Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘సామాన్యుల కోసం పథకాలను వుడా అమలు చేయాలి’

$
0
0

విశాఖపట్నం, ఆగస్టు 2: సామాన్యులకు మరింతగా చేరువయ్యేలా వుడా పథకాలు-ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర పెట్టబడులు, వౌలిక సదుపాయాల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పనులు, ప్రాజెక్టుల పనితీరుపై గురువారం వుడా కార్యాలయంలో సమీక్షలో మంత్రి మా ట్లాడుతూ ప్రజోపయోగ సంస్థగా గౌరలవాన్ని, ప్రతిష్ఠను పెంచుకునేందుకు కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని వీసి శశిధర్‌కు సూచించారు. ప్రస్తుతం వుడా పరిధి నాలుగు జిల్లాలకు విస్తరించి ఉన్నందున వీటి ప్రజలకు ప్రయోజనాలు అందించాలన్నారు. అభివృద్ధిని విశాఖ నగర పరిసరాలకే పరిమితం చేయకుండా వుడా పరిధి అంతటికీ సమానంగా అందించాలన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ లవ్ అగర్వాల్, జివిఎంసి కమిషనర్ బి.రామాంజనేయులు పాల్గొన్న సమీక్షా కార్యక్రమం లో ముందుగా వీసీ కోన శశిధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వుడా ప్రాజెక్టులు, కార్యకలాపాలను వివరించారు. మాస్టర్‌ప్లాను రహదారుల ని ర్మాణం, హరిత ప్రాజెక్టు, వైఎస్సార్ పా ర్కు, వుడా చిల్డ్రన్ ఏరినా, కైలాసగిరి జాగింగ్ ట్రాక్ పనులు తదితరమైన వాటి వివరాలను సవివరంగా తెలియజేశారు. నిర్మాణ కాంట్రాక్టర్‌తో తలెత్తిన హరిత ప్రాజెక్టు వివాదాన్ని వివరిస్తూ సకాలంలో చర్యలు తీసుకోవడంతోపా టు అనుభవజ్ఞులైన న్యాయ నిపుణుల సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రాజెక్టును వివాదాల నుండి బయటపడవేశామని, ప్రాజెక్టు పనులు వుడాయే సొంతంగా చేపట్టడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి రాశామని వీసీ తెలిపారు. వుడా ఆదాయ వనరులపై మంత్రికి సవివరంగా తెలియజేశారు. కాగా బడ్జెటరీ సపోర్టులో భాగంగా 2008 నుండి వేలంద్వారా విక్రయించిన భూముల ఆదాయంపై ఆదాయపన్ను వివాదం నడుస్తోందని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో జోక్యం అవసరమవుతోందని కోరగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయంపై చర్చిస్తామన్నారు. సామాన్యుల కోసం గండిగుండం వద్ద గృహ నిర్మాణ పథకాన్ని వుడా చేపడుతోందని, సుమారు 85 చదరపు గజాల విస్తీర్ణంలో ఇళ్ళ నిర్మాణానికి ప్రతిపాదించామని మంత్రికి వివరించారు. వుడా పరిధిలో నాలుగు జిల్లాల్లో వుడాపరంగా అభివృద్ధి పనులను ఏ ప్రాతిపదికన చేపడుతున్నారంటూ మంత్రి ప్రశ్నించగా ఆ యా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని చేపడుతున్నామని శశిధర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే స్థాయిలో ఉండే పనులు మాత్రమే చేపడుతున్నామన్నారు. విశాఖ, విజయనగ రం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రణాళికబద్ధంగా ప్రస్తుతం పెద్ద ది క్కు వుడాయేనని, అందుకు అనుగుణంగా ప్రాంతాల సమాజాభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. వుడా కార్యదర్శి ఎంఎస్ భగవాన్, చీఫ్ ఇంజనీరు ఐ.విశ్వనాథరావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యులత, డిఎఫ్‌ఓ బివిఎ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మండల సరిహద్దుల్లో మావోయిస్టు వారోత్సవాలు ?
