Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆరంబాకం పోలీస్‌స్టేషన్ వద్ద తమిళ జాలర్ల వీరంగం

$
0
0

తడ, ఆగస్టు 2: ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో జరిగిన చిన్నపాటి సమస్య ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య జఠిలంగా మారింది. గురువారం తమిళనాడు, ఆంధ్రా పోలీసుల మంతనాలు ఫలించకపోగా తమిళనాడులోని ఆరంబాకం పోలీస్‌స్టేషన్ సమీపంలో కారూరు గ్రామస్థుడు అయిన ఆరంబాకం జీవాపై నొచ్చుకుప్పం గ్రామస్థులు దాడి చేయడంతో అతను తప్పించుకుని ఆరంబాకం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో సదరు బాధితుడ్ని తమిళనాడుకు చెందిన దినపత్రిక విలేఖరి ఆరంబాకం పోలీస్‌స్టేషన్ వద్ద ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా నొచ్చుకుప్పం గ్రామస్థులు తమిళ పోలీసుల సాక్షిగా సదరు విలేఖరిపై దాడిచేశారు. కాగా, ఆంధ్రాకు చెందిన కారూరు గ్రామస్థుడైన జీవాపై దాడి జరిగిన సంఘటనను తెలుసుకుని కారూరు గ్రామస్థులు ఏకమై నొచ్చుకుప్పం గ్రామస్థులపై ధాడి చేయడానికి సన్నద్ధమవుతున్న విషయాన్ని తెలుసుకున్న తడ ఎస్సై శ్రీనివాసులరెడ్డి, సూళ్లూరుపేట సిఐ హనుమంతరావుకు సమాచారాన్ని అందించడంతో ఆయన గూడూరు డిఎస్పీకి జరిగిన విషయాలను వివరించారు. వెంటనే గూడూరు డిఎస్పీ కె సురేష్‌కుమార్ డివిజన్ పరిధిలోని పోలీస్ బలగాలతో ఆరంబాకానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారూరు, నొచ్చుకుప్పం గ్రామాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో ఐదుగురు సిఐలు, 10 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు సిబ్బంది, 70 మంది ఏఆర్ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, గత రాత్రి కారూరుకు చెందిన కట్టెలదొడ్డె యజమాని వినాయకం, అతని కుమారులు రాజాను కిడ్నాప్ చేసిన సంఘటనపై నొచ్చుకుప్పానికి చెందిన నలుగురిపై తడ పోలీసులు కేసులు నమోదు చేశారు. కారూరు గ్రామంలో ఎలాంటి గొడవలు జరుగకుండా గూడూరు డిఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు పాఠశాలకు
వెళ్లకుండా అడ్డగింపు
ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు గ్రామమైన కారూరుకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు తమిళనాడు ప్రాంతంలోని ఆరంబాకం వద్దనున్న ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా అడ్డుకుని కారూరు గ్రామానికి తరిమివేశారు. దీంతో విద్యార్ధులు పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి తిరుగుముఖం పట్టారు. నొచ్చుకుప్పం గ్రామస్థులు గొడవలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ తమిళ పొలీసులు వౌనంగా ఉండడంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు.
శాంతియుతంగా మెలగాలి : డిఎస్పీ
కారూరు, నొచ్చుకుప్పం గ్రామస్థుల వ్యక్తిగత సమస్యను ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల సమస్యగా సృష్టించవద్దని కె సురేష్‌కుమార్ ఇరు గ్రామస్థులకు సూచించారు. గురువారం ఆయన కారూరు భీములవారిపాలెం చెక్‌పోస్టు, నొచ్చుకుప్పం గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి మాట్లాడుతూ కొంతమంది రెండు గ్రామాలకు చెందిన యువకులు మద్యం సేవించి గొడవలు సృష్టించగా, ఈ చిన్నపాటి సమస్యను ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రెండు గ్రామాల సమస్యగా సృష్టించడం ఇరు గ్రామస్థులకు మంచిది కాదని డిఎస్పీ అన్నారు. తాను తమిళనాడు పోలీస్ అధికారులు, గూడూరు సబ్‌కలెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటున్నారన్నారు. ఇరు గ్రామాల మధ్య శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహిస్తున్నామని, అప్పటి వరకు రెండు గ్రామాలకు చెందిన ప్రజలు శాంతిని పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఏఆర్‌పిఎస్ శ్రీనివాసరావు, గుమ్మిడిపూండి డిఎస్పీ తందయ్య, సిఐలు సత్యనారాయణ, మాణికయ్యరావు, తహశీల్దార్ జాలిరెడ్డి, ఆర్‌ఐలు, విఆర్‌వోలు ఉన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్
నెల్లూరు రూరల్, ఆగస్టు 2: జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ గురువారం ఎండిఓ, ఎంఇఓ, ఎమ్మార్వో, ఆర్ అండ్ బి కార్యాలయాలను ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు చేసారు. ఈసందర్భంగా సమయానికి రాని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయా కార్యాలయాలలో ఉన్న రిజిస్టర్‌లను పరిశీలించి రాని అధికారులకు ఎర్ర సిరాతో ఇంటు మార్కు పెట్టారు. సమయానికి హాజరుకాని సిబ్బంది సాయంత్రం లోపు తగిన సంజాయిషీ తెలపాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి కార్యాలయంలో 10.20 గంటలకు అసలు అధికారులే లేకపోవటంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేసారు. సమయానికి రాకపోవటం మంచి పద్దతి కాదని, ఇలా బాధ్యతగల అధికారులు ఆలస్యంగా వస్తే ప్రజలకు ఎలాంటి సహకారాలు అందిస్తారని అన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కార్యాలయంలో ఉన్న కొంత మంది బ్రోకర్‌లు కలెక్టర్‌ను చూసి పరారయ్యారు. ఈకార్యాలయాలలో తనిఖీలో జరుగుతున్నాయని తెలిసి పక్కనున్న ఆర్డీవో కార్యాలయం సిబ్బంది కొంత ఆలర్టయ్యారు. కలెక్టర్ వచ్చే సమయానికి ఆర్డీవో మాధవీలత, ఎమ్మార్వో భక్తవత్సలరెడ్డి ప్రోటోకాల్ నిమిత్తం బయటకు వెళ్ళారు ఎంఇఓ కార్యాలయంలో మాత్రం అసలు కార్యాలయానికి తాళాలే తీయకపోవటంతో కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
టవర్ కారు డీకొన్న ట్రాక్టర్ అగిన రైళ్లు
బిట్రగుంట, ఆగస్టు 2: విజయవాడ డివిజనులోని శ్రీ వెంకటేశ్వర పాలెం-కావలి మధ్య గురువారం సాయంత్రం కావలి వైపు వెళ్తున్న విద్యుత్ టవరు కారును 155 ఎల్‌సి గేటు వద్ద ట్రాక్టరు ఢీకొనడంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్ల పరుగుకు అంతరాయం కలిగింది. దీంతో బిట్రగుంటలో పినాకిని, అల్లూరురోడ్డులో విజయవాడ ప్యాసెంజరు రైళ్లు నిలిచిపోయాయి. బిట్రగుంట నుండి లూకాస్ సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేయడంతో విజయవాడ వైపు వెళ్లు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మత్తుప్రయోగంపై
బస్సులో కలకలం
ఆత్మకూరు, ఆగస్టు 2: ఉదయగిరి నుంచి చెన్నై నగరానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మత్తు పదార్ధాన్ని ప్రయోగిస్తున్నారంటూ కలకలం రేగింది. గురువారం రాత్రి వస్తున్న ఈ బస్సులో తోటి ప్రయాణికులపై వైట్‌నర్ వంటి పదార్ధాన్ని ప్రయోగిస్తున్నట్లుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ బస్సు కరటంపాడు వద్దకు వచ్చిన సందర్భంలో ముగ్గురు బాలురపై అనుమానాలు ఎక్కువయ్యాయి. వెంటనే సదరు నిందితులుగా మారిన బాలురతో ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో వైట్‌నర్ వినియోగిస్తున్న బాలుర్ని ఎస్సై మందలించి పంపించేశారు.
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనపై
అన్ని కోణాల్లో విచారణ
ఎడి ఆర్‌ఎం స్పష్టం
నెల్లూరుసిటీ, ఆగస్టు 2: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఘటనపై గురువారం నెల్లూరు రైల్వే గెస్ట్‌హౌస్‌లో రైల్వే అధారిటీ సెఫ్టీ కమిషనర్ డికె సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ రైల్వే మేనేజర్ సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ నుంచి చెన్నై మధ్యలో పనిచేస్తున్న సిబ్బందిని విచారణ జరిపినట్లు ఎడి ఆర్‌ఎం సుబ్బారావు తెలిపారు. విచారణ అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అన్ని కోణాల నుంచి విచారణను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రమాదానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. మిగిలిన బృందాలను కూడా పిలిచి విచారిస్తామని తెలిపారు. అదేవిధంగా ఆరోజు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించిన ప్రయాణికులను కూడా పిలిచి విచారిస్తామని పేర్కొన్నారు. విచారణ పూర్తి అయిన తరువాత తుది నివేదికను అందచేస్తామని తెలిపారు.

