Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

$
0
0

అనకాపల్లి , సెప్టెంబర్ 6: అనకాపల్లి పట్టణంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు పల లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్ళు నిలిచిపోయాయి. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు, వాహనచోదకులు, వ్యాపా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన మురుగు కాలువ వ్యవస్థ లేక పోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలి చిపోయి రాకపోకలకు అవస్థలు పడ్డా రు. కురుస్తున్న వర్షాలకు కూరగాయల మార్కెట్ చిత్తడిచిత్తడిగా మారి దుర్గంధభరితం గా తయారైంది. దీంతో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారులు, కూరగాయలు కొనేందుకు వచ్చే కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ర్కెట్‌లో కనీస సౌకర్యాలు లేక రైతులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో చెత్త పేరుకుపోతుండడంతో మార్కెట్ అంతా దుర్గంధం వెదజల్లుతోంది. ఏమాత్రం వర్షం కురిసినా చెత్తాచెదారం, కుళ్లిన కూరగాయలు ఎక్కడపడితే అక్కడ పారవేయడంతో వర్షపునీరు నిలిచిపోతుండడంతో భరించలేని దుర్వాసన వస్తోంది. మార్కెట్‌లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశీళ్ల రూపంలో మున్సిపాలిటీకి లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నా సౌకర్యాల విషయంలో మున్సిపాలిటీ నిర్లక్ష్యం వహిస్తుంది. వ్యాపారాలు చేసుకునే వారికి కనీసం షెల్టర్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఎండకు, వానకు తడుస్తూ వ్యాపారాలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో మార్కెట్‌కు వచ్చే ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి.
మార్కెట్ ప్రాంగణంలో పందులు, ఆవులు, గేదెలు స్వైరవిహారం చేస్తుండటంతో మార్కెట్ ప్రాంగణమంతా చిత్తడిచిత్తడిగా మారి భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతోందని మార్కెట్‌కు వచ్చే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్గంధంలోనే వ్యాపారాలు చేసే రైతులు, వ్యాపారస్తులు రోగాల పాలవుతున్నారు. ఇప్పటికే పట్టణంలో డయేరియా, డెంగ్యూ వంటి పలు వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. రాత్రివేళల్లో మార్కెట్‌కు కూరగాయలు తీసుకువచ్చే రైతులు ఉండేందుకు కనీస సదుపాయాలు లేకపోవడంతో వర్షానికి తోడు దోమలు బాధ ఎక్కువవడంతో రైతులకు జాగారం తప్పడం లేదు. దీంతో కూరగాయల మార్కెట్ పరిస్థితి అధ్వాన్నంగా మారి అంటురోగాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి వ్యాపారాలు సక్రమంగా జరిగేట్లు చూడాలని పలువురు వ్యాపారస్తులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు.

మొద్దు నిద్రలో ప్రభుత్వం
* మహాధర్నాలో టిడిపి నేతలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6: రాష్ట్రం లో కుంభకర్ణుని నిద్రలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ గురువారం గురుద్వారా ప్రాంతంలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం వద్ద మహా ధర్నా జరిగింది. ఈ సందర్భణగా లోపలకు చొచ్చుకువెళ్ళిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యాలయ మెట్లపైనే బైఠాయించి పెద్దఎత్తున నినాదలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భం గా గౌడ్ మాట్లాడుతూ ఆరు మాసాల తరువాత నిద్రలేచిన తరువాత కూడా కాంగ్రెస్ ఢిల్లీ వెళ్ళిపోతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నిర్వహించదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోదని, అందువల్లే రైతులు, ప్రజల పక్షాన టిడిపి నిలబడి పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, 1.46 లక్షల కోట్ల రాష్డ్ర బడ్జెట్ ఉన్నా కనీసం కరెంటు కోసం వంద కోట్లైనా ఖర్చు చేయడం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏడు గంటలు వ్యవసాయానికిచ్చి ఆదుకోవాలని, కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ ఎంపీలు ఎవరు పక్షాన గెలిచారో చెప్పాలని ప్రశ్నించారు. వందలు, వేలాది కోట్లు సంపాదనకే తప్ప ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు కాదన్నారు. కరెంటు కోతలపై సోనియా, ప్రధానిలపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేస్తామనే హెచ్చరిక చేసిన క్షణంలోనే సమస్య తీరుతుందన్నారు. పైరవీలు తప్పితే ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. వర్షాల్లోనే విద్యుత్‌ఇవ్వకపోతే ఇక వేసవి కాలంలో ఏవిధంగా సరఫరా చేస్తారన్నారు. ముఖ్యమంత్రి నైతిక విలువలకు కట్టుబడితే వెంటనే రాజీనామా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడం, ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడం, సోనియా, ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడం చేయాలని లేనిపక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ అసమర్థపాలన వలనే రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. పదవులు, కుర్చీల కోసమే పాడులాడుతున్న ఎంపీలు, సిఎం ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి పలుకుబడి, పరపతి ఉన్నాయని, అటువంటి తమ పార్టీపై కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నేతలు అవాకులు, చవాకులు చేస్తుండడం తగదన్నారు. బలమైన ప్రతిపక్షపార్టీగా ప్రజల పక్షాన ఉంటూ సమస్యల గురించి పోరాడుతున్నా ఈ ప్రభుత్వం బాధ్యతను మరిచి వ్యవహరిస్తుందన్నారు. సుల్లూరుపేట ఎమ్మెల్యే పరస రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులకు కుర్చీలను కాపాడుకునేందుకే సరిపోతోందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య మాట్లాడుతూ వర్షాకాలంలోను విద్యుత్ లేకుండా చేసిన ఏకైక సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డికే ఘనత దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చీటింగ్ కేసు పెట్టి, పంటలు పోతున్నందుకు కాంగ్రెస్‌ను దోషిగా చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఈ రాష్ట్రంలో అతి తక్కువగానే ఉందన్నారు.
టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడా లేనివిధంగా ఎన్టీపీసీ ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి చంద్రబాబు చొరవ తీసుకున్నారని, సింహాద్రి పేరును పెట్టింది ఆయనేనన్నారు. ఇప్పుడు రెండు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నా దీనిని అందించలేని పరిస్థితుల్లో ఉందని, ముఖ్యమంత్రి చేతగానితనమేనన్నారు. ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ అసమర్ధ ప్రధాని పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిఎంగా ఉంటే పరిశ్రమలు, వ్యవసాయానికి కోతలుఉండేవి కాదన్నారు. ఈ ప్రభుత్వానికి దూరదృష్టి, స్థిరత్వం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సోనియా, ప్రధానిల వద్ద తాకట్టుపెట్టిందన్నారు. మాడుగుల ఎమ్మెల్యే డి.రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్‌ను సమర్థవంతంగా ఇవ్వగా, ఇపుడు ఏడు గంటలైనా సరఫరా చేయలేకపోతున్నారని, ముందుచూపు లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన మహాధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, ధూళిపాటి నరేంద్ర, దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, లింగారెడ్డి, కె.శ్రీ్ధర్, హనుమంత షిండే, నారాయణరెడ్డి, వెలగపూడి రామకృష్ణబాబు, ఎస్.సోమ, కె.లలితకుమారి, శ్రీరామ్ రాజగోపాల్, బోడు భాస్కర రామారావు, అంగర రామ్మోహన్, పెందుర్తి వెంకటేష్, కెఎస్‌ఎన్ రాజు, వై.శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, నగర అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, గ్రేటర్ విశాఖ మహిళా అధ్యక్షురాలు సయ్యద్ నర్గీస్, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి పాల్గొన్నారు. కళ్ళకు నల్లబ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలియజేశారు. అనంతరం సిఎండి అహ్మద్ నదీమ్‌కు వినతిపత్రం అందజేశారు.

