Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పోర్టు నిర్మాణంతోనే అభివృద్ధి

$
0
0

చీరాల, ఆగస్టు 2: పోర్టు నిర్మాణం తరలించేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని పలు ప్రజా సంఘాల నాయకులు వాపోయారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 85శాతం భూసేకరణ జరిగి పోర్టు నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తీరా నిర్మాణ దశకు వచ్చేసరికి పోర్టును రాజకీయ కుట్రలో భాగంగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. పోర్టు నిర్మాణానికి కృష్ణపట్నంలో సైతం ప్రతి ఘటనలు ఎదురయ్యాయని, అయితే విజయవంతంగా కృష్ణపట్నం పోర్టును నిర్మించారని, అదే విధంగా చీరాల పరిసర ప్రాంతంలో పోర్టు నిర్మాణానికై సేకరించిన భూములలో పోర్టు నిర్మాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తద్వారా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అవుతుందన్నారు.
భూసేకరణ చేసే సమయంలో పోర్టుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులను ఒప్పించి భూసేకరణ చేసిన ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి అలసత్వం వహించటానికి గల కారణాలేంటని డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికిగాక, అదనంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చి వేయాలన్నారు. పోర్టు తరలించే ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోసాల ఆశీర్వాదం, బెజ్జం విజయ్‌కుమార్, గుమ్మడి ఏసురత్నం, గూడూరి శివరామప్రసాద్, పులిపాటి రాజు, దార్ల సింగయ్య, నాగమనోహర్‌లోహియా, ఇమ్నానియేలు, ఆవుల మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరం
మద్దిపాడు, ఆగస్టు 2: చిన్న పిల్లలకు తల్లిపాలతోపాటు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని ఐసిడి ఎస్ సిడిపి ఓ డి విజయలక్ష్మీ పేర్కొన్నారు. మండలంలోని సీతారామపురం, కొస్టాల సెంటర్లో గల బిసి అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు వరం లాంటిదని, వివిధ వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డలకు ఆరోగ్య కరంగా ఉండగలవని పేర్కొన్నారు. గర్భిణులకు , బాలింతలకు అన్ని విధాల పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ సిబ్బంది అందించాలని కోరారు. బాలికలకు రక్తహీనత కలగకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారా తగిన ఏర్పాట్లు చేయించాలని అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ బి జ్యోతి, అంగన్‌వాడీ సిబ్బంది అంజమ్మ, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
సాయికి విశేష పూజలు, అన్నదానం
మద్దిపాడు, ఆగస్టు 2: శ్రావణ పౌర్ణమి సందర్భంగా మద్దిపాడు అభయ షిరిడి సాయి మందిరంలో, దొడ్డవరప్పాడు శివసాయి దేవాలయంలో గురువారం షిడిరి సాయికి విశేష పూజలు భక్తుల సమక్షంలో అర్చకులు సుబ్రమణ్యం, సుబ్బాచారి నిర్వహించారు. అనంతరం శ్రావణమాస విశిష్టతను గురించి సాయి భక్తులు సుబ్బాచారి, మల్లేశ్వరరావు, పి రమణయ్య భక్తులకు వివరించారు. అనంతరం 600 మందికి దాతల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాత నవులూరి హనుమంతురావు, సుబ్బాచారి, సుబ్బారావు, శ్రీలక్ష్మీ, రవి, రజని, పున్నయ్య, కార్యనిర్వాహకులు శ్రీదేవి, అంజనాదేవి తదితర భక్తబృందం పాల్గొన్నారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వానికి ఢోకా లేదు
ఒంగోలు, ఆగస్టు 2: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో సుస్థిరంగా ఉంటుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. గురువారం స్థానిక డిసిసి కార్యాలయంలో జరిగిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ కరిముల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంకా చిరంజీవి, తదితర నియోజకవర్గాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వి ఆర్ గౌస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సుస్థిరంగా ఉందని, 2014 సంవత్సరంలో రాహూల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇటీవల ప్రజాస్వామ్య బద్ధంగా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరిగిందని, ఈ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేక్ కరిముల్లా ఎన్నిక కాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బంకా చిరంజీవి ఎన్నికైనట్లు తెలియజేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి యువరక్తం అవసరమని అన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏవైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరో ముఖ్య అతిధి రాజ్యసభ సభ్యులు జెడి శీలం మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. 2014న జరిగే ఎన్నికల్లో సోనియాగాంధి నాయకత్వంలో రాహూల్ గాంధీ పర్యవేక్షణలో యువజన కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో పిలుపునిచ్చారు. దేశంలో అందరు సమానత్వం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. భారతదేశంలోని 125 కోట్ల మంది జనాభ ఈనాడు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాణమే కారణమన్నారు. అందరు సమానత్వంగా ఉండేందుకు దివంగత ఇందిరాగాంధీ పనిచేశారని ఆయన తెలియజేశారు. అందు వలనే పేద, బడుగు, బలహీన ముస్లిం మైనార్టీతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో ఈనాటికి ఇందిరాగాంధి చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచి పోయారన్నారు. సోనియా గాంధికి రెండుసార్లు దేశ ప్రధాని అయ్యో అవకాశం వచ్చినప్పటికి ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. తన భర్తను చంపి జైల్లో ఉన్నవారికి సైతం క్షమాభిక్ష పెట్టిన మంచి మనస్సు కలిగిన మహానేత సోనియాగాంధి అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఆ సంక్షేమ పథకాలన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలుగా ప్రజలు గుర్తించాలే తప్ప వ్యక్తులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావని ప్రజలు గుర్తించాలని ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కోస్తా జిల్లాల్లోని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందటం ద్వారా మంచి అనుభవాన్ని సంపాదించవచ్చని తెలియజేశారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పోతుల రామారావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సంయుక్త కార్యదర్శి అయినాబత్తిన ఘనశ్యాం, ఐ ఎన్‌టియుసి జిల్లా జిల్లా అధ్యక్షులు రామస్వామి, మాజీ శాసన సభ్యులు కసుకుర్తి ఆదెన్న జాగర్లమూడి రాఘవరావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయి హనుమయ్య తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎస్వీ శేషయ్య, వేమా శ్రీను, ఎస్‌కె సైదా, జి వీరభద్రాచారి, కుసుమ, కొమ్ము కనకారావు తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు. తొలుత డిసిసి అధ్యక్షులు పోతుల రామారావు, నూతనంగా ఎన్నికైన ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరిముల్లా, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంకా చిరంజీవి, మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులచే ప్రమాణం చేయించారు. తొలుత స్థానిక ఇస్లాంపేట సెంటర్ నుండి జల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు కరిముల్లా అధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. సభలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ సభ్యులు జెడి శీలంలను యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ పూల మాలలతో సన్మానించారు.