కొయ్యూరు, ఆగస్టు 2: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను గురువారం మండల సరిహద్దుల్లో భారీ జనసందోహం మధ్య మావోయిస్టు అగ్రనేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. ఈమేరకు బూదరాళ్ళ పంచాయ తీ పరిధిలోగల మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన కొయ్యూరు, గూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. గతనెల 28వతేదీ నుండి ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలను భగ్నంచేసే దిశలో ఒకపక్క భారీ పోలీసు బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నా మావోలు వారి ఉనికిని చాటుకునే దిశలో భారీ స్థాయిలో వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిసింది. ఈకార్యక్రమం విజయవంతానికి రెండు రోజులపాటు విస్తృత ప్రచారం నిర్వహించి మరీ అమరులకు ఘనంగా నివాళులు మావోలు అర్పించారు.
మనగుడికి విశేష స్పందన
* తరలివచ్చిన మహిళలు
నర్సీపట్నం, ఆగస్టు 2: తిరుమల తిరుపతి దేవస్ధానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. శ్రవణా నక్షత్రం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుట్టినరోజు కావడంతో మనగుడిలో భాగంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి. డిప్యూటీ కమిషనర్ కె.సుశీల మాట్లాడుతూ ప్రజల్లో నానాటికీ తగ్గుముఖం పడుతున్న భక్త్భివాలను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దేశ సంస్కృతి, పరిరక్షణ విషయంలో కలిసికట్టుగా ఉండాలని కోరారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భాగవతంపై నిరంతర పఠనం జరగాలన్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన రాఖీలను ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాల అనంతరం రాఖీలను భక్తులకు అందజేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో 10 దేవాలయాల్లో మనగుడి నిర్వహించగా, డివిజన్‌లోని 13 మండలాల్లో 210 దేవాలయాల్లో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 60 ఏళ్ళకోసారి శ్రవణ నక్షత్రం వస్తుందని, ఆ రోజు వేంకటేశ్వరస్వామి పుట్టిన రోజుగా ఆమె పేర్కొన్నారు. పట్టణంలో నిర్వహించిన మనగుడికార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం అర్చకుడు రేజేటి ఆదిశేషు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో టి.టి.డి. కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ యలమంచిలి డివిజన్ ఇ. ఓ. శేఖర్‌బాబు, ఆలయ ధర్మకర్త తాండికొండ బ్రహ్మలింగస్వామి పాల్గొన్నారు.
విశాఖలో మూడు రెవెన్యూ మండలాలు?
‘ప్రభుత్వానికి ప్రతిపాదనలు
విశాఖపట్నం, ఆగస్టు 2: నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. దీనికి దీటుగా అవసరాలు తీర్చాల్సిన రెవెన్యూ మండల కార్యాలయాలు ఏర్పాటుకాలేదు. ఒకప్పుడు ఉండే మండల కార్యాలయంపైనే లక్షలాది మంది ఆధారపడాల్సి వస్తోంది. ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలతోపాటు విద్యార్థులకు అవసరపైన పత్రాల నుంచి రెవెన్యూ భూములకు చెందిన అనేక రకాలైన పత్రాల కోసం రోజులు తరబడి లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అవసరమైన ధ్రువపత్రాలు చేతికి రావడం లేదు. ఈ పరిస్థితి కొనే్నళ్ళుగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహావిశాఖ నగరపాలక సంస్థగా ఆవిర్భివించిన తరువాత 72 వార్డులుగా నగరం విస్తరించబడటం, ఇదే తరహాలో దక్షిణ, ఉత్తర, తూ ర్పు,పశ్చిమ నియోజకవర్గాలుగా ఏర్పాటుకావడం జరిగింది. ఈ విధంగా చూసినా నియోజకవర్గానికో తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉంది. 20 లక్షలకుపైగా జనాభా కలిగి ఉన్న విశాఖలో కనీసం నాలుగు తహశీల్ద్దార్ కార్యాలయాలు రావాల్సి ఉంది. అనకాపల్లి కేంద్రంగా 11 మండలాలను కలిపి ఒక రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తరువాత ప్రాధాన్యతగా విశాఖలో మూడు తహశీల్దార్ కార్యాలయాలను ఏర్పాటుచేసే యోచన తెరపైకి వచ్చింది. దీనికి తగినట్టుగా ఇక్కడి రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలను పంపాలని నిర్ణయించారు. పరిపాలన సౌలభ్యం, రెవెన్యూ సేవలను పూర్తిస్థాయిలో అందించడానికి తప్పనిసరిగా వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రతిపాదనల్లో పేర్కోన్నారు.