సమస్యల పరిష్కారానికి
10 నుంచి గ్రామ బాట
* గిరిజన మంత్రి బాలరాజు
పాడేరు, సెప్టెంబర్ 6: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు వారంలో ఒకరోజు గిరిజన గ్రామాలను సందర్శించనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు చెప్పారు. స్థానిక పి.ఎం.ఆర్.సి. కార్యాలయంలోని ప్రత్యేక అతిధి గృహంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన గ్రామాలను ప్రతి వారం సందర్శించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏజెన్సీలోని పంచాయతీ కేంద్రం, లేదా పంచాయతీలోని గ్రామంలో ఈనెల 10వ తేదీ నుంచి పర్యటించి సమస్యలు తెలుసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో అమలు జరుగుతున్న తీరుతెన్నులను తమ పర్యటనలో స్వయంగా పరిశీలించనున్నట్టు ఆయన చెప్పారు. తాము నిర్వహించే కార్యక్రమంలో వి.ఆర్.ఒ. స్థాయి ఉద్యోగి నుంచి అన్ని శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో రహదారులు, పాఠశాల భవనాలు నిర్మాణం, తాగు, సాగునీటి సౌకర్యాల కల్పనతోపాటు వౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ఆయన చెప్పారు. మన్యం ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, ఆదిమజాతి గిరిజనులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై తనకు నివేదిక అందించాలని బాలరాజు ఆదేశించారు. ఈ సమావేశంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్, పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి బి.గణపతిరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

తగ్గిన నక్సల్స్ ప్రాబల్యం
అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 6: జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం బాగా తగ్గి శాంతియుత వాతావరణం ఏర్పడుతోందని జిల్లా ఎస్పీ జి. శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు గురువారం విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నక్సల్స్‌లో అనారోగ్య సమస్యలు పెరిగిపోవడం, నాయకులు సమర్ధవంతమైన బాధ్యత నిర్వహించ లేకపోవడం, అడవిలో రహస్యజీవనం కంటే జనజీవన స్రవంతిలో కలవడమే మంచిదనే అభిప్రాయం రావడం తదితర పరిణామాల వలన నక్సల్స్ ప్రాబల్యం బాగా తగ్గిపోతుందన్నారు. జనజీవన స్రవంతిలో కలిసే నక్సల్స్ సంఖ్య బాగా తగ్గుతుందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో వౌలిక వసతుల మెరుగుకు కృషిచేస్తున్నామన్నారు. పెదబయలు పోలీస్ స్టేషన్‌కు క్వార్టర్స్‌ను ఏర్పాటుచేయగా, అనకాపల్లి స్టేషన్‌కు క్వార్టర్స్ అవసరం లేదన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోను సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఇతరత్రా క్యాడర్లలోని పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్ల భర్తీచాలావరకు పూర్తయిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 45 వేల కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ జరిగిందన్నారు. శిక్షణ పొందిన మహిళలు లేకపోవడంతో మహిళా ఎస్‌ఐలు, సిఐల పోస్టులను సంబంధిత వర్గం వారితో భర్తీచేయలేకపోతున్నామన్నారు. రానున్న కాలంలో మహిళా పోలీస్ స్టేషన్లకు మహిళలనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా, ఎస్‌ఐలుగా నియమించే ప్రయత్నాలు జరగనున్నాయన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ షకీలాభాను, అనకాపల్లి సిఐ ప్రకాష్, ఎస్‌ఐ కృష్ణారావు పాల్గొన్నారు.

రూ.53 లక్షలతో అటవీ అభివృద్ధి పనులు
అరకులోయ, సెప్టెంబర్ 6: విశాఖ డివిజన్‌లో 53 లక్షల రూపాయల నిధులతో అటవీ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు విశాఖ డివిజన్ అటవీ అధికారి మహమ్మద్ తయ్యప్ తెలిపారు. అరకులోయ, అనంతగిరి మండలాల్లో జరుగుతున్న అటవీ అభివృద్ధి పనులను ఆయన గురువారం పరిశీలించా రు. లోతేరు, ఇరిగాయి, తోటవలస, పొలంగుడ, తోకవలస గ్రామాల్లో చేపట్టిన అటవీ పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కంప నిధులతో 17 హెక్టార్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. 1.30 లక్షల ఖర్చుతో నర్సరీల పెంపకం చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా 256 హెక్టార్లలో పలురకాల మొక్కల పెంపకం చేపడుతున్నట్టు చెప్పారు. అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమంలో గిరిజనులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అటవీ ప్రాంతాన్ని నాశనం చేయవద్దని, అటవీ అభివృద్ధికి కృషి చేస్తూ పర్యావరణ సమతుల్యం, పరిరక్షణకు సహకరించాలని గిరిజనులను కోరారు. పోడు భూముల్లో విరివిగా మొక్కల పెంపకం చేపడుతున్నట్టు మహమ్మద్ తయ్యప్ తెలిపారు. ఈ పర్యటనలో అనంతగిరి అటవీ రేంజ్ అధికారి రాజారావు, సెక్షన్ ఆఫీసర్ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.