ఘనంగా రక్షాబంధన్
చీరాల, ఆగస్టు 2: అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ. శ్రావణ పౌర్ణమి రోజున వచ్చిన రక్షాబంధన్ పండుగను అన్నా చెల్లెల్లు ఘనంగా జరుపుకున్నారు. అన్నా చెల్లెల్లు రక్షణకు ప్రతీకగా ఈ పండుగను అత్యంత ప్రేమతో జరుపుకున్నారు. ఉదయంనుంచే అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు తనకు జీవితాంతం రక్షణగా ఉండేందుకు ఈ రక్షా బంధన్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. దీనిలో భాగంగా తనకు ఇష్టమైన సోదరిలచే రాఖీలను చేతికి కట్టించుకొని పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో రాఖీలు అమ్మేందుకు ఏర్పాటుచేసిన స్టాల్స్ వద్ద పిల్లలు, పెద్దలు కిత కితలాడారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా దూర ప్రాంతాలనుంచి తమ సోదరీ మణుల వద్దకు వచ్చి తన సోదరభావంతో రాఖీలు కట్టించుకొని ప్రేమతో విలువైన కానుకలను రక్షణగా ఇవ్వటం జరుగుతుంది. రాఖీలు కట్టి సోదరుల వద్ద ఆశీర్వచనాలు పొందటం ఆనవాయితీ.
దేశ సంస్కృతి సంప్రదాయాలను
ప్రతిఒక్కరూ పాటించాలి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఆగస్టు 2: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిఒక్కరు పాటించాలని జిల్లాకలెక్టర్ అనితా రాజేంద్ర అన్నారు. గురువారం మనగుడి కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన వారిలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మనగుడి కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మనగుడి కార్యక్రమాల ద్వారా భక్తుల ఆలయాలకు వచ్చేవిధంగా ప్రత్యేకంగా ఆహ్వనించేందుకు దేవస్ధాన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నకేశవస్వామి దేవస్ధానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిఇలాఉండగా జిల్లాలోని 384 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం కింద ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. వేదపండితులు వేదమంత్రోచ్చరణల మధ్య ప్రత్యేకపూజలు నిర్వహించారు. జిల్లాలోని ఒంగోలు డివిజన్‌లో 160, కందుకూరు డివిజన్‌లో 137, మార్కాపురం డివిజన్‌లోని 80 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమం జరిగింది. భక్తులు ఆశేషంగా తరలివచ్చి ఆయా దేవాలయాల్లో అభిషేకం, అర్చన వంటి పూజలు నిర్వహించారు. వ్యాపారులు లక్ష్మిదేవిని అర్చించారు. శ్రావణపౌర్ణమిని కొందరు ప్రాయశ్చిత్తదినంగా భావించి అపరాధాలు మన్నించాలని ప్రార్ధనలు చేశారు.
అక్టోబర్ 2లోగా అర్హులందరికీ

