు, ఎ-విటమినూ, సి-విటమినూ, ఇతర బి-కాంప్లెక్స్‌కు చెందిన విటమిన్లూ పొటాషియం, రాగితోపాటు కెరోటిన్ పదార్థం కూడా నిండుగా ఉంటుంది. మామిడి సొన మాత్రం విషపూరితం. ఉరుషియోల్ అనే విషరసాయనం మామిడి సొన, మామిడి తొక్క, మామిడి ఆకులు, మామిడి జిగురులో కూడా ఉంటుంది. అది చర్మానికి తగలకుండా చూసుకోవటం అవసరం.
తెలుగింటి మహాఫలం మామిడి. దీనికోసం ఉగాది ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తాం మనం. పులుపు చేసే అపకారాలన్నీ మామిడికాయలతోనూ ఉంటాయి కాబట్టి జీర్ణశక్తి బలంగా లేనివారు జాగ్రత్తగా తినాలి. మామిడిపండు కూడా కష్టంగా అరిగే పదార్థమే! మిరియాల పొడితో తింటే కాయైనా, పండైనా మామిడి అపకారం చేయకుండా ఉంటుంది.
భారతదేశం మామిడికి పుట్టిల్లు.
english title:
mahaa phalam mamidi
Date:
Sunday, July 15, 2012