జిల్లా యంత్రాంగం సేవలు భేష్

నెల్లూరు టౌన్, ఆగస్టు 2: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన సందర్భంగా సహాయ చర్యలు చేపట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం సత్వరం స్పందించిన తీరు ఎంతో ప్రశంసనీయమని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి కొనియాడారు. గురువారం ఉదయం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు రైలు బోగీ దగ్ధమైన రోజున తాను స్థానికంగానే ఉండటంతో ఉదయం ఆరుగంటల్లోపే సంఘటనాస్థలికి చేరుకున్నానన్నారు. అప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. సకాలంలో స్పందించినందుకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్షతగాత్రుల్ని ఆదుకోవడంలో తోడ్పడ్డ స్వచ్ఛంద రక్తదాతల్ని కూడా మేకపాటి ప్రశంసించారు. ఏదేమైనా ఈ దుర్ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అది ప్రమాదమా లేక విద్రోహ చర్య అనేది విచారణలోనే తేలాల్సి ఉందన్నారు. అనేక అనుమానాలు ఉన్నందున విద్రోహమైతే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మేకపాటి డిమాండ్ చేశారు. తాను ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని నాలుగు పర్యాయాలు కలిసినట్లు తెలిపారు. ఆ సందర్భంలో విజయవాడకు చెందిన మదన్‌లాల్, తదితరులు పేలుడు వలనే బోగీ దగ్ధమైనట్లు చెపుతున్నారన్నారు. ఏదేమైనా భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ జరగనున్న వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో తాను ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో జరిగిన చిన్నపాటి సమస్య ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య జఠిలంగా మారింది.
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>