ఇళ్ల పట్టాలు

ఒంగోలు, ఆగస్టు 2: ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాల పేదల సమస్యలను పరిష్కరించడంతోపాటు అర్హులైన పేదలందరికి ఇళ్ళ స్థల పట్టాలను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేది నాటికి ఇప్పించేందుకు కృషి చేస్తానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. ముస్లిం డవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎస్ ఎం బుజ్జి అధ్యక్షతన ఒంగోలు నగరంలోని బిలాల్ నగర్‌లో లోతట్టు ప్రాంతాల సమస్యల పరిష్కారంపై సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రభుత్వ భూములను గుర్తించి సుమారు 7 వేల మంది అర్హులైన పేద ప్రజలకు అక్టోబర్ 2 నాటికి ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇళ్ళ స్థలాలు ఇప్పించడంతోపాటు వారికి పొజీషన్ చూపించి పక్కా గృహాలు నిర్మించేందుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలైన బిలాల్ నగర్, పాపా కాలనీ, బలరాం కాలనీ, బాలినేని భరత్ కాలనీ, పొనుగుపాటి కాలనీ, కేశవరాజు కుంట తదితర కాలనీలలో రోడ్లు, డ్రైన్‌లు, సమస్యలతోపాటు తాగునీటి సమస్య, ఇళ్ళ స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఒంగోలు 1వ వార్డులో 91 లక్షల రూపాయల నిధులతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 82 లక్షల రూపాయలతో ఇస్లాంపేటలో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. త్రాగు నీటిని నగర ప్రజలకు ప్రతి రోజు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఒంగోలు నగరానికి సాగర్ నీటితోపాటు రామతీర్థం రిజర్వాయర్, గుండ్లక్మ రిజర్వాయర్‌ల నుండి నగరంలోని మొదటి, రెండు ఎస్ ఎస్ ట్యాంకులతోపాటు ఓవర్‌హెడ్ ట్యాంకులకు నింపి తాగునీటి సమస్యలు తలెత్తకుండ నగర ప్రజలకు చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. కలుషితమైన
తాగునీరు వస్తే మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆయన తెలియజేశారు. బిలాల్ నగర్‌లో కమ్యునిటీ హాలు స్థలం వివాదం కోర్టులో ఉందని కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కమ్యునిటీహాలు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిలాల నగర్ నుండి నగరంలోకి వచ్చేందుకు పోతురాజు కాలువపై ఒక చిన్న బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల్లో అన్ని వౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన, గెలుపొందక పోయిన మాగుంట కుటుంబం ప్రజా సేవలో ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు. ఏవైన సమస్యలు ఉంటే తన వద్దకు నేరుగా వచ్చి తెలియజేస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు కార్యాలయాల అధికారుల చుట్టూ పదే పదే తిరగ కుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తానని ఆయన తెలియజేశారు. తొలుత పలువురు ప్రజలు వారి వారి సమస్యలను ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆ మేరకు స్పందించిన ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వారి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు తహశీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో కబ్జా దారుల చేతుల్లో ఉన్న భూములను సర్వే చేయించి స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్ళ స్థల పట్టాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కార్పోరేషన్ కమీషనర్ ఎస్ రవీంద్రబాబు, ఒంగోలు నగర మాజీ అధ్యక్షులు నిమ్మకాయల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏసమ్మ, లక్ష్మి, సుల్తాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు పెద్ద ఎత్తు పాల్గొని వారి సమస్యలను ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఒంగోలు కార్పోరేషన్ కమీషనర్ ఎస్ రవీంద్రబాబులకు తెలియజేశారు.

పోర్టు నిర్మాణం తరలించేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని పలు ప్రజా సంఘాల నాయకులు
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>