చింతల బంద గెడ్డలో కారు బోల్తా
* రిటైర్డ్ హౌసింగ్ ఎ.ఇ. మృతి
* ముగ్గురు వైఎస్సార్ సి.పి.నాయకులకు గాయాలు
రోలుగుంట, సెప్టెంబర్ 6: రోలుగుంటకు సమీపంలోని పెద్ద మదుము వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటనలో రిటైర్డ్ హౌసింగ్ ఎ.ఇ. అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు వైఎస్సార్ సి.పి. నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాడుగుల మండలం కె.జె.పురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సి.పి. నాయకులు చందు రాంబాబు, రిటైర్డ్ హౌసింగ్ ఎ.ఇ. కాళ్ళ రామకృష్ణ వరాహాలక్ష్మీనర్సింహమూర్తి,కొత్తకోట వైఎస్సార్ సి.పి. నాయకుడు పందల దేవాలు మండలంలోని కె.నాయుడుపాలెంకి చెందిన వైఎస్సార్ నాయకుడు కిల్లాడ వెంకటరమణ నివాస గృహానికి గురువారం మధ్యాహ్నం వచ్చారు. కొంతసేపు వీరంతా చర్చలు జరుపుకొని అనకాపల్లి ఎం.పి. సబ్బం హరి మంజూరు చేసిన లక్షన్నర నిధుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చందురాంబాబుచే శంకుస్ధాపన చేయించారు. అనంతరం పై నలుగురు కారులో నర్సీపట్నం వైపు వెళ్తూ రోలుగుంటకు సమీపంలోని పెద్దమదుం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చింతలబంద గెడ్డలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ హౌసింగ్ ఎ.ఇ. కాళ్ళ రామకృష్ణ వరాలహాలక్ష్మీనర్సింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వాహనం వెనుక మోటారు బైక్‌లపై వెళ్తున్న మండల వైఎస్సార్ సి.పి. నాయకులు గాయపడగా, ముగ్గురిని నర్సీపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెద్దల సమక్షంలో శవపంచాయతీ నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మావోల వౌనంతో పోలీసుల్లో కలవరం?
గూడెంకొత్తవీధి, సెప్టెంబర్ 6: విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కదలికలు స్పష్టంగా కనిపించక పోవడంతో వారి భవిష్యత్ ప్రణాళిక ఏమిటో పోలీసులకు, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అంతుచిక్కడం లేదు. అక్కడక్కడ స్థానిక మిలీషియా సభ్యులు కరపత్రాలు వెదజల్లడం మినహా మరి ఏ కదలికలు స్పష్టం కానరావడం లేదు. విశాఖ- తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాలతోపాటు ఒడిశా సరిహద్దుల్లో స్పెషల్ పార్టీలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా మావోయిస్టు నాయకుల సంచారం లేదని, మిలీషియా సభ్యులు మాత్రమే సందర్శిస్తున్నారని పోలీసులకు సమాచారం అందుతోంది. దీంతో పోలీసు వర్గాలు మావోల వ్యూహంపై రకరకాలుగా ఊహించుకుంటున్నాయి.