అనకాపల్లి కేంద్రంగా ఆర్డీఓ కార్యాలయం
నర్సీపట్నం నుంచి మాడుగుల, రోలుగుంట మండలాలను, విశాఖ డివిజన్ నుంచి అనకాపల్లి, కశింకోట, చోడవరం, చీడికాడ, బుచ్చియపేట, రావికమతం, కె.కోటపాడు, దేవరాపల్లి, మునగపాక, మండలాలను కలిపి అనకాపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు త్వరలో ఆదేశాలు జారీ కానున్నాయి. 2006లోనే దీనికి ప్రతిపాదనలు చేసిన తరువాత కొన్నాళ్ళపాటు ఇవి కాస్త మూలనపడ్డాయి.

బ్రతిమిలాడితే గాని
పశువులకు వైద్యం చేయరా..?
* సిబ్బందిని నిలదీసిన మావోయిస్టులు!
కొయ్యూరు, ఆగస్టు 2: వ్యాధుల బారిన పశుగణం కొట్టుమిట్లాడుతుంటే రైతాంగం వచ్చి బ్రతిమిలాడుకోవాలా? వైద్య అందించాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ పశువైద్య సిబ్బందిని మావోయిస్టులు నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. బూదరాళ్ళ పంచాయతీ శివారు చీడిపల్లిలో వ్యాధుల విజృంభించి పశుగణం మృత్యువాతకు గురవుతున్నట్లు వార్తా పత్రికల్లో కధినాలు వచ్చినా రాజేంద్రపాలెం పశువైద్య కేంద్రం సిబ్బంది స్పందించలేదు. దీంతో చీడిపల్లి నుండి కొం దరు రైతులు బుధవారం ఉదయమే రాజేంద్రపాలెం వచ్చి అక్కడి పశువైద్య కేంద్ర సిబ్బందిని బ్రతిమిలాడారు. ఎట్టకేలకు వెళ్ళిన సిబ్బంది గ్రామంలో వ్యాధులు సోకిన పశుగణానికి వైద్య సేవలు అందించి తిరుగు ప్రయాణంలో వస్తుండగా అనుకోకుండా మావోయిస్టులు తారసపడి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. సిబ్బంది వివరాలపై ఆరా తీసిన మావోలు కొండపై పశువులకు వ్యాధు లు సోకి మరణాలు జరుగుతున్నా మీకు పట్టడం లేదా? వైద్య అందించాల్సిన బాధ్యత మీకు లేదా? ఏ గ్రామం వాళ్ళు వచ్చి బ్రతిమిలాడితే ఆ గ్రామాలకే వెళ్తారా ? అంటూ నిలదీసినట్లు తెలిసింది. ఇక కొండలపై గ్రామాలకు వచ్చేటప్పుడు అన్ని వ్యాధులకు తగిన మందులు తేవాలని, విధిగా సిబ్బంది గుర్తింపు కార్డులతో రావాలని, మారుమూల ప్రాంతాల్లో వ్యాధుల బారిన పడి పశువులు మరణిస్తే సహించేది లేదని హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం. దీంతో గురువారం రెండో రోజు కూడా మొబైల్ లేబరీటరీతోపాటు రాజేంద్రపాలెం వచ్చిన విశాఖకు చెందిన పశువైద్య సిబ్బంది లక్ష్మణరావు( ఓ.ఎస్), లేబ్ అసిస్టెంట్ సన్యాసిరావు సైతం కొండలపై గల పలు గ్రామాల్లో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడంతోపాటు రక్తపూతలు సేకరణకు పశువైద్య కేంద్ర సిబ్బందితో కొండలెక్కడం విశేషం

సామాన్యులకు మరింతగా చేరువయ్యేలా వుడా పథకాలు-ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>