Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘భ్రూణ హత్యలకు పాల్పడితే మరణశిక్ష విధించాలి’

$
0
0

జింద్ (హర్యానా), జూలై 14: భ్రూణహత్యలకు పాల్పడితే ఉరి శిక్ష విధించే కేసులను పెట్టాలని డిమాండ్ చేస్తూ హర్యానాలో జరిగిన ఖాప్ మహా పంచాయత్ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ఖాప్ పంచాయతీల పెద్దలు 300 మంది హాజరయ్యారు. ఈ సమావేశం హర్యానాలోని బీబీపూర్ గ్రామంలో జరిగింది. ప్రజల్లో భ్రూణహత్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే, తొలిసారి ఖాప్ పంచాయత్ సమావేశంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం. భ్రూణహత్యలను క్రూర చర్యగా మహాపంచాయత్ అభిప్రాయపడింది. ఈ దురాచారం వల్లే బాలికల సంఖ్య తగ్గిపోతోందని పేర్కొన్నది. ఈ సామాజిక రుగ్మతను అరికట్టడానికి ఒక ఉద్యమాన్ని నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా బీబీపూర్ గ్రామ మహిళలు ప్రారంభించిన ఉద్యమాన్ని బలపరచాలని గ్రామసభ కోరడంతో 300 మంది ఖాప్ పెద్దలు ఈ మహాపంచాయత్‌కు హాజరయ్యారు.

భ్రూణహత్యలకు పాల్పడితే ఉరి శిక్ష విధించే
english title: 
death sentence

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles