కాబూల్, జూలై 14: అఫ్గానిస్తాన్‌లో ఒక కళ్యాణ మండపంలో శనివారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ యుద్ధవీరుడు, ప్రభుత్వ భద్రతా విభాగానికి చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు దాదాపు 23 మంది ఈ దాడిలో మృతిచెందారు. దేశంలో జాతుల పునరేకీకరణకు సాగుతున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. అఫ్గాన్ పార్లమెంట్ సభ్యుడిగా మారిన సోవియట్ వ్యతిరేక గెరిల్లా దళ నాయకుడు అహ్మద్ ఖాన్ సమాంగని (ఉజ్బెక్ జాతీయుడు) తన కుమార్తె వివాహానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలుకుతుండగా ఈ దాడి జరిగింది. సమాంగన్ రాష్ట్ర రాజధాని ఐబక్‌లో జరిగిన ఈ దాడిలో 23 మంది మృతిచెందగా, 60 మంది గాయపడినట్టు అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తెలిపారు.
అఫ్గానిస్తాన్‌లో ఒక కళ్యాణ మండపంలో శనివారం ఆత్మాహుతి
english title:
suicide attack
Date:
Sunday, July 15, 2012