మావోలు ఏదొక పథకం రూపొందించి పోలీసు వర్గాన్ని కలవరపరచవచ్చని అధికారులు భావిస్తున్నా రు. గతంలో ప్రశాంతంగా కొంతకాలంగా ఉండి వ్యూహంతో పోలీసులను దెబ్బకొట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో మరోసారి ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశాలు లేకపోలేదని పోలీసు వర్గాల భావిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 31వ తేదీన గూడెంకొత్తవీధి మండలం చీపురుగొంది గ్రామంలో పోలీసులు చుట్టుముట్టి నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకుని సజీవంగా ఐదుగురు మావోయిస్టులను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి వారం గడవకముందే సంపంగి గొంది గ్రామంలో తెల్లవారు జా మున మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీం తో సుమారు ఎనిమిది కిట్ బ్యాగ్‌లు, ఒక తపంచాతో పాటు భారీగా ఆయుధాలను వదిలివెళ్ళిన విషయం తెలిసిందే. దీం తో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు జూలై 20 నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు జరిగిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు చప్పగా సాగిన విషయం తెలిసిందే. గత రెండు ఎదురు దెబ్బలతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు కొంతకాలంపాటు అజ్ఞాతానికి వెళ్ళినట్లు తెలిసింది. ఈ అజ్ఞాతం పోలీసులను దెబ్బతీయడానికేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కూడా ఏదైనా విధ్వంసానికి దిగే ముందు కొంతకాలంపాటు రహస్య ప్రదేశాలకు మావోయిస్టుల వెళ్ళడం సర్వసాధారణం దీంతో మావోయిస్టులు వౌనంగా ఉన్నారంటే విధ్వంసానికి వ్యూహం పన్నుతున్న ట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు వౌనం గా ఎందుకు ఉన్నారని, నక్సల్స్ ఎక్కడైనా సమావేశమయ్యారా?, లేక ట్రైనింగ్ అవుతున్నారా? అనే అంశాలపై పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.

భారీ వర్షాలకు ఇళ్ళు, పంట
పొలాల ముంపు
మాకవరపాలెం, సెప్టెంబర్ 6: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, చెరువులు, కాలువలు పొంగి పంట పొలాలు, ఇళ్ళు ముంపునకు గురవుతున్నాయి. బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పైడిపాల ఎస్సీ కాలనీలో ఇళ్ళు ముంపునకు గురయ్యాయి. అలాగే కొండల అగ్రహారం సమీపంలో పంట పొలాలు కూడా ముంపునకు గురయ్యారు. గత వారంరోజులుగా ఊడ్చిన పొలాలు వరినాట్లు వేసేందుకు సిద్ధం చేసిన వరి నారు మడులు కూడా వర్షపు నీటికి మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసేందుకు సిద్ధం చేసిన సుమారు 10 ఎకరాలు నీటిలో మునిగిపోయిందన్నారు. ఈవిషయం తెలుసుకున్న తహశీల్దార్ పి.గంగాధర్ పైడిపాల కాలనీని, పంట పొలాలను సందర్శించారు. ఈసందర్భంగా కాల నీ వాసులు మాట్లాడుతూ కాలనీకి సమీపంలో వేస్తున్న లే -అవుట్ వలనే వర్షపు నీరంతా కాలనీలోకి వచ్చి ఆ నీరు తమ ఇళ్ళలోకి చేరుతుందన్నారు. గతంలో లే-అవుట్ వేసే స్థలం మధ్యలో సాగు నీటికాలువ ఉండేదని, దానిని లే-అవుట్ వేస్తున్న వారు భూమి చదును చేస్తూ కప్పేశారని, దీంతో ఆ కాలువ వచ్చే నీరంతా తమ ఇళ్ళలోకి వస్తుందని తెలిపారు. కాలనీలో సిమెంట్ రోడ్డు వేశారు కాని డ్రైనేజీలు నిర్మించక పోవడంతో వర్షం పడితే ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉంటుందని, పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ లే-అవుట్‌లో ఉన్న కాలువను తవ్వించి వర్షపు నీరు కాలనీలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వి.ఆర్.ఓ. సాంబ పాల్గొన్నారు.

ఆశ్రమాల్లో సమస్యలపై సర్వే
పాడేరు, సెప్టెంబర్ 6: గిరిజన సం క్షేమ ఆశ్రమ పాఠశాలల్లో నెలకున్న స మస్యలపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఐ.టి.డి.ఎ. అధికారులతో గురువారం మధ్యాహ్నం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా పనిచేస్తున్న 599 ఆశ్రమ పాఠశాలల్లో లక్షా 45 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పా రు. అయితే ఆశ్రమాల్లోని విద్యార్థులకు వౌలిక సదుపాయాలు లేక ఇబ్బందు లు పడుతున్న విషయాన్ని గుర్తించి ఇం దుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సదుపాయా లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సమగ్ర సర్వేను నిర్వహించి సమస్యలను గుర్తించాలని ఆయ న ఆదేశించారు. మండల కేంద్రం నుం చి ఆశ్రమ పాఠశాలకుగల దూరం, ఆశ్రమ పాఠశాలలో ఇంతవరకు ఉన్న సదుపాయాలు, భవనాల సంఖ్య, ఉపయోగంలో ఉన్న భవనాలు, మరమ్మతులకు గురైన భవనాలు, తాగునీటి సదుపాయం, పారిశుద్ద్య సౌకర్యాలు, సిబ్బం ది నివాస గృహాలు, ఆశ్రమాల్లోని ఫర్నిచర్, ప్లాంటేషన్, సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ నుంచి విడుదలైన నిధుల వివరాల అంశాలతో సమగ్ర సర్వే చేయాలని ఆయన సూచించారు. ఆశ్రమాల సర్వేకు ప్రతి మండలానికి డిప్యూటీ ఇంజనీర్, సహాయ ఇంజనీర్, రాజీవ్ విద్యామిషన్ అధికారి, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, ఐ.ఆర్.జి., పి.ఎం.ఆర్.సి. సిబ్బందితో బృందాలను నియమించాలని సోమేష్‌కుమార్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో పనిచేస్తున్న 103 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 35 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో చాలా పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు భవనాలు, శిథిల స్థితికి చేరిన భవనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామ ని కమిషనర్ చెప్పారు. కమిషనర్‌తో టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ సర్వే బృందాలను నియమించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ బిల్లుల కోసం టిడిపి ఆందోళన
డుంబ్రిగుడ, సెప్టెంబర్ 6: ఇందిరమ్మ బిల్లులను స్వాహా చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ఆందోళన నిర్వహించారు. మండల కేంద్రంలోని మూడురోడ్ల కూడలి నుండి గృహనిర్మాణ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు చెల్లించాల్సిన డబ్బులు అక్రమంగా డ్రా చేసుకుని స్వాహా చేసిన బ్యాంక్, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులను మోసం చేసినట్టు విచారణలో వెల్లడైనప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. గిరిజనులకు చెల్లించాల్సిన ఇందిరమ్మ బిల్లులను చెల్లించే విధంగా అధికారులు చర్య లు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం తహశీల్ధార్ పి.వీరబధ్రరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టి.సుబ్బారావు, కె.సుబ్బారావు, దనే్నరావు, సింహాద్రితో పాటు పలువురు గిరిజన లబ్ధిదారులు పాల్గొన్నారు.
11న వికలాంగులకు సదరన్ క్యాంపు
ముంచంగిపుట్టు, సెప్టెంబర్ 6: మండలంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగులంతా ఈ నెల 11వ తేదీన పాడేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న క్యాంప్‌కు హాజరు కావాలని ఎం.పి.డి.ఒ. ఎం.ఎస్.బాపిరాజు కోరారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని 80 మంది వికలాంగులు పింఛన్లు పొందుతూ ఇటీవల నిర్వహించిన సదరన్ క్యాంప్‌లకు హాజరు కాకపోవడంతో వారికి పింఛన్లు నిలిచిపోయినట్టు చెప్పారు. అయితే వీరందరికీ డి.ఆర్.డి.ఎ. మరో అవకాశం కల్పిస్తూ ఈనెల 10 నుంచి 15వతేది వరకు పాడేరు, అరకులోయ, చింతపల్లిలో సదరన్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మండలానికి చెందిన వికలాంగులు ఈనెల 11వ తేదీన పాడేరులో జరిగే సదరన్ క్యాంపునకు రేషన్ కార్డు, ఫించన్ మంజూరు పుస్తకం, వికలాంగులు గుర్తింపు ధ్రువపత్రంతో హాజరు కావాలని ఆయన సూచించారు.

‘రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలం’
డుంబ్రిగుడ, సెప్టెంబర్ 6: గిరిజన రైతులకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని సి.పి.ఐ. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడుతూరి రాంగోపాల్ అన్నారు. గిరిజన రైతులకు ఎరువులు, విత్తనాలు సక్రమం గా అందించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం రైతులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడంలో, విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతఏడాది నాసిరకం విత్తనాలు, కుళ్లిన బంగాళా దుంపలను రైతులకు పంపిణీ చేసి వారిని నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. రైతులకు అందాల్సిన ప్రోత్సాహకాలతోపాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సక్రమంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూషణరావు, ధనరాజ్ పడాల్, సింహాద్రి, పలువురు రైతులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనులపై విచారణ
అరకులోయ, సెప్టెంబర్ 6: మం డలం లోతేరు పంచాయతీలోని మారుమూల గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు గురువారం విచారణ నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫినో సిబ్బంది, ఉపాధి హామీ పథకం సిబ్బందిని బాధితుల సమక్షంలో అన్ని కోణాలలో విచారించా రు. ఫినో, ఉపాధి హామీ సిబ్బందిని విడివిడిగా విచారించి వారినుంచి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఉపా ధి పనులకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను తనిఖీ చేసి ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్టుగా ప్రాధమికంగా తేల్చారు. రికార్డులను పరిశీలించిన కొద్దీ అవినీతి అక్రమాలు మరింతగా బట్టబయలవుతున్నాయి. ఉపాధి హామీ పనుల నిధులను లబ్ధిదారులకు చెల్లించకుండా ఫినో సిబ్బంది దాదాపు 25 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు గిరిజన బాధితులు ఆరోపిస్తుండగా, 15 లక్షల రూపాయలు మాత్రమే ఫినో సిబ్బంది, మండల సహాయకుడు, పంచాయతీ సహాయకురాలు కుమ్మకై కాజేసినట్టు ప్రాథమిక విచారణలో నిర్థారణయ్యింది. 2012వ సంవత్సరం మే నెల మొదటి వారం, జూన్ మొదటి, రెండో వారానికి కూలి సొమ్ములను చెల్లించకుండా సిబ్బంది స్వాహాచేసినట్టు స్పష్టమైంది. ఈ సందర్భంగా విచారణ అధికారి వెంకటేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపా రు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరగడం వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తరువాత ఎంత మొత్తం అక్రమాలకు పాల్పడినదీ తెలుస్తుందని ఆయన అన్నారు. నిజానిజాలు వెలుకులోకి వచ్చాక ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని బాధిత గిరిజనులకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. ఈ విచారణలో స్థానిక ఎం.పి.డి.ఒ. కె.గౌరీశంకర్, పినో జిల్లా సమన్వయ కర్త భానుమూర్తి, గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, కె.రామారావు పాల్గొన్నారు.

10 నుంచి శాసనసభ కమిటీ ఏజెన్సీ పర్యటన
అరకులోయ, సెప్టెంబర్ 6: అరకులోయ, పాడేరు నియోజకవర్గాలలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాసనసభ కమిటీ పర్యటిస్తున్నట్టు శాసనసభ్యుడు సివేరి సోమ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమిటీ చైర్మన్ పి.రాజన్నదొర ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులు ఏజెన్సీలో పర్యటించనున్నారని చెప్పారు. విశాఖ మన్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను పర్యవేక్షించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. గిరిజనులకు అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానాన్ని కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గిరిజనుల సమస్యలపై కమిటీ సభ్యులకు వినతిపత్రాలు సమర్పించవచ్చునని ఆయన అన్నారు. కమిటీ సభ్యుడైన తాను గిరిజన ప్రాంతాలలో అన్ని రకాల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్టు సోమ చెప్పారు.
చొంపిలో డిఆర్ డిపో ప్రారంభం
అరకులోయ, సెప్టెంబర్ 6: మండలం చొంపి గ్రామంలో డి.ఆర్.డిపో ప్రారంభించినట్టు స్థానిక ఇందిరాక్రాంతి పథం ఎ.పి.ఎం.కృష్ణారావు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చొంపి పంచాయతీలోని గిరిజనులకు నిత్యావసర సరకులు అందుబాటులో ఉండాలన్న ఉద్ధేశ్యంతో డిపోను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ డిపో నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జనవరి 10,11,12వ తేదీల్లో అరకులోయ ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా చొంపి గ్రామాన్ని సందర్శించారు. తమ గ్రామంలో డి.ఆర్.డిపోను ఏర్పాటుచేయాలని గిరిజనులు శాసనసభ్యుల బృందాన్ని కోరిన దృష్ట్యా ఈ డిపోను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
పాఠశాల తనిఖీ
అరకులోయ, సెప్టెంబర్ 6: మండల ప్రత్యేక అధికారి ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, చినలబుడు అంగన్‌వాడీ కేంద్రాలను మండల ఇంజనీర్ త్రినాథరావు, ఇందిరాక్రాంతి పథం ఎ.పి.ఎం.కృష్ణారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయడంతోపాటు సంక్షేమ అభివృద్ధి పథకాల తీరు తెన్నులను పర్యవేక్షిస్తుండాలని కలెక్టర్ వి.శేషాద్రి ఇటీవల ఆదేశించడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల రికార్టులను వీరు పరిశీలించి పలు సూచనలు చేశారు.
మూడో రోజుకు చేరిన గిరిజనుల దీక్ష
అరకులోయ, సెప్టెంబర్ 6: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడిన ఫినో సిబ్బంది, ఉపాధి హామీ పథకం ఉద్యోగులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక ఎం.పి.డి.ఒ. కార్యాలయం ఎదుట దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేసి మండలం లోతేరు పంచాయతీకి చెందిన 21 గ్రామాల గిరిజనులు దీక్ష చేపడుతున్నారు. ఇంతవరకు ఎం.పి.డి.ఒ. కార్యాలయం ఎదుట రిలే దీక్ష చేపట్టిన గిరిజనులు గురువారం మాత్రం ఎం.పి.డి.ఒ. కార్యాలయంలోకి చొచ్చుకుపోయి బైఠాయించారు. మండల పరిషత్ సిబ్బంది వారించినప్పటికీ ప్రవేశ ద్వారాలను తెరిచి బలవంతంగా లోపలకు వెళ్లి బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు చెల్లించాల్సిన ఉపాధి హామీ పనుల కూలి సొమ్ము చెల్లించేంతవరకు కదిలేది లేదని ఆందోళనకారులు భీష్మించారు. తమకు న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షను విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టిన గిరిజన బాధితులు బుధవారం రాత్రి ఎం.పి.డి.ఒ. కార్యాలయం ఆవరణలోనే నిద్ర చేశారు. రిలే దీక్షలు చేపట్టిన వారిలో కొంతమంది గిరిజనులు అర్థాకలితో అలమటిస్తూ అస్వస్థతకు గురయ్యారు.

సన్యాసమ్మపాలెంలో జ్వరాలు
హుకుంపేట, సెప్టెంబర్ 6: మండలం సన్యాసమ్మపాలెం గ్రామంలో గిరిజను లు జ్వరాలతో మంచం పట్టారు. గ్రా మంలో ప్రతి గిరిజన కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వంతున జ్వరాలతో మూలుగుతున్నారు. గ్రామానికి చెంది న తమర్బ విశ్వనాధం, తమర్బ రమణమ్మ, బొండా జానకమ్మ, బొండా సుబ్బలక్ష్మీ, తమర్బ జానకమ్మ, కించే యి రాఘవేంద్ర, కించాయి హేమలత, అండేంగుల రాజ్‌దీపక్, తమర్బ లక్ష్మయ్యపడాల్, తమర్బ రుచిత, పడాల్ మాలమ్మ, పడాల్ సన్యాసి, బురిడి గంగమ్మ, బురిడి చిట్టమ్మ, పడాల్ అప్పలమ్మ, పడాల్ బాలన్న, కొర్రాబాబు, బాకూరు లింగమ్మ, వంతాల బిమలమ్మ, సంతారి వరలక్ష్మీ, సంతారి నర్సింమూర్తి, వంతాల చిన్నయ్య, కొ ర్రా బాలన్న, వంతాల పోతురాజు, బొం డా నీలమ్మ, బాకూరు పెద్దమ్మ, మోరి పద్మిని, కోడా కుమారి, బాకూరు సుభద్ర, మోరి పార్వతమ్మ, మోరి బానుప్రకాష్, మోరి మణికుమారి, మోరి రత్నకుమారి, వంతాల అవినాష్, మో ష్య ఈశ్వరమ్మ జ్వరాలతో బాధపడుతున్నారు. ఆరోగ్య సిబ్బంది తమకు వైద్య సేవలు అందిస్తున్నా జ్వరాలు అదుపులోకి రావడంలేదని గురువారం గ్రామాన్ని సందర్శించిన ఎం.పి.డి.ఒ. జి.వి.చిట్టిరాజు ఎదుట బాధితులు వా పోయారు.

అనకాపల్లి పట్టణంలో గురువారం ఉదయం
english title: 
heavy rains

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>